Umran Malik: ఆ సుడిగాలి తరుముకొస్తోంది.. జాగ్రత్త.. నయా పేస్ సంచలనంపై చిదంబరం ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published : Apr 28, 2022, 02:01 PM ISTUpdated : Apr 28, 2022, 02:03 PM IST
Umran Malik: ఆ సుడిగాలి తరుముకొస్తోంది.. జాగ్రత్త.. నయా పేస్ సంచలనంపై చిదంబరం ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సారాంశం

TATA IPL 2022: సన్ రైజర్స్ హైదరాబాద్ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ ను  సుడిగాలిలా దూసుకొస్తున్నాడని, అతడిని వీలైనంత త్వరగా  భారత జట్టులోకి తీసుకోవాలని కాంగ్రెస్  సీనియర్ నాయకుడు పి. చిదంబరం వ్యాఖ్యానించారు.

ఐపీఎల్ నయా సంచలనం  ఉమ్రాన్ మాలిక్ ను వీలైనంత త్వరగా  భారత జట్టులోకి తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ను కోరారు. అతడు సుడిగాలిలా దూసుకొస్తున్నాడని, ఆ వేగానికి దారిలో ఉన్నవన్నీ చెల్లాచెదురు కాక తప్పదని వ్యాఖ్యానించారు. బుధవారం  రాత్రి గుజరాత్ టైటాన్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య  ముగిసిన మ్యాచ్ లో ఐదు వికెట్లతో చెలరేగిన ఉమ్రాన్ మాలిక్ ప్రదర్శనపై చిదంబరం ప్రశంసలు కురిపించారు.   ఈ యువ పేసర్ కు సరైన అవకాశాలు కల్పించాలని బీసీసీఐని కోరారు. 

గుజరాత్-హైదరాబాద్ మ్యాచ్ ముగిసిన తర్వాత ట్విటర్ వేదికగా స్పందించిన చిదంబరం.. ‘ఉమ్రాన్ మాలిక్ హరికేన్ దూసుకొస్తున్నది. తన దారిలో ఉన్న ప్రతిదానిని తుడిచిపడేస్తూ ముందుకు వస్తున్నది. ఇవాళ అతడి వేగం, దూకుడు చూస్తే రెండు కళ్లు సరిపోలేదు. 

తాజా ప్రదర్శనలతో అతడు ఈ ఐపీఎల్  ఎడిషన్ కు అతడు దొరికాడనడంలో ఏ సందేహమూ లేదు. బీసీసీఐ వెంటనే అతడికి ప్రత్యేక కోచ్ ను నియమించి శిక్షణ ఇప్పించాలి. అంతేగాక అతడిని త్వరగా జాతీయ జట్టులోకి తీసుకోవాలి..’ అని రాసుకొచ్చారు. 

 

బుధవారం నాటి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన  196 పరుగుల లక్ష్యాన్ని  ఛేదించే క్రమంలో గుజరాత్  టైటాన్స్  ధాటిగా  బ్యాటింగ్ చేశారు. వారి దూకుడుకు అడ్డుకట్ట వేస్తూ ఉమ్రాన్.. గుజరాత్ బ్యాటర్లకు చుక్కలు చూపాడు.  శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా, హార్ధిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్ లను ఔట్ చేసి తన  ఐపీఎల్ కెరీర్ లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.  ఉమ్రాన్ తాజా ప్రదర్శనతో ఉమ్రాన్ పై ప్రశంసల జల్లు కురుస్తున్నది. 

కాగా.. ఉమ్రాన్  మాలిక్  ప్రదర్శన పట్ల చిదంబరమే కాదు గతంలో అదే పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు శశి థరూర్  కూడా ఇదే విధంగా ప్రశంసలు కురిపించారు.  థరూర్ స్పందిస్తూ..  ‘ఉమ్రాన్ ను మేము  టీమిండియాలో చూడాలనుకుంటున్నాం. అత్యద్భుతమైన టాలెంట్ అతడిలో దాగుంది.  ఉమ్రాన్ ను వెంటనే ఇంగ్లాండ్ కు తీసుకెళ్లి అక్కడి పచ్చిక పిచ్ ల మీద టెస్టులు ఆడించండి. అతడు, బుమ్రా కలిసి ఇంగ్లీష్ ఆటగాళ్లను  ముప్పుతిప్పలు పెడతారు..’ అని రాసుకొచ్చారు. 

 

పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ ముగిశాక తెలంగాణ రాష్ట్ర సమితి కార్వనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా  ఉమ్రాన్ మాలిక్  బౌలింగ్ కు ఫిదా అయ్యాడు. కేటీఆర్ ట్వీట్ చేస్తూ.. ‘నమ్మశక్యం కాని  స్పెల్. ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ ఓవర్. టేక్ ఎ బౌ యంగ్ మ్యాన్..’ అని ఉమ్రాన్ పై ప్రశంసలు కురిపించారు.

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !