విరాట్ కోహ్లీ ఖాతాలో మరో మైలురాయి... సిక్సర్‌తో ముసలాయన తల పగలకొట్టిన రజత్ పటిదార్...

By Chinthakindhi RamuFirst Published May 13, 2022, 10:53 PM IST
Highlights

20 పరుగులు చేసి అవుటై మరోసారి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన విరాట్ కోహ్లీ... 102 మీటర్ల భారీ సిక్సర్‌తో మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చిన ప్రేక్షకుడి తల పగలకొట్టిన రజత్ పటిదార్...

ఐపీఎల్ 2022 సీజన్‌లో విరాట్ కోహ్లీ బ్యాడ్ లక్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే సీజన్‌లో రెండు సార్లు రనౌట్ రూపంలో, మరో రెండు సార్లు గోల్డెన్ డకౌట్ రూపంలో పెవిలియన్ చేరిన విరాట్ కోహ్లీ, పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో శుభారంభం లభించినా, దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు...

14 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, కగిసో రబాడా బౌలింగ్‌లో రాహుల్ చాహార్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ గ్లవ్స్‌ని తాకుతూ వెళ్లిన బంతి, రాహుల్ చాహార్ చేతుల్లోకి వెళ్లి వాలింది. పాజిటివ్ ఎనర్జీతో మ్యాచ్‌ని ఆరంభించిన విరాట్ కోహ్లీ, భారీ స్కోరు చేస్తాడనే ఆశలు రేపినా... బ్యాడ్ లక్ అతన్ని మరోసారి వెంటాడింది. పెవిలియన్ చేరే సమయంలో విరాట్ కోహ్లీ నిరాశగా ఆకాశం వైపు చూస్తూ ఏదో అనడం కెమెరాల్లో కనిపించింది...

అయితే ఈ మ్యాచ్‌ ద్వారా విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో 6500+ పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్‌లో 6 వేల పరుగుల మైలురాయి అందుకున్న మొట్టమొదటి క్రికెటర్ విరాట్ కోహ్లీయే కాగ ఇప్పుడు 6500 పరుగుల మైలురాయి కూడా ఆయన ఖాతాలోనే చేరింది...

ఓవరాల్‌గా టీ20ల్లో 10500 పరుగులు చేసిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ అవుటైన తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది ఆర్‌సీబీ. 8 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన ఫాఫ్ డుప్లిసిస్, రిషి ధావన్ బౌలింగ్‌లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

3 బంతుల్లో ఓ సిక్సర్‌తో 6 పరుగులు చేసిన మహిపాల్ లోమ్రోర్ కూడా అదే ఓవర్‌లో శిఖర్ ధావన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ దశలో రజత్ పటిదార్, మ్యాక్స్‌వెల్ కలిసి నాలుగో వికెట్‌కి 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...

21 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 26 పరుగులు చేసిన రజత్ పటిదార్, రాహుల్ చాహార్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో రజత్ పటిదార్, 102 మీటర్ల భారీ సిక్సర్ సంధించాడు. ఈ సిక్సర్ నేరుగా వెళ్లి, స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ఓ ముసలాయన తలపై తగలింది. దీంతో ఆయనకు గాయమై, రక్తం కారడంతో వెంటనే పక్కనున్నవాళ్లు సేద తీర్చే ప్రయత్నం చేశారు...

ఇంతకుముందు ఇంగ్లాండ్‌లో మ్యాచ్ ఆడుతున్న సమయంలో భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కొట్టిన ఓ భారీ సిక్సర్, స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ ముసలాయన తల పగలకొట్టింది. ఆ మ్యాచ్‌లో దాదా కొట్టిన సిక్సర్ దెబ్బకు, ఆ ఇంగ్లాండ్ వృద్ధుడు తల నుంచి రక్తం కారడం విశేషం...

10.5 ఓవర్లు ముగిసే సమయానికి 103 పరుగులు చేసి కాస్త పటిష్టంగానే కనిపించిన ఆర్‌సీబీ, ఆ తర్వాత మరోసారి రెండు వరుస వికెట్లు కోల్పోయింది. రజత్ పటిదార్ అవుటైన తర్వాత రెండో బంతికే మ్యాక్స్‌వెల్ కూడా పెవిలియన్ చేరాడు. 22 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్, హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
 

click me!