
ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ప్లేయర్లలో డేవిడ్ వార్నర్ కూడా ఒకడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కెప్టెన్‌గా 2016లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన డేవిడ్ వార్నర్, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టీవ్‌గా ఉంటాడు... అభిమానుల కోసం తెలుగు పాటలకు డ్యాన్స్ చేస్తూ, ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసే డేవిడ్ వార్నర్, ‘అల వైకుంఠపురంలో’ మూవీలో ‘బుట్ట బొమ్మ’ సాంగ్‌కి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ రావడానికి ప్రధాన కారణం...
ఆ సినిమా టైమ్ నుంచి అల్లు అర్జున్‌ని ఫాలో అవుతున్న డేవిడ్ వార్నర్, ‘పుష్ప’ సినిమాలో స్టెప్పులు కూడా వేశాడు. ఆస్ట్రేలియా మ్యాచ్ గెలిచినా... ‘తగ్గేదే లే’ సెలబ్రేషన్స్ జరుపుకుంటూ, ఫ్యాన్స్‌ని అలరించే వార్నర్, ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి మ్యాచ్ నుంచి వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడింది ఢిల్లీ క్యాపిటల్స్. ముంబై ఇండియన్స్‌తో ఆఖరి ఓవర్ ఆఖరి బంతి ఓటమి మినహాయిస్తే మిగిలిన మ్యాచుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది...
ఎట్టకేలకు కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ని ఓడించి, ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి విజయం అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ విజయం తర్వాత ‘పుష్ప 2’ సినిమాలో అల్లు అర్జున్ అమ్మవారి గెటప్‌లో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు డేవిడ్ వార్నర్....
‘ఇది కానివ్వు మచ్చ’ అంటూ అల్లు అర్జున్‌కి రూ.10,001 పంపినట్టు పనిలో పనిగా క్రెడ్‌కి ప్రమోషన్ కూడా చేసేశాడు. దీంతో అల్లు అర్జున్ గెటప్‌లో డేవిడ్ వార్నర్ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాడని, బన్నీ ఎలాగైనా వార్నర్ భాయ్ కోసం ఓ చిన్న రోల్ రెఢీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.. 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్‌తో గొడవలు, కెప్టెన్సీ పోయి, టీమ్‌లో ప్లేస్ కోల్పోయి... ఆఖరికి ఆరెంజ్ ఆర్మీనే వదిలేయాల్సి రావడంతో డేవిడ్ వార్నర్... ఇన్‌స్టాలో చేసే వేషాలు తక్కువయ్యాయి.
ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ తర్వాత డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కావచ్చని ప్రచారం జరుగుతోంది. కాబట్టి వార్నర్ భాయ్‌ని ఎలాగైనా సినిమాల్లోకి అదీ తెలుగు సినిమాల్లోకి తీసుకురావాలని అల్లు అర్జున్‌ని, సుకుమార్‌ని కోరుతున్నారు ఫ్యాన్స్...
తిరుపతిలో జరిగే గంగమ్మ జాతరలో పురుషులు, మహిళల్లా ముస్తాబు అవుతారు. శతాబ్దాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ‘పుష్ప 2’లో చూపించబోతున్న సుకుమార్, అల్లు అర్జున్‌తో షాకింగ్ గెటప్ వేయించి, టాలీవుడ్‌ని షేక్ చేసేశాడు. లాక్‌డౌన్ ఆంక్షలు, టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలతో ఆంధ్రాలో ‘పుష్ప’ మూవీ, నష్టాలనే మిగిల్చింది.
అయితే ఉత్తర భారతంలో అభిమానులు, ‘పుష్ప’ మూవీని సూపర్ డూపర్ హిట్ చేశారు. ఎలాంటి ప్రమోషన్ లేకుండా హిందీలో విడుదలైన ‘పుష్ప’ భారీ లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో ‘RRR’, ‘KGF 2’ మూవీ బడ్జెట్లను మించి, ‘పుష్ప 2’ కోసం ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారు నిర్మాతలు.