Virat Kohli: ఊ అంటావా కోహ్లి.. ఉ ఉ అంటావా..! మ్యాక్స్వెల్ పెళ్లి పార్టీలో పుష్ప పాటకు స్టెప్పులేసిన విరాట్

Published : Apr 28, 2022, 12:56 PM IST
Virat Kohli: ఊ అంటావా కోహ్లి.. ఉ ఉ అంటావా..! మ్యాక్స్వెల్ పెళ్లి పార్టీలో పుష్ప పాటకు స్టెప్పులేసిన విరాట్

సారాంశం

TATA IPL 2022: ఐపీఎల్-15లో  వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కుంటున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వాటి నుంచి కాస్త రిలాక్స్ అయ్యాడు.  ఇటీవలే వివాహం చేసుకున్న  ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ పెళ్లి పార్టీలో కోహ్లి డాన్స్ చేశాడు. 

గత కొంతకాలంగా  బ్యాటింగ్ లో విఫలమవుతూ తీవ్ర విమర్శల పాలవుతున్న విరాట్ కోహ్లి కాస్త సేద తీరాడు.  విమర్శలు, ప్రాక్టీస్,  వైఫల్యాలు, నిరాశను కాస్త పక్కనబెట్టి..  హాయిగా గడిపాడు. గత నెల పెళ్లి చేసుకున్న  ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్-వినీ రామన్ ల వివాహ పార్టీలో  కోహ్లి కాలు కదిపాడు.  పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మావ.. ఉ ఉ అంటావా మావ..’ పాటకు స్టెప్పులేశాడు. ఈ పార్టీకి  ఆర్సీబీ ఆటగాళ్లంతా  హాజరయ్యారు. 

గత నెల 27న ఆస్ట్రేలియా   భారత సంతతి వినీ రామన్-మ్యాక్స్వెల్ ల వివాహం అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి ముగిసిన వెంటనే ఏప్రిల్ 6న  మ్యాక్సీ ఇండియాకు వచ్చాడు.  ఐపీఎల్  లో తన జట్టుతో చేరి  మ్యాచులు కూడా ఆడుతున్నాడు. 

కాగా బయో బబుల్ లో ఉన్న ఆర్సీబీ ఆటగాళ్లు కాసింత రిఫ్రెష్ అవడానికి ఆ జట్టు యాజమాన్యం  మ్యాక్సీ పెళ్లి పార్టీని ఏర్పాటు చేసింది. రెండ్రోజుల క్రితం రాజస్తాన్ తో మ్యాచ్ ఆడిన ఆ జట్టు.. ఈనెల 30 దాకా ఖాళీ దొరకింది. దీంతో ఆటగాళ్లు  కాసింత సేద తీరడానికి ఈ పార్టీ ఉపయోగపడుతుందని ఆ జట్టు యాజమాన్యం భావించింది. ఇక ఈ పార్టీకి  విరాట్ కోహ్లి, అనుష్క శర్మ, ఫాఫ్ డుప్లెసిస్ అతడి భార్య, వనిందు హసరంగ, రూథర్ఫర్డ్, దినేశ్ కార్తీక్ వంటి ఆటగాళ్లు హాజరయ్యారు.  ఈ మేరకు వాళ్లు సోషల్ మీడియాలో తమ  ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.  ఈ వేడుక కోసం  ఆర్సీబీ ఆటగాళ్లంతా సంప్రదాయ భారతీయ దుస్తుల్లో రావడం విశేషం.  

 

ఇక  ఫీల్డ్ లోనే ఏదైనా పాట వినిపిస్తే నానా హంగామా చేసే కోహ్లి.. మ్యాక్సీ పెళ్లి పార్టీలో  కామ్ గా ఉంటాడా..?  ఊ అంటావా మావకు తనదైన రీతిలో డాన్స్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.  వరుస వైఫల్యాలు ఎదురవుతున్న  కోహ్లి మాత్రం ముఖం పై చెరగని చిరునవ్వుతో సంతోషంగా కనిపించాడు. 

 

సన్ రైజర్స్ హైదరాబాద్ తో పాటు  రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన వరుస మ్యాచుల్లో ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన తర్వాత మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది. ఇప్పటికే 9 మ్యాచులాడి 5 గెలిచి నాలుగింట్లో ఓడిన ఆర్సీబీ.. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !