నికోలస్ పూరన్‌కి ప్రమోషన్... కిరన్ పోలార్డ్ స్థానంలో విండీస్ వన్డే, టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు...

Published : May 03, 2022, 07:40 PM IST
నికోలస్ పూరన్‌కి ప్రమోషన్... కిరన్ పోలార్డ్ స్థానంలో విండీస్ వన్డే, టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు...

సారాంశం

ఐపీఎల్ 2022 సీజన్ మధ్యలో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన విండీస్ మాజీ కెప్టెన్ కిరన్ పోలార్డ్... పోలార్డ్ స్థానంలో నికోలస్ పూరన్‌కి సారథిగా బాధ్యతలు...

ఐపీఎల్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఒక్కటీ ఇవ్వలేకపోయినా నికోలస్ పూరన్... అంతర్జాతీయ క్రికెట్‌లో ఫ్యూచర్ స్టార్. టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు చేసిన నికోలస్ పూరన్... వెస్టిండీస్‌కి వైట్ బాల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు..

2016లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన నికోలస్ పూరన్, 2020లో వెస్టిండీస్ జట్టుకి టీ20ల్లో వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కిరన్ పోలార్డ్ గాయపడిన సమయంలో సారథిగా ఆస్ట్రేలియాపై 4-1 తేడాతో టీ20 సిరీస్ గెలిచిన నికోలస్ పూరన్...  ఐపీఎల్ ఆరంభానికి ముందు ఇండియాతో జరిగిన సిరీస్‌లో మూడు హాఫ్ సెంచరీలతో 184 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు...

ఐపీఎల్ మధ్యలోనే అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటూ సంచలన నిర్ణయం ప్రకటించాడు వెస్టిండీస్ వైట్ బాల్ కెప్టెన్ కిరన్ పోలార్డ్. దీంతో పోలార్డ్ స్థానంలో వైస్ కెప్టెన్‌గా ఉన్న నికోలస్ పూరన్‌కి సారథిగా ప్రమోషన్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది విండీస్ క్రికెట్ బోర్డు... 

ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీతో పాటు వచ్చే ఏడాది భారత్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్‌ వరకూ నికోలస్ పూరన్ సారథిగా ఉంటాడు. విండీస్ బ్యాటర్ షై హోప్‌కి వన్డే టీమ్ వైస్ కెప్టెన్సీ ఇస్తూ నిర్ణయం తీసుకుంది విండీస్ క్రికెట్ బోర్డు...

‘ఇప్పటికే నికోలస్ పూరన్‌కి వైట్ బాల్ క్రికెట్‌లో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. అతని అనుభవం, ఆటతీరు, అంకితభావం విండీస్ జట్టుకి ఎంతగానో ఉపయోగపడతాయని భావిస్తున్నాం. అందుకే సెలక్షన్ ప్యానెల్, నికోలస్ పూరన్‌ లాంటి మెచ్యూరిటీ ఉన్న సారథికి కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని నిర్ణయం తీసుకుంది...

నికోలస్ పూరన్ ఇప్పటికే చాలా ఫ్రాంఛైజీల్లో, లీగ్స్‌లో ఆడి అపారమైన టీ20 అనుభవం సంపాదించాడు. అందుకే అతను ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తాడని నమ్ముతున్నాం...’ అంటూ కామెంట్ చేశాడు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ జిమ్మీ ఆడమ్స్...

ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత మే 31 నుంచి నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్ ఆడనుంది వెస్టిండీస్. పూర్తి స్థాయి కెప్టెన్‌గా నికోలస్ పూరన్‌కి ఇదే మొట్టమొదటి సిరీస్ కానుంది.

గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున ఆడి అట్టర్ ఫ్లాప్ అయిన నికోలస్ పూరన్‌ని ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.10.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్... ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్ వంటి ఇద్దరు ముగ్గురు క్రికెటర్లకు బాగా కలిసి వచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్, నికోలస్ పూరన్‌కి కూడా బాగా కలిసి వచ్చిందని అంటున్నారు నెటిజన్లు...

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటిదాకా 9 మ్యాచులు ఆడిన నికోలస్ పూరన్, 8 ఇన్నింగ్స్‌ల్లో 180 పరుగులు చేసి గత సీజన్‌తో పోలిస్తే పర్వాలేదనిపించాడు. అయితే పూరన్ నుంచి ఆశించిన మెరుపులు, సునామీ ఇన్నింగ్స్‌లు మాత్రం ఇప్పటిదాకా రాలేదని బాగా డిస్సపాయింట్ అవుతున్నారు సన్‌ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్... 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !