ఇది మరిచిపోండి.. పొట్టి ప్రపంచకప్ లో వాళ్లిద్దరూ అదరగొడతారు.. టీమిండియా తాజా, మాజీ సారథులపై భజ్జీ వ్యాఖ్యలు

Published : May 07, 2022, 03:23 PM IST
ఇది మరిచిపోండి.. పొట్టి ప్రపంచకప్ లో వాళ్లిద్దరూ అదరగొడతారు.. టీమిండియా తాజా, మాజీ సారథులపై భజ్జీ వ్యాఖ్యలు

సారాంశం

TATA IPL 2022: ఐపీఎల్ లో పేలవ ప్రదర్శనలతో తీవ్ర విమర్శల పాలవుతున్న టీమిండియా తాజా, మాజీ సారథులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ల ఆటతీరుపై  మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

టీమిండియా  వెటరన్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు ఈ ఐపీఎల్ సీజన్ అంతగా కలిసి రావడం లేదు. వరుసగా విఫలమవుతున్న ఈ దిగ్గజ ఆటగాళ్లు భారీ స్కోర్లు చేయడంలో చతికిలపడుతున్నారు. ఒక్కోసారి గోల్డెన్ డకౌట్లతో   తీవ్ర విమర్శల పాలవుతున్నారు. వీరి ఫామ్ పై ప్రస్తుతం టీమిండియా ఫ్యాన్స్ ఆందోనలో ఉన్నారు. రాబోయే నాలుగు నెలల్లో (సెప్టెంబర్-అక్టోబర్ లో) టీ 20 ప్రపంచకప్ తో పాటు కీలక సిరీస్ లు ఉన్న నేపథ్యంలో  ఈ ఇద్దరూ ఇలా ఆడితే టీమిండియా పరిస్థితి ఏంటని వాపోతున్నారు. 

ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ స్పందిస్తూ..  రోహిత్, కోహ్లి ల గురించి ఆందోళన చెందాల్సిన పన్లేదని అన్నాడు. వాళ్లిద్దరి ప్రస్తుత ఫామ్ అనేది తాత్కాలికమని, ప్రపంచంలో ఏ గొప్ప క్రికెటర్ అయినా ఇలాంటి దశను దాటాల్సిందే అని చెప్పుకొచ్చాడు. 

భజ్జీ మాట్లాడుతూ..  ‘వాళ్లిద్దరూ ఛాంపియన్ ప్లేయర్స్. ప్రపంచ స్థాయి ఆటగాళ్లు. టీ20 ప్రపంచకప్ కంటే ముందే ఈ ఇద్దరూ  ఫామ్ లోకి వస్తారని నేను నమ్ముతున్నాను. ప్రపంచంలో ఏ ఆటగాడికైనా ఇలాంటి దశ (వరుస వైఫల్యాలు)  కామన్.  అతి త్వరలోనే వాళ్లు దీన్ని అధిగమిస్తారని కోరుకుంటున్నాను. ఈ దశ నుంచి బయటకు రావడమే కాదు మునపటి కంటే కూడా భాగా ఆడతారని నమ్మకం నాకుంది..’ అని చెప్పుకొచ్చాడు. 

ఐపీఎల్-2022 లో కోహ్లి.. 11 మ్యాచులాడి 21.60 సగటుతో 216 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ పది మ్యాచులలో  198 రన్స్ చేశాడు.  ఈ సీజన్ లో కోహ్లి రెండు సార్లు డకౌట్ అవగా.. రోహిత్ కూడా అతడినే అనుసరించాడు. ఐపీఎల్-15లో రోహిత్ అత్యధిక స్కోరు 43 కాగా.. కోహ్లిది 58. వరుసగా ఏడెనిమిది మ్యాచులు దరిద్రంగా ఆడిన ఈ ఇద్దరూ గత రెండు మ్యాచులలో నిలకడగా ఆడుతుండటం గమనార్హం. 

ఆ ఇద్దరు స్పిన్నర్లు కూడా ఉండాలి.. 

విరాట్ కోహ్లి, రోహిత్ తో పాటు టీమిండియా స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ కూడా టీ20   ప్రపంచకప్ లో ఉండాలని  భజ్జీ తెలిపాడు. ‘భారత్ తరపున రాణించిన కుల్ధీప్‌, చాహల్ ల  భాగస్వామ్యాన్ని సెలక్టర్లు ఎందుకు విడగొట్టారో నాకు తెలియదు. ప్రస్తుతం  ఈ ద్వయాన్ని కచ్చితంగా జట్టులోకి తీసుకురావాలి. టీ20, వన్డేల్లో భారత జట్టుకు చాలా విజయాలు అందించారు. వీరిద్దరూ టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టులో భాగం కావాలి" అని అన్నాడు. 2019 ప్రపంచకప్ కు ముందు ఫామ్ కోల్పోయిన వీళ్లిద్దరూ తర్వాత కొంతకాలం పాటు జట్టుకు దూరంగా ఉన్నారు.  2021 టీ20 ప్రపంచకప్  కు కూడా సెలెక్టర్లు వీరిని పట్టించుకోలేదు. కానీ ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో  అత్యధిక వికెట్లు తీసుకన్న ఆటగాళ్ల జాబితాలో వీళ్లిద్దరిదే అగ్రస్థానం. చాహల్.. 10 మ్యాచుల్లో 19 వికెట్లు తీయగా.. కుల్దీప్.. 10 మ్యాచుల్లో 18 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ishan Kishan : SRH ప్లేయర్ ఊచకోత.. 33 బంతుల్లోనే సెంచరీ.. సలామ్ కొట్టాల్సిందే !
Virat Kohli : విరాట్ కోహ్లీ ఆస్తి వివరాలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. ఒక్క పోస్టుకు అన్ని కోట్లా?