IPL: ఐపీఎల్ రాజ్యంలో పంజాబ్ ‘కింగ్స్’ అయ్యేదెన్నడో.. పోరాట వేదికలు, సైనికదళం ఇదిగో..

Published : Mar 24, 2022, 02:01 PM IST
IPL: ఐపీఎల్ రాజ్యంలో పంజాబ్ ‘కింగ్స్’ అయ్యేదెన్నడో.. పోరాట వేదికలు, సైనికదళం ఇదిగో..

సారాంశం

IPL 2022: పేరులో కింగ్స్ ఉన్నా జట్టులో కింగుల లాంటి ఆటగాళ్లు ఉన్నా  ఆ ఫ్రాంచైజీ తలరాత మాత్రం మారలేదు. 14 సీజన్లు ముగిసిన ఐపీఎల్ లో ఒక్కటంటే ఒక్కటే సారి ఆ జట్టు ఫైనల్ కు చేరింది. మిగతా 12 సీజన్లలో గ్రూప్ స్టేజ్ కూడా దాటలేదు. 

ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 14 సీజన్లు గడిచాయి.  రేపట్నుంచి 15వ సీజన్ ప్రారంభం కాబోతున్నది.  అయితే పేరులో ‘కింగ్స్’ ఉన్నా.. జట్టులో మెరికల్లాంటి ఆటగాళ్లున్నా.. లీగ్ లో మాత్రం ఆ ఫ్రాంచైజీ ఒక్కసారైనా కింగ్స్ కాలేకపోయింది. 14 సీజన్లలో ఒక్కసారి మాత్రమే ఫైనల్స్ కు వెళ్లింది. 2014లో మాత్రమే ఆ జట్టు రన్నరప్ గా నిలిచింది.  ఇక  ప్రారంభ ఎడిషన్ లో సెమీఫైనలిస్టు గా రాణించింది. ఈ రెండు తప్పితే ఆ జట్టు  ప్రతి సీజన్ లో గ్రూప్ స్టేజ్ నుంచే వైదొలుగుతుంది.  గత ఏడు సీజన్లుగా ఆ జట్టు స్థానం గ్రూప్ స్టేజ్ లకే పరిమితమైంది. 

ఇక కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి  తీసుకొచ్చిన కెప్టెన్ కెఎల్ రాహుల్ కూడా పంజాబ్ కు హ్యాండ్ ఇచ్చాడు.  మూడు సీజన్లకు పంజాబ్ కు సారథిగా వ్యవహరించిన రాహుల్ కూడా  ఆ జట్టు తలరాతను మార్చలేదు. ఇదిలాఉండగా.. ఈ సీజన్ లో రాహుల్ కూడా పంజాబ్ ను వీడాడు. అతడు లక్నో సూపర్ జెయింట్స్ తో చేతులు కలిపాడు. 

రాహుల్ వైదొలగడంతో పంజాబ్ జట్టు మయాంక్ అగర్వాల్ ను సారథిగా నియమించుకుంది.   మయాంక్ అగర్వాల్ తో పాటు అన్ క్యాప్డ్ ఆటగాడు అర్షదీప్ సింగ్ ను రిటైన్ చేసుకున్న పంజాబ్.. మెగావేలంలో లియామ్ లివింగ్ స్టోన్ ను  రూ. 11.50 కోట్లకు సొంతం చేసుకుంది. లివింగ్  స్టోన్ తో పాటు జానీ బెయిర్ స్టో, శిఖర్ ధావన్, ఓడియన్ స్మిత్, షారుఖ్ ఖాన్, రబాడ, రాహుల్ చాహర్, సందీప్ శర్మ కోసం భారీ మొత్తం వెచ్చించింది.  

 

బౌలర్లు, మిడిలార్డర్ తో పాటు స్పిన్ ఆల్ రౌండర్లు కూడా ఉండటంతో ఈ సారి ఆ జట్టు తీరని కలలా మారిన ట్రోఫీ ఆశలను నెరవేర్చుకోవాలని భావిస్తున్నది. టీమిండియా లెగ్ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే కోచ్ గా వ్యవహరిస్తున్న  పంజాబ్ కింగ్స్..  ఫుల్ షెడ్యూల్, జట్టుకు సంబంధించిన వివరాలు ఇక్కడ చూద్దాం. 

ఫుల్ షెడ్యూల్ : 

మార్చి 27 : పీబీకేఎస్ వర్సెస్ ఆర్సీబీ - సాయంత్రం 7.30 గంటలకు - డీవై పాటిల్ స్టేడియం 
ఏప్రిల్ 01 : కేకేఆర్ వర్సెస్ పీబీకేఎస్ -  సాయంత్రం 7.30 గంటలకు - వాంఖెడే 
ఏప్రిల్ 03 : సీఎస్కే వర్సెస్ పీబీకేఎస్ - సాయంత్రం 7.30 గంటలకు - బ్రబోర్న్ 
ఏప్రిల్ 08 : పీబీకేఎస్ వర్సెస్ జీటీ - సాయంత్రం 7.30 గంటలకు - బ్రబోర్న్ 
ఏప్రిల్ 13 : ఎంఐ వర్సెస్ పీబీకేఎస్ - సాయంత్రం 7.30 గంటలకు - పూణె 
ఏప్రిల్ 17 :  పీబీకేఎస్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ - మధ్యాహ్నం 3.30 గంటలకు - డీవై పాటిల్ 
ఏప్రిల్ 20 : డీసీ వర్సెస్ పీబీకేఎస్ - సాయంత్రం 7.30 గంటలకు - పూణె 
ఏప్రిల్ 25 : పీబీకేఎస్ వర్సెస్ సీఎస్కే - సాయంత్రం 7.30 గంటలకు - వాంఖెడే 
ఏప్రిల్ 29 : పీబీకేఎస్ వర్సెస్ ఎల్ఎస్జీ (లక్నో) - సాయంత్రం 7.30 గంటలకు - పూణె 
మే 03 : జీటీ (గుజరాత్) వర్సెస్ పీబీకేఎస్ - సాయంత్రం 7.30 గంటలకు - డీవై పాటిల్ 
మే 07 : పీబీకేఎస్ వర్సెస్ ఆర్ఆర్ (రాజస్థాన్) - మధ్యాహ్నం 3.30 గంటలకు -  వాంఖెడే 
మే 13 : ఆర్సీబీ వర్సెస్ పీబీకేఎస్ -  సాయంత్రం 7.30 గంటలకు - బ్రబోర్న్ 
మే 16 : పీబీకేఎస్ వర్సెస్ డీసీ - సాయంత్రం 7.30 గంటలకు - డీవై పాటిల్ 
మే 22 : ఎస్ఆర్హెచ్ వర్సెస్ పీబీకేఎస్ - సాయంత్రం 7.30 గంటలకు - వాంఖెడే 

పంజాబ్ కోచింగ్ సిబ్బంది : 
- అనిల్ కుంబ్లే : హెడ్ కోచ్ 
- డేమియన్ రైట్ : బౌలింగ్ కోచ్ 
- జులైన్ వుడ్ : బ్యాటింగ్ కన్సల్టెంట్
- జాంటీ రోడ్స్ : అసిస్టెంట్ కోచ్
- ప్రభాకర్ : అసిస్టెంట్ ఫీల్డింగ్ కోచ్ 
- అడ్రైన్ లె రౌక్స్ :  స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్
- అవినాష్ వైద్య : జనరల్ మేనేజర్ క్రికెట్ ఆపరేషన్స్ 
- ఆశిష్ తులి : టీమ్ అనలిస్టు 

పంజాబ్ కింగ్స్ జట్టు : మయాంక్ అగర్వాల్, అర్షదీప్ సింగ్, శిఖర్ ధావన్, కగిసొ రబాడా, జానీ బెయిర్ స్టో,  రాహుల్ చాహర్, షారుఖ్ ఖాన్, హర్ప్రీత్, ప్రభ్సిమ్రాన్ సింగ్, జితేశ్ శర్మ, ఇషాన్ పారెల్,  లియామ్ లివింగ్ స్టోన్, ఓడియన్ స్మిత్,  సందీప్ శర్మ, రాజ్ అంగద్ భవ, రిషి ధావన్, ప్రేరక్ మన్కడ్, వైభవ్ అరోరా, వృత్తిక్ ఛటర్జీ, బల్తేజ్ ధండ, అన్షు పటేల్, నాథున్ ఎలిస్, అథర్వ తైడె, భానుక రాజపక్స, బెన్నీ హోవెల్ 

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?