
ఐపీఎల్ 2022 సీజన్‌లో అంపైర్ల వివాదాస్పద నిర్ణయాలపై చర్చ జరుగుతూనే ఉంది. అసలే భారత స్టార్ ప్లేయర్లు సరైన ఫామ్‌లో లేరని తెగ ఫీలైపోతున్న ఇండియన్ క్రికెట్ టీమ్ ఫ్యాన్స్, లో స్టాండర్డ్ అంపైరింగ్ మరింత కోపాన్ని తెచ్చిపెడుతోంది. కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయం కారణంగా మొదటి ఓవర్‌లోనే రోహిత్ శర్మ పెవిలియన్ చేరాల్సి వచ్చింది...
టిమ్ సౌథీ బౌలింగ్‌లో తొలి ఓవర్ ఆఖరి బంతికి రోహిత్ శర్మ ఆడిన షాట్, నేరుగా వెళ్లి వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్ చేతుల్లో వాళింది. దీంతో కేకేఆర్ ఫీల్డర్లు, బౌలర్ అంపైర్‌కి అప్పీలు చేశారు. ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా డీఆర్‌ఎస్ తీసుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి అనుకూలంగా ఫలితం దక్కింది...
అయితే టీవీ రిప్లైలో రోహిత్ శర్మ బ్యాటుకి తగలకముందే స్పైక్ రావడం, బ్యాటుకీ బాల్‌కీ మధ్య గ్యాప్ ఉన్నట్టు స్పష్టంగా కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. థర్డ్ అంపైర్‌కి కళ్లు కనిపించడం లేదా? బ్యాటుకి బాల్ తగలకపోయినా స్పైక్ వచ్చిందనే ఒక్క కారణంగా అవుట్ ఎలా ఇస్తారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి...
అయితే ఈ సంఘటన జరగడానికి ముందు ఫీల్డ్ అంపైర్‌ని బాల్‌తో కొట్టాడు ముంబై ఇండియన్స్ బౌలర్ కిరన్ పోలార్డ్. ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన కిరన్ పోలార్డ్, మొదటి బంతికే బౌండరీ ఇచ్చాడు. అజింకా రహానే ఫోర్ బాదిన తర్వాత మిగిలిన ఐదు బంతుల్లో 5 సింగిల్స్ వచ్చాయి...
ఐదో బంతికి వేయడానికి వచ్చిన కిరన్ పోలార్డ్ చేతుల్లో నుంచి జారిన బాల్, అంపైర్ క్రిస్ గఫ్పానీకి తగిలింది. వెంటనే పోలార్డ్, గఫ్ఫానీని క్షమాపణలు కోరాడు. అయితే బంతి బలంగా తగలకపోవడంతో అంపైర్ కూడా నవ్వుతూ డెడ్ బాల్‌గా సిగ్నల్ ఇచ్చాడు. ఈ సంఘటనను పక్కనే ఉండి చూస్తున్న రోహిత్ శర్మ, చిరు నవ్వులు చిందడం టీవీల్లో కనిపించింది...
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంపైర్ మీద ఎంత కోపం ఉంటే మాత్రం మరీ ఇలా బాల్‌తో కొడతావా పోలార్డ్... అంటూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది...
ఐపీఎల్ 2022 సీజన్‌లో మొదటి 10 మ్యాచుల్లో కలిపి 5 వికెట్లు మాత్రమే తీసిన జస్ప్రిత్ బుమ్రా, కేకేఆర్‌తో మ్యాచ్‌లో 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదుచేశాడు. బుమ్రా స్పెల్‌లో ఓ త్రీ వికెట్ మెయిడిన్ ఓవర్ కూడా ఉండడం విశేషం...
166 పరుగుల ఈజీ లక్ష్యఛేదనలో రోహిత్ శర్మ వికెట్ త్వరగా కోల్పోయిన ముంబై ఇండియన్స్, ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయి 113 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా మ్యాచ్‌ని గెలిపించలేకపోయాడు. కేకేఆర్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ కూడా ఒకే ఓవర్‌లో 3 వికెట్లు తీసి, ముంబై ఇన్నింగ్స్‌ని దెబ్బ తీయడం విశేషం..