పోటీ ఆటలో.. ఆటగాళ్లతో కాదు.. సీఎస్కే ప్లేయర్లను చూడగానే ఎమోషనల్ అయిన డుప్లెసిస్, కోహ్లి.. వీడియో వైరల్

Published : Apr 12, 2022, 04:23 PM ISTUpdated : Apr 12, 2022, 04:27 PM IST
పోటీ ఆటలో.. ఆటగాళ్లతో కాదు.. సీఎస్కే ప్లేయర్లను చూడగానే ఎమోషనల్ అయిన డుప్లెసిస్, కోహ్లి.. వీడియో వైరల్

సారాంశం

TATA IPL 2022 - CSK vs RCB: సుదీర్ఘకాలం పాటు ఒక ఫ్రాంచైజీకి ఆడి ఇప్పుడు అదే జట్టుకు వ్యతిరేకంగా ఆడటమంటే ఏ ఆటగాడికైనా  ఎమోషనల్ గానే ఉంటుంది. ప్రస్తుతం  రాయల్ ఛాలెంజర్స్  బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్ అదే  స్థితిలో ఉన్నాడు. 

డిఫెండింగ్ ఛాంపియన్లుగా ఐపీఎల్-15 బరిలోకి దిగిన  చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు   సీజన్ లో  గెలుపు దక్కలేదు.  మంగళవారం ఆ జట్టు  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో కీలక పోరులో తలపడనుంది. ఈ మేరకు ఇరు జట్లు ఇప్పటికే మ్యాచ్ జరుగబోయే డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో ప్రాక్టీస్  చేపట్టాయి. అయితే ప్రాక్టీస్ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ ఆటగాళ్లు వచ్చేటప్పటికే ప్రాక్టీస్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్స్ ను చూడగానే  బెంగళూరు సారథి డుప్లెసిస్, మాజీ సారథి  విరాట్ కోహ్లి లు ఎమోషనల్ అయ్యారు. చెన్నై జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడిని పేరు పేరునా పలకరిస్తూ.. కాసేపు వాళ్లతో ముచ్చటించారు. 

ముఖ్యంగా ఆర్సీబీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ అయితే చెన్నై ఆటగాళ్లను, కోచింగ్ సిబ్బందిని చూడగానే   అతడి మనసంతా భావోద్వేగంతో ఉప్పొంగిపోయింది. సీఎస్కే హెడ్ కోచ్  స్టీఫెన్ ఫ్లెమింగ్  దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్లి అతడిని గట్టిగా హత్తుకున్నాడు. 

అనంతరం చెన్నై  సారథి రవీంద్ర జడేజా, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో లతో పాటు తన మాజీ సహచరులైన రాబిన్ ఊతప్ప, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, మోయిన్ అలీ లను పేరు పేరునా పలకరించాడు. అందరితో కలిసి కాసేపు ముచ్చటించాడు. 

 

ఇక విరాట్ కోహ్లి రావడం రావడమే జడ్డూ కు షేక్ హ్యాండ్ ఇచ్చి తర్వాత తన గురువుగా భావించే ధోనిని మనస్ఫూర్తిగా అలింగనం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి కాసేపు ముచ్చటించుకున్నారు. కోహ్లితో ధోని నవ్వుతూ సంతోషంగా కనిపించాడు. గతంలో చెన్నైతో ఆడిన జోష్ హెజిల్వుడ్ ఇప్పుడు ఆర్సీబీ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. అతడు కూడా తన మాజీ సహచరులను చూసి ఎమోషనల్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇరు జట్ల ఫ్రాంచైజీలు తన సోషల్ మీడియా ఖాతాలలో పంచుకున్నాయి. 

ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మ్యాచులు, వాటి ఫలితాలు ఎలా ఉన్నా ఈ రెండు జట్లకు ఐపీఎల్ లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.  దీంతో ఇరు జట్ల అభిమానులకు ఈ వీడియోలు తెగ నచ్చేస్తున్నాయి.  ‘ఆట సంగతి ఎలా ఉన్నా మీరు మాత్రం ఇలాగే కలిసుండాలన్నా..’ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో ధోని-కోహ్లి ల బ్రోమాన్స్ తో పాటు  డుప్లెసిస్ ఎమోషన్స్  అభిమానులకు తెలియని ఉద్వేగాన్ని పంచుతున్నాయి.

 

ఇక 2018 నుంచి 2021 దాకా  డుప్లెసిస్ చెన్నై సూపర్ కింగ్స్ తోనే ఆడాడు. అంతకుముందు 2012 లో కూడా  సీఎస్కేతోనే ఉన్నాడు. ఆ జట్టు విజయాల్లో  కీలక పాత్ర పోషించిన అతి కొద్ది మంది ఆటగాళ్లలో డుప్లెసిస్ ఒకడు.  కానీ ఈ సీజన్ లో డుప్లెసిస్ ను  చెన్నై దక్కించుకోలేదు. అతడిని రూ. 7 కోట్లతో  బెంగళూరు దక్కించుకోవడమే గాక సారథిని కూడా చేసింది. డుప్లెసిస్ సారథ్యంలోని బెంగళూరు.. తొలి మ్యాచ్ లో పంజాబ్ తో ఓడినా తర్వాత మూడు మ్యాచులను మాత్రం  నెగ్గి టోర్నీలో విజయవంతంగా  ముందుకు సాగుతున్నది. 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !