పింక్ జట్టు హెట్మయర్, తొలిసారి తండ్రి అయ్యాడు... బిడ్డతో కలిసి ఆడుకుంటూ వీడియో షేర్...

By Chinthakindhi RamuFirst Published May 10, 2022, 4:48 PM IST
Highlights

భార్య డెలివరీ కోసం రాజస్థాన్ రాయల్స్‌ని వీడిన సిమ్రాన్ హెట్మయర్... పండంటి బిడ్డకి జన్మనిచ్చిన నిర్వానీ... పుట్టిన బిడ్డ గురించి చెప్పకుండా...

ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అంచనాలకు మించి రాణిస్తోంది. గత మూడు సీజన్లలో ఘోరంగా విఫలమవుతూ వస్తున్న రాజస్థాన్ రాయల్స్, ఐపీఎల్ 2022 మెగా వేలంలో చాలా తెలివిగా వ్యవహరించి, మ్యాచ్ విన్నర్లను ఏరికోరి ఎంపిక చేసుకుంది. ఆ స్మార్ట్ వర్క్ రిజల్ట్, ఐపీఎల్ 2022 సీజన్‌ పర్ఫామెన్స్‌తో కనిపిస్తోంది...

11 మ్యాచుల్లో 7 విజయాలు అందుకున్న రాజస్థాన్ రాయల్స్, మిగిలిన 3 మ్యాచుల్లో రెండు విజయాలు అందుకుంటే మిగిలిన జట్లతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధిస్తుంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా మారిన ప్లేయర్ సిమ్రాన్ హెట్మయర్...

గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడిన సిమ్రాన్ హెట్మయర్, మ్యాచులకు బ్లూ కలర్ హెయిర్ స్టైయిల్‌లో హాజరయ్యాడు. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ జెర్సీ రంగు పింక్ కలర్‌ హెయిర్ స్టైయిల్‌లో కనిపిస్తున్న హెట్మయర్, ఐపీఎల్ 2022 సీజన్‌కి స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు...

నిండు గర్భంతో ఉన్న భార్యను వదిలి, ఐపీఎల్ 2022 సీజన్‌ కోసం ఇండియాకి వచ్చాడు సిమ్రాన్ హెట్మయర్. భార్య డెలివరీ కోసం రెండు రోజుల క్రితం క్యాంపు నుంచి బయటికి వెళ్లాడు హెట్మయర్. విండీస్ బ్యాట్స్‌మెన్ అయిన హెట్మయర్ భార్య నిర్వానీ వుమ్‌రావ్, నేడు (మే 10న) పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా  ద్వారా అభిమానులతో పంచుకున్నాడు హెట్మయర్...

‘హే వరల్డ్... వెల్‌ కమ్ అవుట్ బండెల్ ఆఫ్ జాయ్... ’ అంటూ బిడ్డను ముద్దాడుతున్న ఫోటోలను పోస్టు చేసిన హెట్మయర్, తన భార్యను ట్యాగ్ చేసి... ‘ఐ లవ్ సో మచ్’ అంటూ రాసుకొచ్చాడు. అయితే పుట్టిన బిడ్డ ఆడ బిడ్డా... మగ బిడ్డా? అనే విషయాన్ని ప్రస్తావించలేదు సిమ్రాన్ హెట్మయర్...

తన బిడ్డను ఎత్తుకుని, ప్రేమగా ఊపుతూ ఆడుకుంటున్న హెట్మయర్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది రాజస్థాన్ రాయల్స్... ‘మా రాయల్స్ ఫ్యామిలీలోకి కొత్తగా ఓ క్యూట్ ఎంట్రీ వచ్చింది... కంగ్రాట్స్ హెట్మయర్...’ అంటూ పోస్టు చేసి శుభాకాంక్షలు తెలిపింది...

ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.8.5 కోట్ల భారీ ధరకు సిమ్రాన్ హెట్మయర్‌ని కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. 11 మ్యాచుల్లో కలిపి 70 సగటుతో 291 పరుగులు చేసిన సిమ్రాన్ హెట్మయర్, రాజస్థాన్ రాయల్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు...

భార్య ప్రసవం కోసం బయో బబుల్ వీడిన సిమ్రాన్ హెట్మయర్, త్వరలోనే తిరిగి జట్టుతో కలవబోతున్నాడు. ‘నిజానికి ఈ ఐడియా గత ఏడాది వచ్చింది. నా భార్య జీనియస్. నేను గత ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆడినప్పుడు, నా జట్టుకు కలర్ వేసుకోమని సలహా ఇచ్చింది...  ఎలా ఉంటుందో చూద్దామని రంగు వేస్తానని చెప్పింది. నేను కూడా సరేనని చెప్పా. ఈసారి రాజస్థాన్ రాయల్స్‌ తరుపున పింక్ జెర్సీలో ఆడబోతున్నా అని తెలిసి, పింక్ కలర్ వేసింది...  పోయిన ఏడాదే, నీ జట్టుకి పింక్ కలర్ వేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉందని ఆమె అంది. ఆమె కోరినట్టే ఇప్పుడు ఇలా పింక్ కలర్ జట్టుతో మీ ముందు నిల్చున్నా...’ అంటూ కామెంట్ చేశాడు తన పింక్ కలర్ హెయిర్ స్టైయిల్ గురించి కామెంట్ చేశాడు సిమ్రాన్ హెట్మయర్...
 

click me!