దెబ్బతిన్న పులిలా రాజస్తాన్.. ఇంకా బోణీ కొట్టని ఢిల్లీ.. టాస్ వార్నర్ సేనదే..

Published : Apr 08, 2023, 03:04 PM ISTUpdated : Apr 08, 2023, 03:11 PM IST
దెబ్బతిన్న పులిలా రాజస్తాన్.. ఇంకా బోణీ కొట్టని ఢిల్లీ.. టాస్  వార్నర్ సేనదే..

సారాంశం

IPL 2023: ఐపీఎల్ -16 టైటిల్ ఫేవరేట్లుగా ఉన్న రాజస్తాన్ రాయల్స్ కు గత మ్యాచ్ లో పంజాబ్ అనూహ్య షాక్ ఇచ్చింది.  నేడు  సంజూ శాంసన్ సేన.. ఢిల్లీ క్యాపిటల్స్ తో ఢీకొననుంది.  ఈ మ్యాచ్ లో  ఢిల్లీ క్యాపిటల్స్  టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ కు రానుంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 16లో  స్ట్రాంగెస్ట్ టీమ్స్ గా ఉన్న మూడు నాలుగు జట్లలో ఆర్సీబీ కూడా ఒకటి.   అటువంటి రాజస్తాన్ కు మూడు రోజుల క్రితం గువహతిలోని బర్సపర వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ షాక్ ఇచ్చింది.   ఈ ఓటమితో  దెబ్బతిన్న పులిలా ఉన్న  శాంసన్ సేన.. నేడు ఇదే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ ను ఢీకొనబోతున్నది. ఈ సీజన్ లో  ఢిల్లీ - రాజస్తాన్ లు తలపడటం ఇదే ప్రథమం. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్  టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.  రాజస్తాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్   చేయనుంది. బ్యాటింగ్ కు అనుకూలించే బర్సపర స్టేడియంలో  నేడు ఢిల్లీ - రాజస్తాన్ లు  అభిమానులను ఎలా అలిరిస్తాయో చూడాలి. 

పంజాబ్ తో మ్యాచ్ లో విజయానికి అంచుల దాకా వచ్చిన రాజస్తాన్.. ఆరు పరుగుల తేడాతో  ఓడింది.  ఈ మ్యాచ్ లో బట్లర్ తో పాటు  మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్,   దేవదత్ పడిక్కల్  లు విఫలమయ్యారు. ఆడిన రెండు మ్యాచ్ లలోనూ  కెప్టెన్ సంజూ శాంసన్ మెరుగైన ప్రదర్శన చేశాడు.  

గత  మ్యాచ్ లో  రాణించిన షిమ్రన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్ లు  అదే ఊపును ఢిల్లీతో కొనసాగిస్తే  వార్నర్ సేనకు తిప్పలుతప్పవు. బౌలింగ్ లో ఆ జట్టు  పేస్ విభాగంలో ఎక్కువగా ట్రెంట్ బౌల్ట్ మీదే ఆధారపడుతున్నది. కెఎం ఆసిఫ్ భారీగా పరుగులిచ్చుకుంటున్నాడు.  అశ్విన్, చహల్ స్పిన్నర్లుగా  రాణిస్తుండటం రాజస్తాన్ కు కలిసొచ్చేదే. 

 

ఇక గత రెండు మ్యాచ్ లలో ఢిల్లీ ప్రదర్శన  దారుణంగా ఉంది. లక్నోతో ఆడిన తొలి మ్యాచ్ తో  పాటు సొంత  గ్రౌండ్ లో గుజరాత్ టైటాన్స్ తో ఆడిన రెండో మ్యాచ్ లో కూడా  ఆ జట్టు పేలవ ఆటతీరుతో నిరాశపరిచింది. ఓపెనర్ పృథ్వీ షా, వన్ డౌన్ బ్యాటర్ మిచెల్ మార్ష్  దారుణంగా విఫలమవుతుండటం ఆ టీమ్ ను దెబ్బతీస్తున్నది. వార్నర్ రాణిస్తున్నా అతడికి అండగా నిలిచేవాళ్లు లేకపోతుండటంతో గడిచిన రెండు మ్యాచ్ లలో ఆ జట్టు భారీ స్కోర్లు చేయలేకపోయింది. బౌలింగ్ లో నోర్జే కలవడం  ఆ జట్టుకు  శుభసూచికమే. కానీ ముఖేశ్ కుమార్ భారీగా పరుగులిస్తున్నాడు. ఖలీల్ అహ్మద్ కూడా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు.   అయితే అక్షర్ పటేల్ మాత్రం ఆల్  రౌండ్ ఆటతో ఆకట్టుకుంటున్నాడు. 

తుది జట్లు : 

ఢిల్లీ క్యాపిటల్స్ :   డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మనీష్ పాండే, రిలీ రూసో, రొవ్మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ పొరెల్, అన్రిచ్ నోర్జే, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ 

రాజస్తాన్ రాయల్స్ :   జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, షిమ్రన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జేసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చహల్ 

PREV
click me!

Recommended Stories

5 Wickets in 1 Over : W, W, W, W, W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ కొత్త చరిత్ర
Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !