MI vs CSK: రూ. 31.25 కోట్లు పెట్టింది డకౌట్ అవడానికా..? రోహిత్ చెత్త రికార్డు.. కష్టాల్లో ముంబై

Published : Apr 21, 2022, 08:43 PM IST
MI vs CSK: రూ. 31.25 కోట్లు పెట్టింది డకౌట్ అవడానికా..?  రోహిత్ చెత్త రికార్డు.. కష్టాల్లో ముంబై

సారాంశం

TATA IPL 2022 - MI Vs CSK: తప్పక గెలవాల్సిన  మ్యాచ్ లో బాధ్యతతో ఆడాల్సిన  ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లో తడబడుతున్నది. ఓపెనర్లిద్దరూ డకౌట్ కాగా బేబీ ఏబీడీ కూడా వాళ్లనే అనుసరించాడు. హిట్ మ్యాన్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.

రూ. 15. 25 కోట్లు.. ఈ  ఏడాది మెగా వేలంలో ఇషాన్ కిషన్ మీద ముంబై వెచ్చించిన మొత్తమది. ఐపీఎల్ -2022 వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడు దానికి కొంతైనా న్యాయం చేయాలి. కానీ ఇషాన్ మాత్రం వరుస వైఫల్యాల పాలవుతున్నాడు.   ఈ సీజన్ లో ఆడిన తొలి రెండు మ్యాచుల్లో కాస్త బ్యాట్ ఝుళిపించాడే తప్ప.. తర్వాత నాలుగు  మ్యాచులలో  దారుణంగా విఫలమయ్యాడు.  వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడి చెన్నైతో కీలక మ్యాచ్ ఆడుతన్న వేళ డకౌట్ అయి తీవ్ర నిరాశ పరిచాడు. గత 7 ఇన్నింగ్స్ లలో ఇషాన్ స్కోర్లు వరుసగా.. 82, 54, 14, 26, 3, 13, 0 గా ఉన్నాయి. 

రోహిత్ శర్మ కూడా ఈ సీజన్ లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఏడు ఇన్నింగ్స్ లలో కలిపి 114 పరుగులే చేశాడు.  సీఎస్కేతో మ్యాచ్ లో కూడా   హిట్ మ్యాన్.. డకౌట్ అవడం గమనార్హం.  రోహిత్ శర్మ పై రిటెన్షన్ లో భాగంగా చెన్నై వెచ్చించిన మొత్తం రూ. 16 కోట్లు. 

ఈ ఇద్దరి మీద రూ. 31.25 కోట్లు పెట్టింది ముంబై. మిగతా  జట్టుకంతా రూ. 59 కోట్లతో  సరిపెడితే అగ్రభాగం వీరిదే.  మరి ఆ స్థాయిలో వీళ్ల ఆట ఉందా..? అంటే  మాత్రం సమాధానం దొరకదు. గడిచిన ఏడు ఇన్నింగ్స్ లలో వీళ్ల భాగస్వామ్యం ఇలా.. 67, 15, 6, 50, 31, 16, 0.. 

 

టీ20లలో ఓపెనింగ్ భాగస్వామ్యం అత్యంత కీలకం.  ఓపెనర్లు గట్టి పునాధి వేస్తేనే తర్వాత వచ్చే ఆటగాళ్లకు  మార్గం సులవవుతుంది.  అదీగాక ప్రత్యర్థి మీద  పైచేయి సాధించాలంటే  ముందు బాదాల్సింది ఓపెనర్లే.  మరి ముంబై ఓపెనర్ల పరిస్థితి చూస్తే అందుకు విరుద్ధంగా ఉంది. దీంతో ముంబై అభిమానులు  ఈ ఇద్దరిపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. రూ. 31.25 కోట్లు గోవిందా... గోవిందా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

రోహిత్ చెత్త రికార్డు :  

ఈ సీజన్ లో జట్టు అత్యంత పేలవ ఫామ్ తో తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న  రోహిత్ శర్మ..  వ్యక్తిగత  ప్రదర్శన కూడా గొప్పగా ఏమీ లేదు. ఐపీఎల్-15లో రోహిత్ స్కోర్లు వరుసగా.. 41, 10, 3, 26, 28, 6, 0. ఇక కీలక చెన్నైతో మ్యాచ్ లో డకౌట్ అయిన రోహిత్.. ఐపీఎల్  చరిత్రలో అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు.  తాజా  ఔట్ తో కలిపి రోహిత్.. ఐపీఎల్ లో 14  సార్లు డకౌట్ అయ్యాడు. గతంలో అత్యధిక సార్లు డకౌట్ అయిన వారిలో పీయూష్ చావ్లా, హర్భజన్ సింగ్, మన్దీన్ సింగ్, పార్థీవ్ పటేల్, అంబటి రాయుడు (13 సార్లు) ఉన్నారు. 

 

కష్టాల్లో ముంబై.. 

సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్ లో తొలి ఓవర్లోనే  ముంబై  ఓపెనర్లను కోల్పోయింది. ఎదుర్కున్న రెండో బంతికే  రోహిత్.. సాంట్నర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అదే ఓవర్లో ఆఖరు బంతికి ఇషాన్ కిషన్ బౌల్డయ్యాడు. గత రెండు మ్యాచులలో ఫర్వాలేదనిపించిన బేబీ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ (4) కూడా వారినే అనుసరించాడు. ఈ మూడు వికెట్లు ముఖేశ్ చౌదరికే పడ్డాయి.  13 ఓవర్లు ముగిసేసరికి చెన్నై.. 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. తిలక్ వర్మ (22 నాటౌట్),కీరన్ పొలార్డ్ ఆడుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !