MI vs CSK: విజయవంతమైన జట్లు.. అత్యంత చెత్త ప్రదర్శన.. ఐపీఎల్ దిగ్గజాల మధ్య కీలక పోరు.. టాస్ నెగ్గిన సీఎస్కే

Published : Apr 21, 2022, 07:07 PM ISTUpdated : Apr 21, 2022, 07:11 PM IST
MI vs CSK: విజయవంతమైన జట్లు.. అత్యంత చెత్త ప్రదర్శన.. ఐపీఎల్ దిగ్గజాల మధ్య కీలక పోరు.. టాస్ నెగ్గిన సీఎస్కే

సారాంశం

TATA IPL 2022 - MI vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆ రెండు జట్లు అత్యంత విజయవంతమైనవి. ఇప్పటివరకు 14 సీజన్లు ముగియగా.. అందులో 9 సార్లు ఈ రెండు ఫ్రాంచైజీలదే కప్. అయితే ఈ సీజన్ లో మునుపెన్నడూ లేనంత దయనీయ స్థితిలో ఉన్న ఈ జట్లు గురువారం కీలక పోరులో తలపడుతున్నాయి. 

ఐపీఎల్ లో రెండు కీలక జట్ల మధ్య అసలైన సమరానికి సమయం ఆసన్నమైంది.  లీగ్ లో అత్యంత విజయవంతమైన జట్లుగా పేరున్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ లు డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా  హోరాహోరి పోరుకు సిద్ధమయ్యాయి. ఈ రెండు జట్లు కలిపి గతంలో 9 సార్లు లీగ్ విజేతలుగా నిలిచినా.. ఈసారి మాత్రం అత్యంత చెత్త ఆటతీరుతో  పాయింట్ల పట్టికలో  అట్టడుగున చేరాయి. ఆడిన ఆరు మ్యాచుల్లో అన్నీ ఓడి ముంబై ఇండియన్స్ పదో స్థానంలో ఉంటే.. ఆరింటిలో ఐదు ఓడిన చెన్నై తొమ్మిదో  ప్లేస్ లో ఉంది. ప్లే ఆఫ్స్ కు ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే తప్పక  గెలవాల్సిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 

ఈ సీజన్ లో ముంబైకి ఏదీ కలిసి రాలేదు. ముఖ్యంగా గతంలో భీకరమైన బౌలింగ్ బలమున్న ఆ జట్టు ఈసారి గల్లీ స్థాయి బౌలర్ల కంటే  దారుణమైన ప్రదర్శనలు చేస్తున్నది.  స్వయంగా  ఆ జట్టు సారథి రోహిత్ శర్మ సైతం జట్టు కూర్పుపై  అసహనం వ్యక్తం చేస్తున్నా   ఆటగాళ్లను మార్చడం లేదు ముంబై.  కానీ నేటి మ్యాచ్ లో మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నది. ఆఫ్ స్పిన్నర్ హృతిక్  షోకీన్, మెరిడిత్, డేనియల్ సామ్స్ లు తుది జట్టులో ఉన్నారు. చెన్నై జట్టులో కూడా..మిచెల్ సాంట్నర్, ప్రిటోరియస్ జట్టులోకి వచ్చారు.

ముఖాముఖి : లీగ్ లో ఇరు జట్లకు ఘనమైన రికార్డు ఉంది. రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 32 మ్యాచులు జరుగగా.. అందులో 19 సార్లు ముంబైనే విజయం వరించింది. 13 మ్యాచుల్లో చెన్నై నెగ్గింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత 14 మ్యాచులలో కూడా ముంబైదే ఆధిపత్యం. 14 మ్యాచులలో ఏకంగా పదింట్లో రోహిత్ సేనదే విజయం. నాలుగు మాత్రమే సీఎస్కే  గెలిచింది. 

గత రికార్డులు, ఆటగాళ్ల బలాబలాలు చూస్తే ఈ రెండు జట్లు ఈ సీజన్ ను మినహాయిస్తే దిగ్గజాలే. అయితే ఐపీఎల్-15లో మాత్రం ముంబై, చెన్నైలకు కలిసిరావడం లేదు. కాగా, ప్లేఆఫ్స్ చేరడానికి ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. ఒకప్పుడు టాప్-2లో ఉండే ఈ రెండు జట్లు ఇప్పడు కింది నుంచి  9, 10వ స్థానాల్లో ఉన్నాయి. 

ప్లేఆఫ్స్ కు చేరాలంటే.. 

నేటి మ్యాచ్ తో పాటు ఇకపై జరుగబోయే ప్రతి మ్యాచ్ లో కూడా ముంబై గెలవాల్సి ఉంటుంది.  ఏదైనా అద్భుతం జరిగితే తప్ప దానికి తప్పించుకునే వీలు కూడా లేదు. ఎందుకంటే ఇప్పటికే  ఆరు మ్యాచులు ఓడింది  ముంబై. అదీగాక  ముంబై నెట్ రన్ రేట్ (-1.048) కూడా దారుణంగా ఉంది. 

ఇక  చెన్నై విషయానికొస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగి  చెత్త ఆటతో విమర్శలనెదుర్కుంటున్న  సీఎస్కే ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ మాత్రమే నెగ్గింది.  మరో 7 మ్యాచులు గెలిస్తేనే ఆ  జట్టుకు కూడా ప్లేఆఫ్ అవకాశాలుంటాయి. ముంబైతో పాటు చెన్నైకి కూడా ఇకనుంచి ప్రతి మ్యాచ్  లైఫ్ అండ్ డెత్ మాదిరిగానే ఉంటుంది. 

తుది జట్లు : 

ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, డెవాల్డ్ బ్రెవిస్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, డేనియల్ సామ్స్, రిలే మెరిడిత్,  హృతిక్ షోకీన్, జస్ప్రీత్‌ బుమ్రా,  జయదేవ్ ఉనద్కత్

చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా (కెప్టెన్), డ్వేన్ బ్రావో, డ్వేన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, మహీశ్ తీక్షణ, ముకేశ్ చౌదరి

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !