Women's World Cup: ప్చ్..! సఫారీ మరో‘సారి’.. ఈసారీ కొత్త విజేత లేదు.. ఫైనల్ కు ఆసీస్ తో పోటీకి ఇంగ్లాండ్ రెడీ

Published : Mar 31, 2022, 01:31 PM ISTUpdated : Mar 31, 2022, 01:33 PM IST
Women's World Cup: ప్చ్..! సఫారీ మరో‘సారి’.. ఈసారీ కొత్త విజేత లేదు.. ఫైనల్ కు ఆసీస్ తో పోటీకి ఇంగ్లాండ్ రెడీ

సారాంశం

ICC Women's World Cup  2022: మహిళల  వన్డే ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ల ఆధిపత్యానికి ఈసారైనా తెరపడుతుందేమోనని ఆశించిన క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు అంచనాలు మరోసారి తప్పాయి.  లీగ్ స్టేజ్ లో గొప్పగా రాణించిన దక్షిణాఫ్రికా.. సెమీస్ లో బొక్క బోర్లా పడింది.  

న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా చిత్తుచిత్తుగా ఓడింది.  లీగ్ స్టేజ్ లో అద్భుత ప్రదర్శనలతో అదరగొట్టిన ఆ జట్టు.. తీరా కీలక పోరులో చేతులెత్తేసింది. ఇటీవలే భారత్ తో జరిగిన పోరులో ఆఖరి బంతి వరకు పోరాడిన ఆ జట్టు.. ఇంగ్లాండ్ తో మ్యాచులో మాత్రం పూర్తిగా విఫలమైంది.  బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా చతికిలపడి ఫైనల్  కు చేరి కప్ కొట్టాలన్న ఆశను చేజేతులా  కోల్పోయింది. ఇంగ్లాండ్ విధించిన 294 పరుగుల లక్ష్య ఛేధనలో..  156 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఇంగ్లాండ్..  137 పరుగులతో విజయం సాధించి పైనల్ లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్దమైంది. కాగా  దక్షిణాఫ్రికాతో మ్యాచులో సెంచరీ చేసిన ఇంగ్లాండ్ బ్యాటర్ డానియాల్ వ్యాట్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

క్రిస్ట్ చర్చ్ వేదికగా జరిగిన  మ్యాచులో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అందుకు సఫారీలకు ఆశించిన ఆరంభమే దక్కింది.  ఇన్నింగ్స్ 3.2 ఓవర్లోనే ఇంగ్లాండ్.. ఓపెనర్  బ్యూమోంట్ (1)  వికెట్ ను కోల్పోయింది. 

12 వ ఓవర్లో ఆ జట్టు సారథి నైట్ (19 బంతుల్లో 1) కూడా వెనుదిరిగింది. ఆ కొద్దిసేపటికే సీవర్ (18) కూడా పెవలియన్ బాట పట్టింది. అయితే ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్నా ఓపెనర్ గా వచ్చిన వ్యాట్ (125 బంతుల్లో 129.. 12 ఫోర్లు) మాత్రం పట్టుదలగా ఆడింది. చూడచక్కని షాట్లతో అలరించింది. 

 

77 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన  సమయంలో బ్యాటింగ్ కు వచ్చిన వికెట్ కీపర్ ఎమీ జోన్స్ (28) తో కలిపి వ్యాట్ నాలుగో వికెట్ కు 49 పరుగులు  జోడించింది. కానీ ఈ జోడిని 25.4 ఓవర్లో కాప్ విడదీసింది. ఇక జోన్స్ స్థానంలో  క్రీజులోకి వచ్చిన డంక్లీ (72 బంతుల్లో 60) తో కలిపి వియాట్ రెచ్చిపోయింది.  ఇద్దరూ కలిసి సఫారీ బౌలర్లను ధీటుగా ఎదుర్కుని ఇంగ్లాండ్ కు భారీ  స్కోరుకు బాటలు వేశారు. ఐదో వికెట్ కు ఈ ఇద్దరూ.... 116 పరుగుల భాగస్వామ్యం జోడించారు.  వీరికి తోడు చివర్లో ఎక్లెస్టోన్ (11 బంతుల్లో 24.. 5 ఫోర్లు) ధాటిగా ఆడటంతో ఇంగ్లాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది. 

భారీ లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఆది నుంచి తడబడ్డారు. ఓపెనర్లిద్దరూ పది పరుగుల లోపే ఔటయ్యారు.  ఆ తర్వాత  లారా గుడాల్ (28), కెప్టెన్ సునె లుస్ (21), మిగ్నోన్ డుప్రీజ్ (30), మరిజన్నె కాప్ (21) లు మాత్రమే కాస్త ప్రతిఘటించారు.  అయితే కాస్తో కూస్తో రాణించిన వీళ్లెవరూ ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు.  డుప్రీజ్ తో పాటు కాప్, ట్రియాన్్,. చెట్టీ, ఇస్మాయిల్, క్లాస్ ల వికెట్లన్నీ ఇంగ్లాండ్ బౌలర్ ఎక్లెస్టోన్ (6 వికెట్లు) దక్కాయి. ఇంగ్లాండ్ బౌలర్ల జోరుకు దక్షిణాఫ్రికా  ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు.  ఆ జట్టు పతనం చేస్తుంటే భారత్ తో ఈ జట్టేనా పోరాడింది...? అన్న అనుమానం కలగక మానదు. 

 

తాజా ఫలితంతో మహిళల ప్రపంచకప్ లో ఈసారైనా కొత్త విజేత ను చూస్తారని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇప్పటివరకు మహిళల క్రికెట్ లో 11 వన్డే ప్రపంచకప్ లు జరుగగా అందులో  ఆరు సార్లు ఆస్ట్రేలియా... 4 సార్లు ఇంగ్లాండ్.. ఒకసారి న్యూజిలాండ్ ట్రోఫీని దక్కించుకున్నాయి. ఇక 12 వ వన్డే ప్రపంచకప్ కూడా ఆసీస్-ఇంగ్లాండ్ మధ్యే జరుగనుండటం గమనార్హం.   టైటిల్ పోరు కోసం ఈ రెండు జట్లు ఏప్రిల్ 3న క్రిస్ట్ చర్చ్ లో తలపడతాయి. 

PREV
click me!

Recommended Stories

ఇదేం లాజిక్ సామీ.. గంభీర్ దత్తపుత్రుడి కోసం ఇద్దరి కెరీర్ బలి.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
ఒరేయ్ బుడ్డోడా.. సచిన్‌ను గుర్తు చేశావ్.! 14 సిక్సర్లతో మోత మోగించిన వైభవ్.. ఏం కొట్టుడు మావ