
ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. అయితే జడ్డూకి ఈ సీజన్‌లో ఏదీ కలిసి రావడం లేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఒక్క మ్యాచ్ మినహా ఇస్తే ఆరు మ్యాచులు ఆడి ఐదు మ్యాచుల్లో పరాజయం పాలైంది చెన్నై సూపర్ కింగ్స్...
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దాదాపు సీఎస్‌కే చేతుల్లోకి వచ్చిన మ్యాచ్‌ని ఒంటి చేత్తో మలుపు తిప్పి గెలిపించాడు డేవిడ్ మిల్లర్. మిల్లర్‌ను అవుట్ చేసేందుకు చెన్నై బౌలర్లు ఎంత ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు...
41 బంతుల్లో 78 పరుగులు చేసి క్రీజులో ఉన్న సమయంలో డీజే బ్రావో బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్‌ని ఒడిసి పట్టుకోలేకపోయాడు శివమ్ దూబే. అప్పటికి గుజరాత్ టైటాన్స్ విజయానికి 22 బంతుల్లో 50 పరుగులు కావాలి. డేవిడ్ మిల్లర్ కొట్టిన షాట్, మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శివమ్ దూబే వైపు దూసుకెళ్లింది...
క్యాచ్ అందుకునేందుకు పరుగెత్తుకుంటూ ముందుకు వచ్చిన శివమ్ దూబే, ఆఖరి క్షణాలలో నిర్ణయాన్ని మార్చుకుని వన్ టప్‌గా క్యాచ్ అందుకున్నాడు. క్యాచ్ కోసం ప్రయత్నిస్తే బౌండరీ వెళ్తుందనే ఉద్దేశంతో శివమ్ దూబే అలా చేసినట్టు మ్యాచ్ చూసిన ప్రేక్షకులకు అర్థమైంది...
వరుస పరాజయాలు అందుకుంటున్న సీఎస్‌కే తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్న శివమ్ దూబే 6 మ్యాచుల్లో 168+ స్ట్రైయిక్ రేటుతో 226 పరుగులు చేశాడు.
అయితే డైవ్ చేసైనా క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించకపోవడంతో శివమ్ దూబేపై అసహనం వ్యక్తం చేశాడు బౌలర్ డీజే బ్రావో. ఏమీ అనలేక అక్కడ ఉండకు, ఇటు వెళ్లు అంటూ సూచించాడు...
కెప్టెన్ రవీంద్ర జడేజా అయితే కోపంతో టోపీ తీసి నేల మీద కొట్టబోయాడు. ఆ తర్వాత కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కెప్టెన్‌గా సత్తా చాటాలని ఎన్నో ఆశలతో సీఎస్‌కే సారధ్య బాధ్యతలు తీసుకున్న రవీంద్ర జడేజా... విజయాలు రాకపోవడంతో తీవ్రమైన ఫ్రస్టేషన్‌కి గురి అవుతున్నట్టు అతని ఆన్ ఫీల్డ్ బిహేవియర్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది.
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి 169 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. గత ఐదు మ్యాచుల్లో విఫలమైన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 48 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 73 పరుగులు చేయగా రాబిన్ ఊతప్ప 3, మొయిన్ ఆలీ 1 పరుగు చేసి తీవ్రంగా నిరాశపరిచారు...
అంబటి రాయుడు 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేయగా శివమ్ దూబే 17 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేయగా రవీంద్ర జడేజా 12 బంతుల్లో 2 సిక్సర్లతో 22 పరుగులు చేశాడు...
170 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది గుజరాత్ టైటాన్స్. శుబ్‌మన్ గిల్, విజయ్ శంకర్ డకౌట్ కాగా అభినవ్ మనోహర్ 12, రాహుల్ తెవాటియా 6, వృద్ధిమాన్ సాహా 11 పరుగులు చేసి అవుట్ కావడంతో 87 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది గుజరాత్ టైటాన్స్...
అయితే రషీద్ ఖాన్ 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేయగా డేవిడ్ మిల్లర్ 51 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 94 పరుగులు చేసి అజేయంగా నిలిచి... మ్యాచ్‌ని ముగించాడు.ఆఖరి 3 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ విజయానికి 48 పరుగులు కావాల్సి వచ్చాయి. క్రిస్ జోర్డాన్ వేసిన 18వ ఓవర్‌లో వరుసగా 6, 6, 4, 6 బాదిన రషీద్ ఖాన్... మ్యాచ్‌ని టర్న్ చేశాడు.
ఆఖరి ఓవర్‌లో డేవిడ్ మిల్లర్ అవుట్ అయినా, అది నో బాల్‌గా తేలడంతో ఆ తర్వాత వరుసగా 4, 6 కొట్టి మ్యాచ్‌ని ఫినిష్ చేశాడు టైటాన్స్ బ్యాటర్.