ఢిల్లీకి డబుల్ గుడ్ న్యూస్.. ఆ దొంగలు దొరికారు..! బ్యాట్లు, ఇతర సామాగ్రి సేఫ్

Published : Apr 21, 2023, 06:19 PM IST
ఢిల్లీకి డబుల్ గుడ్ న్యూస్.. ఆ దొంగలు దొరికారు..! బ్యాట్లు, ఇతర సామాగ్రి సేఫ్

సారాంశం

IPL 2023: ఐపీఎల్-16లో ఫస్ట్ విక్టరీ నమోదుచేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు   డబుల్ గుడ్ న్యూస్  దక్కింది. ఇటీవలే  ఆ జట్టు ఆటగాళ్లు  కోల్పోయిన  బ్యాట్లు, ఇతర సామాగ్రి కూడా దొరికాయి. 

ఐపీఎల్ -  2023 సీజన్ లో   ఐదు వరుస పరాజయాల తర్వాత గురువారం  కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో   గెలిచి   చాలా రోజుల తర్వాత విన్నింగ్ ఫీలింగ్ ను ఎంజాయ్ చేస్తున్న ఢిల్లీకి  మరో శుభవార్త అందింది.   ఇటీవలే   ఢిల్లీ ఆటగాళ్లు పోగొట్టుకున్న  బ్యాట్లు, ఇతర సామాగ్రిని  దొంగిలించిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని  స్వయంగా   డేవిడ్ వార్నర్ తన ఇన్‌స్ట్రాగ్రామ్ స్టేటస్ లో  వెల్లడించాడు.  

ఈనెల 15న బెంగళూరు వేదికగా  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో  మ్యాచ్ ముగిసిన తర్వాత  ఆదివారం   ఉదయం ఢిల్లీ ఆటగాళ్లు బెంగళూరు నుంచి వచ్చేశారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు చేరుకున్నాక తమ కిట్లలోని వస్తువులు కోల్పోయినట్టు ఆటగాళ్లు గుర్తించారు. 

దొంగలు.. ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కు సంబంధించిన బ్యాట్స్ తో పాటు మిగిలిన ఆటగాళ్ల  షూస్, గ్లవ్స్, థై పాడ్స్, క్రికెట్ కిట్స్ లలోని  ఇతర సామాగ్రులను దొంగిలించారు.   విదేశీ ఆటగాళ్లు వాడే బ్యాట్ విలువ  ఒక్కోటి  లక్ష రూపాయలు ఉంటుందని అంచనా.  కాగా ఆటగాళ్లు ఈ విషయం  ఢిల్లీ యాజమన్యానికి  ఫిర్యాదు చేసిన వెంటనే   వాళ్లు పోలీసులకు కంప్లైంట్  ఇచ్చారు. తాజాగా  పోలీసులు..  దొంగలను  పట్టుకోవడంతో పాటు దొంగిలించిన సామాగ్రిని  కూడా రికవర్ చేసుకున్నారు.  అయితే ఇవి ఎవరు దొంగతనం చేశారన్నది మాత్రం వార్నర్ గానీ, ఢిల్లీ యాజమన్యం గానీ పోలీసులు గానీ   వెల్లడించలేదు. 

 

వార్నర్ తన ఇన్‌స్టా ఖాతాలో ‘వాళ్లు (పోలీసులు) దొంగలను  పట్టుకున్నారు. కొన్ని మిస్ అయినా  థ్యాంక్యూ...’అని  రాసుకొచ్చాడు. ఇదిలాఉండగా  ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల వస్తువులు దొరికిన తర్వాత  ట్విటర్ లో పలువురు   స్పందిస్తూ.. ‘ఎలాగూ వాళ్లు ఆడటం లేదు కదా. నిన్న కేకేఆర్ తో మ్యాచ్ లో ఢిల్లీ ఆట చూశాక దొంగలకే జాలేసి  వాళ్లు కొట్టేసిన వస్తువులను తిరిగి ఇచ్చేసినట్టున్నారు’ అని కామెంట్ చేస్తున్నారు. కాగా  కేకేఆర్ తో మ్యాచ్ గెలిచిన తర్వాత  ఢిల్లీ  ఈనెల24న ఉప్పల్ వేదికగా హైదరాబాద్ తో మ్యాచ్ ఆడనుంది. 


 

PREV
click me!

Recommended Stories

ఐపీఎల్ ముద్దు.. హనీమూన్ వద్దు.. నమ్మకద్రోహం చేసిన ఆసీస్ ప్లేయర్.. పెద్ద రచ్చ జరిగేలా ఉందిగా
విదేశీ లీగ్‌ల్లో ఆడనున్న రో-కో.. ఐపీఎల్ చైర్మన్ ఏమన్నారంటే.?