నాకు అతనంటే బాగా ఇష్టం... ఆ మత్తులో చాలా విషయాలు చెప్పిన మార్క్ వుడ్...

Published : Mar 31, 2022, 03:43 PM ISTUpdated : Mar 31, 2022, 04:10 PM IST
నాకు అతనంటే బాగా ఇష్టం... ఆ మత్తులో చాలా విషయాలు చెప్పిన మార్క్ వుడ్...

సారాంశం

వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన మార్క్ వుడ్... గాయంతో టెస్టు సిరీస్‌తో పాటు ఐపీఎల్ 2022 సీజన్‌కి దూరమైన మార్క్ వుడ్... 

ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్లలో ఇంగ్లాండ్ పేసర్ మార్క్ వుడ్ ఒకడు. బేస్ ప్రైజ్ ధర దక్కించుకున్న జాసన్ రాయ్, ఆలెక్స్ హేల్స్... బయో బబుల్ ఫీయర్‌తో ఐపీఎల్ నుంచి తప్పుకుంటే, గాయం కారణంగా ఈ సీజన్‌కి దూరమయ్యాడు ఇంగ్లాండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్..

తాజాగా మోచేతికి శస్త్రచికిత్స్ చేయించుకున్న మార్క్ వుడ్, అనస్థేషియా స్టేజ్‌లో మాట్లాడిన మాటలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది ఇంగ్లాండ్ బార్మీ ఆర్మీ. 

‘నా భుజం బాగా లాగుతోందా... ఇదో రకంగా ఉంది. నాకు మోచేతి సర్జరీ అయ్యింది. నా భుజాలు బాగా నొప్పి పెడుతున్నాయి. నేను ఇప్పటికీ ఫాస్ట్ బౌలింగ్ వేయగలడు... ’ అంటూ మూలుగుతూ చెప్పాడు మార్క్ వుడ్...

అలాగే లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్‌ని కూడా ఆ స్థితిలో గుర్తు చేసుకున్నాడు మార్క్ వుడ్... ‘నాకు ఆండీ ఫ్లవర్ అంటే బాగా ఇష్టం. అతను చాలా మంచోడు...’ అంటూ కామెంట్ చేశాడు మార్క్ వుడ్. 


జింబాబ్వే మాజీ క్రికెటర్ అయిన ఆండీ ఫ్లవర్, ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్‌కి అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత కౌంటీీ టీమ్‌లతో పాటు పాక్ సూపర్ లీగ్‌లో పెషావర్ జెల్మీ, ముల్తాన్ సుల్తాన్, సెయింట్ లూసియా జోక్స్, ఇండియన్ ప్రీమియర్ లీగ్2లో కింగ్ ఎలెవన్ పంజాబ్ జట్లకి కోచ్‌గా వ్యవహరించాడు...

గౌతమ్ గంభీర్ మెంటర్‌గా వ్యవహరిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్‌కి హెడ్ కోచ్‌గా నియమించబడ్డాడు ఆండీ ఫ్లవర్. 


అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్, వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో గాయపడి రెండో టెస్టుకి దూరమయ్యాడు... మోచేతి గాయం కారణంగా వెస్టండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ మొత్తానికి దూరమైన మార్క్ వుడ్, ఐపీఎల్‌ 2022 నుంచి కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు... 

ఐపీఎల్ 2022 మెగా వేలంలో మార్క్ వుడ్‌ని రూ.7.5 కోట్ల భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసింది కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్... మార్క్‌ వుడ్‌కి ఇదే మొట్టమొదటి ఐపీఎల్ అయ్యేది...

140-150 కి.మీ.ల వేగంతో నిప్పులు చెరిగే బంతులు వేయడమే కాకుండా అవసరమైతే బ్యాటింగ్‌లో మెరుపులు మెరపించగల మార్క్ వుడ్, లక్నోకి ఆల్‌రౌండర్‌గా ఉపయోగపడతాడని భావించారు టీమ్ మేనేజ్‌మెంట్...  అయితే ఐపీఎల్‌ ఆరంభానికి ముందు గాయపడిన మార్క్ వుడ్, ఈసారి కూడా లీగ్‌లో పాల్గొనలేకపోతున్నాడు. 


మార్క్ వుడ్ స్థానంలో ఆండ్రూ టైని రిప్లేస్‌మెంట్‌గా తీసుకుంది లక్నో సూపర్ జెయింట్స్. అలాగే గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసిన జాసన్ రాయ్‌తో పాటు కేకేఆర్ ప్లేయర్ ఆలెక్స్ హేల్స్... బయో బబుల్‌లో రెండున్నర నెలలు గడపలేమంటూ ఐపీఎల్ 2022 సీజన్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే..  జాసన్ రాయ్ స్థానంలో ఆఫ్ఘాన్ యంగ్ బ్యాటర్ రెహ్మనుల్లా గుర్భాజ్‌ను రిప్లేస్‌మెంట్‌గా తీసుకుంది గుజరాత్ టైటాన్స్. ఆలెక్స్ హేల్స్ స్థానంలో ఆసీస్ వైట్ బాల్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, కేకేఆర్ తరుపున ఆడబోతున్నాడు...

PREV
click me!

Recommended Stories

Team India : గిల్ కోసం బలిపశువుగా మారిన స్టార్ ! గంభీర్, అగార్కర్ ఏందయ్యా ఇది !
Smriti Mandhana : పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయింది.. మౌనం వీడిన స్మృతి మంధాన !