రవిశాస్త్రికి రంజాన్ బిర్యానీ పంపిన మహ్మద్ షమీ... సిరాజ్ మియ్యా ఇంకా పంపలేదంటూ...

Published : May 07, 2022, 05:19 PM IST
రవిశాస్త్రికి రంజాన్ బిర్యానీ పంపిన మహ్మద్ షమీ... సిరాజ్ మియ్యా ఇంకా పంపలేదంటూ...

సారాంశం

టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి రంజాన్ బిర్యానీని పంపించిన మహ్మద్ షమీ... సిరాజ్ మియ్యా పంపే బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నానంటూ రవిశాస్త్రి ట్వీట్...

భారత జట్టు ప్లేయర్లు అందరూ (ఒకరిద్దరు మినహా) ప్రస్తుతం ఐపీఎల్ 2022 సీజన్‌లో బిజీగా ఉన్నారు. మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్ వంటి ప్లేయర్లు... ఐపీఎల్ 2022 సీజన్‌లో బయో బబుల్ మధ్యలోనే రంజాన్ పండగను సెలబ్రేట్ చేసుకున్నారు...

టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి... బయో బబుల్‌లో ఉన్న భారత ప్లేయర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లకు సోషల్ మీడియా ద్వారా ఈద్ ముబారక్ తెలియచేసిన సంగతి తెలిసిందే. ‘ఈద్ ముబారక్ టు మై డబుల్ ట్రబుల్... మహ్మద్ షమీ... ఈ రోజు గేమ్ ఉందిగా... బిర్యానీ తర్వాత! మహ్మద్ సిరాజ్ నువ్వు రెండు సార్లు కుమ్మేసేయ్...’ అంటూ ట్వీట్ చేసి రంజాబ్ శుభాకాంక్షలు తెలియచేశాడు రవి శాస్త్రి...

తాజాగా తన మాజీ కోచ్‌కి రంజాన్ బిర్యానీని పంపాడు మహ్మద్ షమీ. ‘షమీ... అదిరిపోయిందయ్యా??? బిర్యానీకి థ్యాంక్యూ... ’ అంటూ మహ్మద్ షమీని ట్యాగ్ చేసిన రవి శాస్త్రి, భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను కూడా ట్యాగ్ చేసి... ‘సిరాజ్ మియ్యా... నీది ఇంకా బాకీ ఉంది...’ అంటూ ఫన్నీగా కాప్షన్ ఇచ్చాడు...

టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో భారత మాజీ సారథి విరాట్ కోహ్లీతో కలిసి టెస్టుల్లో భారత ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని అత్యంత పటిష్టంగా తయారుచేశాడు రవిశాస్త్రి. మహ్మద్ షమీతో పాటు మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, ఇషాంత్ శర్మ వంటి స్టార్ బౌలర్లు... భారత జట్టుకి విదేశాల్లోనూ అద్భుత విజయాలు అందించారు...

ఆస్ట్రేలియా టూర్ 2020లో టెస్టు ఆరంగ్రేటం చేసిన హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్, బ్రిస్బేన్ టెస్టులో ఐదు వికెట్లు తీసి, సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. అప్పటి నుంచి టెస్టుల్లో భారత జట్టుకి కీలక బౌలర్‌గా మారిపోయాడు మహ్మద్ సిరాజ్...

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ వంటి బౌలర్లు ఉండి ఉంటే, మ్యాచ్ రిజల్ట్ మరోలా ఉండేదని అంచనా వేశారు క్రికెట్ విశ్లేషకులు... ఐపీఎల్ 2022 రిటెన్షన్‌లో భాగంగా మహ్మద్ సిరాజ్‌ని రూ.7 కోట్లకు రిటైన్ చేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

అయితే సిరాజ్, ఈ సీజన్‌లో చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. గత సీజన్లలో పంజాబ్ కింగ్స్‌కి ఆడిన మహ్మద్ షమీని ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్. టేబుల్ టాపర్‌గా కొనసాగుతూ ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న గుజరాత్ టైటాన్స్ విజయంలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు సీనియర్ పేసర్ మహ్మద్ షమీ...

PREV
click me!

Recommended Stories

Ishan Kishan : SRH ప్లేయర్ ఊచకోత.. 33 బంతుల్లోనే సెంచరీ.. సలామ్ కొట్టాల్సిందే !
Virat Kohli : విరాట్ కోహ్లీ ఆస్తి వివరాలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. ఒక్క పోస్టుకు అన్ని కోట్లా?