శార్దూల్ కు బాడీగార్డులుగా చేరిన ఆ ఇద్దరు స్టార్ క్రికెటర్లు.. ఫేమస్ అవ్వాలంటే తప్పదంటున్న ఢిల్లీ ఆల్ రౌండర్

Published : Mar 18, 2022, 04:28 PM IST
శార్దూల్ కు బాడీగార్డులుగా చేరిన ఆ ఇద్దరు స్టార్ క్రికెటర్లు.. ఫేమస్ అవ్వాలంటే తప్పదంటున్న ఢిల్లీ ఆల్ రౌండర్

సారాంశం

IPL 2022 Live Updates: యువ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఫేమస్ అవడానికి ఇద్దరు  అంగరక్షకులను నియమించుకున్నాడు. బాడీగార్డులంటే ఏదో ఆషామాషీగా సూటు బూటు వేసుకుని తిరిగేవారంటే పొరపాటే. ఏకంగా టీమిండియా కెప్టెన్ నే బాడీగార్డుగా నియమించుకున్నాడు లార్డ్ శార్దూల్.. 

భారత క్రికెట్ లో ఇప్పుడిప్పుడే ఆల్ రౌండర్ గా ఎదుగుతున్న  యువ ఆటగాడు శార్దూల్ ఠాకూర్ ఇప్పటికే  ‘లార్డ్’ పేరుతో ప్రాచుర్యం పొందాడు. అయితే ఇప్పుడు ఇది కూడా చాలదన్నట్టు ఇంకా ఫేమస్ కావాలని  కోరుకుంటున్నాడు ఈ ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్ రౌండర్.  గుర్తింపు పొందడానికి ఇద్దరు బాడీగార్డులను కూడా పెట్టుకున్నాడు. అంగరక్షకులంటే  ఏదో ఆషామాషీ వ్యక్తులు అంటే పొరబడినట్టే.. శార్దూల్ ఠాకూర్ కు బాడీ గార్డుగా చేరింది ఎవరో కాదు.. టీమిండియా సారథి రోహిత్ శర్మ, భారత టెస్టు జట్టు మాజీ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే.. ఈ ఇద్దరూ ఇప్పుడు  ఠాకూర్ కు బాడీగార్డులుగా చేరారు.  ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు. 

ఐపీఎల్ ప్రారంభానికి కొద్దిరోజుల ముందు  సోషల్ మీడియా వేదికగా శార్దూల్.. తనకు  కుడివైపున రహానే, ఎడమవైపున రోహిత్ శర్మ ఉన్న ఫోటోను షేర్ చేశాడు.   బెంగళూరు లోని జాతీయ  క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో తీసుకున్న ఆ ఫోటోను తాజాగా తన ఇన్స్టా లో షేర్ చేశాడు శార్దూల్ ఠాకూర్.. 

 

ఈ సందర్భంగా ఠాకూర్ ఫోటోను షేర్ చేస్తూ.. ‘నా దృష్టిలో అంగరక్షకులను కలిగి ఉండటం అంటే ఫేమస్ అవడంలో ఒక భాగం మాత్రమే..’ అని ఫన్నీగా రాసుకొచ్చాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  హిట్ మ్యాన్, రహానే తో పాటు శార్దూల్ కూడా మహారాష్ట్ర కు చెందిన క్రికెటరే కావడం గమనార్హం. ముంబయి రంజీ జట్టులో ఈ ఇద్దరూ శార్దూల్ కు సీనియర్లు కూడా.. 

ఈ ఫోటోను శార్దూల్  ఇన్స్టాలో షేర్ చేయగానే..  ‘భయ్యా.. మీ బాడీగార్డులకు బాడీ లేదు. వీక్ గా ఉన్నారు’,  ‘ఇటువంటి బాడీగార్డులుంటే వద్దన్నా ఫేమస్ అవుతావు..’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

 

ఇదిలాఉండగా.. 2018 నుంచి  2021 దాకా ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన  శార్దూల్ ను ఈ ఏడాది వేలం ప్రక్రియలో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.  రూ. 10.75 కోట్లతో అతడు ఢిల్లీకి దక్కాడు. పవర్ ప్లే లో కీలకంగా వ్యవహరించే ఈ బౌలింగ్ ఆల్ రౌండర్.. లోయరార్డర్ లో బ్యాటింగ్ లో కూడా మెరుపులు మెరిపించగల సమర్థుడు.  ప్రస్తుతం ఐపీఎల్-15 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంపునకు చేరుకున్న శార్దూల్..  ఈనెల 27న ముంబైతో జరిగే మ్యాచులో సత్తా చాటాలని భావిస్తున్నాడు. బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచు కోసం ఢిల్లీ తీవ్ర కసరత్తులు చేస్తున్నది. ఇక గతేడాది ఐపీఎల్ లో సీఎస్కే తరఫున ఆడిన శార్దూల్.. 21 వికెట్లు తీసుకున్నాడు. అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
IPL 2026 Auction: ఐపీఎల్ మినీ వేలం సిద్ధం.. 77 స్థానాలు.. 350 మంది ఆటగాళ్లు! ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?