సన్ రైజర్స్‌తో మ్యాచ్ ఆడేందుకు వచ్చి ఐకాన్ స్టార్‌ను కలిసిన పంజాబ్ ప్లేయర్లు..

Published : Apr 08, 2023, 01:52 PM IST
సన్ రైజర్స్‌తో మ్యాచ్ ఆడేందుకు వచ్చి ఐకాన్ స్టార్‌ను కలిసిన పంజాబ్ ప్లేయర్లు..

సారాంశం

IPL 2023: ‘పులి రెండడుగులు వెనక్కి వేసిందంటే  పుష్ప వచ్చినట్టు’అంటూ  యూట్యూబ్ లో  సంచలనం రేపుతున్న టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను  తాజాగా పంజాబ్ కింగ్స్ ప్లేయర్లు కలిశారు. 

ఐపీఎల్-16లో వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న పంజాబ్ కింగ్స్.. ఆదివారం (ఏప్రిల్ 9)  సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ ఆడేందుకు   హైదరాబాద్ చేరుకుంది.   ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్ మొదలుపెట్టిన  పంజాబ్ ఆటగాళ్లు..  శుక్రవారం రాత్రి ఆటవిడుపులో భాగంగా భాగ్యనగరాన్ని తిలకించేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే  ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న   పుష్ప రాజ్ తో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

పంజాబ్ కింగ్స్ కు ఆడుతున్న రాహుల్ చహర్,    హర్‌ప్రీత్ బ్రర్ లు టాలీవుడ్ ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ ను కలిశారు.  బన్నీతో కలిసి ద ఫోటోలకు ఫోజులిచ్చారు.  ఈ ఫోటోను రాహుల్ తన  ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. ‘హైదరాబాద్ లో కలవడానికి ఇంతకంటే బెటర్ పర్సన్ ఎవరైనా ఉన్నారా..?’ అని రాసుకొచ్చాడు. 

 

ఇదిలాఉండగా   నేడు తన 41వ పుట్టినరోజును జరుపుకుంటున్న  బన్నీ..   ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు.   ఐకాన్ స్టార్  బర్త్ డే సందర్భంగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న  పుష్ప -2  కాన్సెప్ట్ టీజర్ ను గురవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ కు ముందు  ‘వేర్ ఈజ్ పుష్ప’ అని   ఆసక్తి రేపిన  టీమ్..  కాన్సెప్ట్ టీజర్ తో   దుమ్మురేపింది.  ఈ  ట్రైలర్ లో  పోలీసుల నుంచి తప్పించుకున్న  పుష్పరాజ్ ను వీడియో చివర్లో  పులితో పోల్చుతూ  చూపించిన షాట్  అభిమాలను అలరిస్తున్నది.  
 ఈ సందర్భంగా వచ్చే డైలాగ్  ‘పులి రెండడగులు వేసిందంటే  పుష్ప వచ్చినట్టు’అంటూ  బన్నీ చెప్పే డైలాగ్ కు  విజిల్స్ పడుతున్నాయి. విడుదలకు ముందే  చిత్రంపై భారీ అంచనాలను పెంచేసిన ఈ సినిమా పోస్టర్ కూడా   సంచలనంగా మారింది.  

 

ఇక పంజాబ్ కింగ్స్ విషయానికొస్తే.. మొహాలీ వేదికగా ఆడిన తొలి మ్యాచ్ లో  కోల్కతా నైట్ రైడర్స్ ను   ఏడు పరుగుల తేడా (డక్‌వర్త్ లూయిస్ విధానంలో) తో ఓడించిన  పంజాబ్.. మూడు రోజుల క్రితం రాజస్తాన్ రాయల్స్ తో గువహతి వేదికగా ముగిసిన మ్యాచ్ లో  ఐదు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది.  ప్రస్తుతం పాయింట్ల పట్టికలో  మూడో స్థానంలో ఉన్న పంజాబ్.. రేపు  సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో కూడా సత్తా చాటాలని భావిస్తున్నది. 
 

PREV
click me!

Recommended Stories

5 Wickets in 1 Over : W, W, W, W, W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ కొత్త చరిత్ర
Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !