IPL 2022 RR vs LSG: టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్... టేబుల్ టాప్ పొజిషన్ కోసం...

Published : Apr 10, 2022, 07:06 PM ISTUpdated : Apr 10, 2022, 07:14 PM IST
IPL 2022 RR vs LSG: టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్... టేబుల్ టాప్ పొజిషన్ కోసం...

సారాంశం

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్... విజయంతో టేబుల్ టాప్ పొజిషన్‌లోకి వెళ్లాలని చూస్తున్న లక్నో... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదటి రెండు మ్యాచుల్లో ఘన విజయాలు అందుకున్న రాజస్థాన్ రాయల్స్, ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో పరాజయాన్ని చవిచూసింది. మరో వైపు మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ చేతిలో ఓడిన లక్నో సూపర్ జెయింట్స్, ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకుంది...

ప్రస్తుతం 6 పాయింట్లతో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్, నేటి మ్యాచ్ గెలిస్తే టేబుల్ టాప్ పొజిషన్‌కి చేరుకుంటుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ నేటి మ్యాచ్‌లో విజయం సాధిస్తే, నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉన్న కారణంగా టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్తుంది. దీంతో నేటి మ్యాచ్ టేబుల్ టాపర్‌ని డిసైడ్ చేయనుంది.

రాజస్థాన్ రాయల్స్‌ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇప్పటిదాకా తన రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. దీంతో తుది జట్టులో చోటు కోల్పోయాడు జైస్వాల్. ఇప్పటిదాకా జరిగిన మ్యాచులన్నింటీలో జోస్ బట్లర్ చక్కని ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. దేవ్‌దత్ పడిక్కల్, సంజూ శాంసన్ ఒకటి రెండు ఇన్నింగ్స్‌ల్లో ఆకట్టుకున్నా, రాజస్థాన్ బ్యాటింగ్ భారమంతా బట్లర్‌పైనే ఆధారపడి ఉంది...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా సంజూ శాంసన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. కెప్టెన్‌గా విమర్శలు ఎదుర్కొన్న సంజూ శాంసన్, కెఎల్ రాహుల్‌ మధ్య మ్యాచ్ కావడంతో ఆసక్తి రేగుతోంది...

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రెండు మార్పులతో నేటి మ్యాచ్‌లో బరిలో దిగుతోంది. ఇవిన్ లూయిస్, ఆండ్రూ టై స్థానంలో మార్కస్ స్టోయినిస్, దుస్మంత ఛమీరా తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ కూడా రెండు మార్పులతో బరిలో దిగుతోంది. నవ్‌దీప్ సైనీ స్థానంలో కుల్దీప్ సేన్ తుదిజట్టులో చోటు దక్కించుకోగా యశస్వి జైస్వాల్ ప్లేస్‌లో సౌతాఫ్రికా హిట్టర్ రస్సీ వాన్ దేర్ దుస్సేన్‌కి ఓపెనర్‌గా అవకాశం దక్కనుంది. 

రాజస్థాన్ రాయల్స్ జట్టు: జోస్ బట్లర్, రస్సీ వాన్ దేర్ దుస్సేన్, దేవ్‌దత్ పడిక్కల్, సంజూ శాంసన్, సిమ్రాన్ హెట్మయర్, రియాన్ పరాగ్, కుల్దీప్ సేన్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యజ్వేంద్ర చాహాల్

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: కెఎల్ రాహుల్, క్వింటన్ డి కాక్, మార్నస్ స్టోయినిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోనీ, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, దుస్మంత ఛమీరా, రవి భిష్ణోయ్, ఆవేశ్ ఖాన్ 

 

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !