IPL Media Rights: కనికరమే లేకుండా కనీస ధరను భారీగా పెంచిన బీసీసీఐ.. టార్గెట్ రీచ్ అయ్యేందుకు తగ్గేదేలే..

Published : Mar 31, 2022, 12:53 PM IST
IPL Media Rights: కనికరమే లేకుండా కనీస ధరను భారీగా పెంచిన బీసీసీఐ.. టార్గెట్ రీచ్ అయ్యేందుకు తగ్గేదేలే..

సారాంశం

BCCI - IPL Media Rights : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)  ఇటీవలే విడుదల చేసిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలం  కనీస ధరను కనికరం లేకుండా పెంచేసింది. గతంతో పోల్చితే డబుల్ బేస్ ప్రైస్ ను టెండర్లలో పొందుపరిచింది. 

ప్రపంచ క్రికెట్ లో అత్యంత ధనవంతమైన బోర్డుగా వెలుగుతున్న బీసీసీఐ.. బంగారు కోడిగుడ్లు పెడుతున్న  బాతు (ఐపీఎల్) ను వీలైనంతగా వాడుకుంటున్నది.  భారత్ లో క్రికెట్ కు  ఉన్న క్రేజ్, ఐపీఎల్  అంటే  ఫ్యాన్స్ లో ఉన్న  అంచనాలు వెరసి  ఈ లీగ్ బీసీసీఐకి  కామధేనువు లా మారింది.  అందుకే దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని నానాటికీ పెంచుకుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవలే విడుదల చేసిన ఐపీఎల్  మీడియా హక్కుల వేలానికి సంబంధించి..  కనీస ధర (బేస్ ప్రైస్) ను కూడా అమాంతం పెంచింది. గతంలో ఉన్న కనీస ధర రూ. 16,347.5 కోట్లను ఇప్పుడు డబుల్ చేసింది. ఏం చేసైనా సరే.. మీడియా హక్కుల ద్వారా రూ. 50వేల కోట్లను ఆర్జించడమే  బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకున్నది. 

2023-2027 (ఐదేండ్ల కాలానికి) గాను బీసీసీఐ.. ఐపీఎల్ మీడియా హక్కుల ఈ-టెండర్ ను ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బీసీసీఐ అధికారిక ప్రసారదారుగా వ్యవహరిస్తున్న డిస్నీ స్టార్ ఒప్పందం ఈ ఏడాదితో ముగియనుంది. 2018లో  స్టార్.. ఐపీఎల్ మీడియా హక్కులు దక్కించుకున్నప్పుడు  వీటి బేస్  ప్రైస్.. రూ. 16,347.5 కోట్లుగా ఉండేది. ఇప్పుడు దానిని రూ. 33,000 కోట్లకు పెంచింది. 

 

అంటే గతంతో పోల్చితే వంద శాతం అధికం.  ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా కనీస ధరను పెంచినట్టు బీసీసీఐ అధికార ప్రతినిధి  ఒకరు వెల్లడించారు. ‘ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలుసు. గత ఐదేండ్లలో  దాని విలువ రెట్టింపయ్యింది. అంతర్జాతీయ సంస్థలు కూడా ఐపీఎల్ వెంట పడుతున్నాయి. భవిష్యత్ లో ఈ లీగ్ ఖండంతరాలు వ్యాపిస్తుందనడంలో సందేహమే లేదు.  ఈ నేపథ్యంలోనే మీడియా హక్కుల విషయంలో కూడా  మేం బేస్ ప్రైస్ ను నిర్ణయించాం...’ అని వెల్లడించారు. 

ఇదిలాఉండగా.. ఈసారి  మీడియా హక్కులను అన్లాక్ చేయడానికి గాను వాటిని 4 బండిల్ లుగా విభజించారు. ఒక సంస్థ ఒకే  బిడ్ వేయాలి. మిశ్రమ బిడ్ లను కూడా అనుమతించడం లేదు. 

బండిల్ ఏ : భారత ఉపఖండంలో ప్రసారాలు : ఈ ప్యాకేజీ కోసం బేస్ ధర ఒక్కో గేమ్ కు రూ. 49 కోట్లు (మొత్తం 74 మ్యాచులు). ఐదేండ్ల లెక్కన రూ. 18,130 కోట్లు. 
బండిల్ బీ :  భారత ఉపఖండంలో డిజిటల్ హక్కులు : ఒక్కో మ్యాచుకు  రూ. 33 కోట్లు. ఐదేండ్లకు 12,210 కోట్లు 
బండిల్ సీ : నాన్ ఎగ్జిక్యూటివ్ ప్యాకేజీ : 18 గేమ్ లను కలిగిఉన్న ఈ ప్యాకేజీ బండిల్ సీలో ఉంది. ఈ క్లస్టర్ లో  ఒక్కో గేమ్ కు రిజర్వ్ ధర రూ. 16 కోట్లు. ఒక్కో సీజన్ కు రూ. 74 గేమ్ లు. ఈ లెక్కన ఐదేండ్ల పాటు రూ. 1440 కోట్లు. 
బండిల్ డీ : ఉపఖండం వెలుపల (ప్రపంచవ్యాప్తంగా)  : ఈ ప్యాకేజీలో ఒక్కో గేమ్ కు రూ. 3 కోట్లుగా నిర్ణయించారు. ఐదేండ్లకు 1110 కోట్లు.. 

2023-27 సీజన్ కోసం ఐపీఎల్  మీడియా హక్కుల టెండర్లకు బీసీసీఐ ఇటీవలే  దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. జూన్ 12 న ఇందుకు సంబంధించిన వేలం నిర్వహించి  విజేత పేరును బీసీసీఐ ప్రకటించనుంది. 

PREV
click me!

Recommended Stories

ఇదేం లాజిక్ సామీ.. గంభీర్ దత్తపుత్రుడి కోసం ఇద్దరి కెరీర్ బలి.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
ఒరేయ్ బుడ్డోడా.. సచిన్‌ను గుర్తు చేశావ్.! 14 సిక్సర్లతో మోత మోగించిన వైభవ్.. ఏం కొట్టుడు మావ