IPL 2022 RCB vs CSK: టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... సీఎస్‌కేకి తొలి విజయం దక్కేనా...

Published : Apr 12, 2022, 07:05 PM ISTUpdated : Apr 12, 2022, 07:43 PM IST
IPL 2022 RCB vs CSK: టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... సీఎస్‌కేకి తొలి విజయం దక్కేనా...

సారాంశం

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడి, ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో సీఎస్‌కే... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతోంది టాస్ గెలిచిన ఆర్‌సీబీ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది...

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇది 200వ మ్యాచ్. ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ ఇద్దరూ సాధారణ ప్లేయర్లుగా ప్రత్యర్థులుగా బరిలో దిగుతున్నారు. ఇప్పటిదాకా ఆర్‌సీబీ వర్సెస్ ఎమ్మెస్ ధోనీ టీమ్స్ మధ్య జరిగిన మ్యాచుల్లో మాహీ లేదా విరాట్ కోహ్లీ కెప్టెన్లుగా ప్రత్యర్థులుగా బరిలో దిగారు. 

ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్, ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. గత సీజన్‌లో 620+ పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్, ఇప్పటిదాకా ఈ సీజన్‌లో సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. 

షో మ్యాన్ రవీంద్ర జడేజా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత తన రేంజ్ పర్పామెన్స్ ఒక్కటి కూడా చూపించలేకపోయాడు. మెగా వేలంలో రూ.14 కోట్లు పెట్టి తిరిగి కొనుగోలు చేసిన ఆల్‌రౌండర్ దీపక్ చాహార్... గాయం నుంచి కోలుకుని తిరిగి వస్తాడని వేల ఆశలు పెట్టుకుంది సీఎస్‌కే.

అయితే ఎన్‌సీఏలో మరోసారి గాయపడిన దీపక్ చాహార్, సీజన్ మొత్తం నుంచి దూరమయ్యాడని సమాచారం. దీపక్ చాహార్ ఇక ఐపీఎల్ 2022 సీజన్‌లో జట్టులో చేరడని ఖరారైన తర్వాత సీఎస్‌కే ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే కావడంతో ఆ టీమ్ బౌలింగ్ యూనిట్‌పై బాధ్యత పెరిగింది.

ఐపీఎల్‌లో ఆర్‌సీబీపై చెన్నై సూపర్ కింగ్స్‌కి ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటిదాకా ఇరుజట్ల మధ్య 28 మ్యాచులు జరగగా 18 మ్యాచుల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయాలు అందుకుంది. రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుకి 9 మ్యాచుల్లోనే విజయం దక్కగా ఓ మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దయ్యింది...

గత 11 మ్యాచుల్లో సీఎస్‌కే 9 మ్యాచుల్లో విజయాలు అందుకోగా, ఆర్‌సీబీకి రెండు మ్యాచుల్లోనే విజయం దక్కడం విశేషం. అయితే ఈ సీజన్ కథ వేరు. ఇప్పటిదాకా నాలుగు మ్యాచుల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్, నేటి మ్యాచ్‌లో ఓడితే దాదాపు ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటుంది...

మరో వైపు నాలుగు మ్యాచుల్లో 3 విజయాలు అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేటి మ్యాచ్‌లో గెలిచి టేబుల్ టాపర్‌గా నిలవాలని ఆశపడుతోంది. జోష్ హజల్‌వుడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ రాకతో మరింత పటిష్టంగా కనిపిస్తోంది ఆర్‌సీబీ... 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: ఫాఫ్ డుప్లిసిస్, అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్, షాబజ్ అహ్మద్, వానిందు హసరంగ, జోష్ హజల్‌వుడ్, మహ్మద్ సిరాజ్, సూర్యాష్ ప్రభుదేశాయ్, ఆకాశ్ దీప్

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: రాబిన్ ఊతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ ఆలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎమ్మెస్ ధోనీ, డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్, మహీశ్ తీక్షణ, ముకేశ్ చౌదరి

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : గిల్ రెడీనా? భారత జట్టులోకి ముగ్గురు స్టార్ల రీఎంట్రీ
Smriti Mandhana: ఔను.. నా పెళ్లి రద్దయింది.. స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సంచలన పోస్టులు