IPL 2022: సీఎస్కేకి ధోనీ షాకింగ్ రిక్వెస్ట్..!

By telugu news teamFirst Published Nov 2, 2021, 9:34 AM IST
Highlights

సీఎస్‌కే యాజమాన్యం తమ తురుపు ముక్క, జట్టు సారధి ధోనిని మొదటి ప్రాధాన్యతగా రీటైన్‌ చేసుకుంటుందని ఫ్రాంఛైజీ యజమాని ఎన్‌ శ్రీనివాసన్‌ ఇదివరకే వెల్లడించాడు. ఈ నేపథ్యంలోనే ధోని తాజాగా తన మనసులో మాటను బహిర్గతం చేశాడని సమాచారం. 


IPL 2022 సమరం కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే.. ఈ సమరానికి ముందు ఐపీఎల్ వేలం కూడా జరగనుందనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో..  తమ చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings) జట్టకి మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni) కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. తనను రిటైన్ చేసుకొని డబ్బులు వృథా చేసుకోవద్దని  ధోనీ సూచించినట్లు తెలుస్తోంది.

Also Read: T20 Worldcup 2021: సెమీస్‌ చేరిన ఇంగ్లాండ్... శ్రీలంకపై విజయంతో వరుసగా...

బీసీసీఐ సవరించిన తాజా రూల్స్‌ ప్రకారం ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు నలుగురు ఆటగాళ్లను రీటైన్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ నేపథ్యంలో సీఎస్‌కే యాజమాన్యం తమ తురుపు ముక్క, జట్టు సారధి ధోనిని మొదటి ప్రాధాన్యతగా రీటైన్‌ చేసుకుంటుందని ఫ్రాంఛైజీ యజమాని ఎన్‌ శ్రీనివాసన్‌ ఇదివరకే వెల్లడించాడు. ఈ నేపథ్యంలోనే ధోని తాజాగా తన మనసులో మాటను బహిర్గతం చేశాడని సమాచారం. 

Also Read: ఆ ప్లేయర్ అంటే చాలా ఇష్టం, కానీ అతను టీ20 వరల్డ్‌కప్‌కి కరెక్ట్ కాదు... షేన్ వార్న్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

తాను రీటెన్షన్‌ పాలసీకి వ్యతిరేకమని, తనను రీటైన్‌ చేసుకుని అనవసరంగా డబ్బు వేస్ట్‌ చేసుకోవద్దని ధోని సూచించినట్లు శ్రీనివాసన్‌ స్వయంగా ప్రకటించాడు. అయితే, ఈ ఒక్క విషయంలో తాము ధోని మాటను పక్కకు పెడతామని, అతన్ని వచ్చే సీజన్‌ కోసం తప్పక రీటైన్‌ చేసుకుంటామని శ్రీనివాసన్‌ చెప్పడం విశేషం. కాగా, ఫ్రాంఛైజీలు తమ మొదటి ప్రాధాన్యత ఆటగాడి కోసం 16 కోట్లు వెచ్చించాల్పి ఉంటుంది. ఇదిలా ఉంటే, 2008 నుంచి సీఎస్‌కేతో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్న ధోని మధ్యలో రెండు సీజన్లు మినహా లీగ్‌ మొత్తం సీఎస్‌కేతో పాటే ఉన్న విషయం తెలిసిందే. ధోని సారధ్యంలో సీఎస్‌కే ఇటీవలి సీజన్‌(2021) టైటిల్‌ ఎగరేసుకుపోయింది. దీంతో ధోని సీఎస్‌కే తరఫున సాధించిన టైటిల్‌ల సంఖ్య నాలుగుకు చేరింది. 

click me!