Pak Vs Aus: కమిన్స్ ఖతర్నాక్ స్పెల్.. 20 పరుగులకే ఏడు వికెట్లు ఢమాల్.. నిట్ట నిలువునా కూలిన పాక్ బ్యాటింగ్

Published : Mar 23, 2022, 06:53 PM ISTUpdated : Mar 23, 2022, 07:01 PM IST
Pak Vs Aus: కమిన్స్ ఖతర్నాక్ స్పెల్.. 20 పరుగులకే ఏడు వికెట్లు ఢమాల్.. నిట్ట నిలువునా కూలిన పాక్ బ్యాటింగ్

సారాంశం

Pakistan Vs Australia: 248 పరుగులకు 4 వికెట్లు.. 268 కి ఆలౌట్. 20 పరుగుల్లో ఏడుగురు ఢమాల్. ప్రపంచ క్రికెట్ లో తనకు మాత్రమే సొంతమైన ‘నిలకడ లేమి’ని  పాకిస్థాన్  మళ్లీ ప్రదర్శించింది. తొలి రెండు టెస్టులలో ఫలితం రాక నిరాశలో కూరుకుపోయిన ఇరు జట్ల అభిమానులకు లాహోర్ టెస్టులో రిజల్ట్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 

పాకిస్థాన్ జట్టు తన సంప్రదాయాన్ని మరోసారి నిలుపుకున్నది. నిలకడ లేమికి మారుపేరుగా నిలిచే ఆ జట్టు.. ఆ పేరును మరోసారి సార్థకం చేసుకుంది. అప్పటిదాకా మెరుగ్గా ఆడటం.. ఇక మ్యాచ్ మీద పట్టు సాధించినట్టే అనుకోవడం.. తీరా చూస్తే  కొన్ని క్షణాల్లోనే  అంతా ఉల్టా పల్టా.. ఇది ఆ జట్టును చాలాకాలంగా వేధిస్తున్న సమస్య. ఇప్పుడు అది మళ్లీ రిపీట్ అయింది. 20 పరుగుల వ్యవధిలో ఏకంగా 7 వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో 248 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి బాగానే ఆడుతున్న ఆ జట్టు..  ఉన్నట్టుండి 268 పరుగులకే కుప్పకూలింది. తేడా 20 పరుగులు, కోల్పోయిన వికెట్లు 7.. మరి తరతరాలుగా వస్తున్న తన సంప్రదాయాన్ని పాక్ నిలుపుకున్నట్టే కదా..? 

లాహోర్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్టులో  ఆస్ట్రేలియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ లో 391 పరుగులు చేసి ఆలౌటైన ఆ జట్టు.. పాకిస్థాన్ ను  ఫస్ట్ ఇన్నింగ్స్ లో 268 పరుగులకే కట్టడి చేసింది. ఫలితంగా  ఆసీస్ కు 123 పరుగుల  తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.  ఆసీస్ సారథి పాట్ కమిన్స్ ఐదు వికెట్లు తీయగా... మిచెల్ స్టార్క్ కు నాలుగు వికెట్లు దక్కాయి.  

మూడో టెస్టు మూడో రోజు ఓవర్ నైట్ స్కోరు 90-1 పరుగుల వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్..  షఫీక్ (228 బంతుల్లో 81), అజర్ అలీ (208 బంతుల్లో 78) లు రెండో వికెట్ కు 150 పరుగుల భాగస్వామ్యం జోడించారు. సెంచరీల వైపునకు దూసుకెళ్తున్న ఈ జంటను ఆసీస్ స్పిన్నర్ లియన్  విడదీశాడు. లియాన్ బౌలింగ్ లో షఫీక్.. కీపర్ అలెక్స్ కేరీకి  క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కొద్ది సేపటి తర్వాత అజర్ అలీ కూడా కమిన్స్ బౌలింగ్ లో అతడికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికీ స్కోరు 86.4 ఓవర్లలో 214-3.

 

ఆ సమయంలో కెప్టెన్ బాబర్ ఆజమ్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 131 బంతులాడి 67 పరుగులు చేశాడు.  అయితే అతడికి చేయూతనిచ్చేవారే కరువయ్యారు. పాక్ ఇన్నింగ్స్ 106.3 ఓవర్లో ఫవాద్ ఆలం (13) ను స్టార్క్ ఎల్బీడబ్ల్యూ గా  ఔట్ చేశాడు. అప్పుడు మొదలైంది వికెట్ల పతనం. 

20 పరుగుల్లో ఖల్లాస్.. 

ఆలం నిష్క్రమించే సమయానికి పాక్ స్కోరు 106 ఓవర్లలో 248-4. ఆ వెంటనే నాలుగు ఓవర్ల తర్వాత కీపర్ మహ్మద్ రిజ్వాన్ (1) ను కూడా స్టార్క్  ఔట్ చేశాడు. 113 ఓవర్లో సాజిద్ ఖాన్ (6)నను కమిన్స్ బౌల్డ్ చేశాడు. ఆ మరుసటి ఓవర్లో నౌమన్ అలీ (0)తో పాటు హసన్ అలీ (0) లను కమిన్స్ డకౌట్ గా ఐట్ చేశాడు.  ఇక 116వ ఓవర్లో బాబర్ ఆజమ్ ను స్టార్క్ ఎల్బీడబ్ల్యూ గా పెవిలియన్ కు చేర్చాడు. నసీమ్ షా (0) ను స్టార్క్ బౌల్డ్ చేయడంతో పాక్ ఇన్నింగ్స్ కు తెరపడింది.  

ఫలితం తేలేనా..?

తొలి ఇన్నింగ్స్ లో దక్కిన ఆధిక్యంతో ఆస్ట్రేలియా తిరిగి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.  ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 3 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా (7 నాటౌట్), డేవిడ్ వార్నర్ (4 నాటౌట్) క్రీజులో ఉన్నారు.  ప్రస్తుతం ఆస్ట్రేలియా 134 పరుగుల ఆధిక్యంలో ఉంది.  రావల్పిండి, కరాచీలో కాకుండా లాహోర్ పిచ్ కాస్త బౌలర్లకు కూడా సహకరిస్తుండటంతో ఈ టెస్టులో ఫలితం తేలే అవకాశం ఉంది. ఈ టెస్టులో నాలుగో రోజు ఆట అత్యంత కీలకం. ఆసీస్ ఎన్ని పరుగులు చేసి పాక్ కు లక్ష్యాన్ని నిర్దేశించనుందనేదానిమీద ఆ జట్టు విజయావకాశాలు ముడిపడి ఉన్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?