IPL: రాయల్స్ రాజసం మళ్లీ వచ్చేనా..? పక్కా ప్లాన్ తో దిగుతున్న రాజస్థాన్.. షెడ్యూల్ ఇదిగో..

Published : Mar 24, 2022, 03:54 PM IST
IPL: రాయల్స్ రాజసం మళ్లీ వచ్చేనా..? పక్కా ప్లాన్ తో దిగుతున్న రాజస్థాన్.. షెడ్యూల్ ఇదిగో..

సారాంశం

Rajasthan Royals Full Schedule: ఐపీఎల్ తొలి సీజన్ లో విజేత రాజస్థాన్ రాయల్స్ ఆ తర్వాత మళ్లీ ఆ  రాజసాన్ని ప్రదర్శించలేకపోయింది.  ఆల్ రౌండర్లు, బ్యాటర్లు, బౌలింగ్ దళంతో  పటిష్టంగా కనిపిస్తున్న రాజస్థాన్.. ఈసారి సీజన్ లో మాత్రం పక్కా ప్రణాళికతో దిగుతున్నది. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో తొలి సీజన్ విజేతగా నిలిచిన  రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) ఆ తర్వాత  13 ఏండ్లు గడుస్తున్నా తిరిగి ఆ దిశగా అడుగులు వేయలేదు.  మూడు సార్లు ప్లేఆఫ్ చేరినా ఫైనల్ కు మాత్రం రాలేదు. గత మూడు సీజన్లుగా గ్రూప్ స్టేజ్ కే పరిమితమైన సంజూ శాంసన్ నేతృత్వంలోని  రాయల్స్.. ఈసారి  మాత్రం కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉన్నది.  ఆ మేరకు వేలంలో ఆటగాళ్లను కూడా దక్కించుకున్నది. ఈ సీజన్ లో విజయం సాధించి ఆ జట్టుకు తొలి ట్రోఫీ అందించిన షేన్ వార్న్ (ఇటీవలే గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే) కు నివాళి ఇవ్వాలని రాజస్థాన్ భావిస్తున్నది.  

పేపర్ మీద చూస్తుంటే జట్టు బలంగా కనిపిస్తున్నది. సంజూశాంసన్, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, హిట్మెయిర్, దేవదత్ పడిక్కల్ వంటి  బ్యాటర్లు ఉండగా  వేలంలో టీమిండియా పేసర్ ప్రసిద్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్ వంటి బౌలర్లను దక్కించుకుంది.  ఇక కుమార సంగక్కర వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు రాజస్థాన్ కు హెడ్ కోచ్ గా ఉండగా  లంకకు చెందిన దిగ్గజ బౌలర్ లసిత్ మలింగ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. 

గ్రూప్-ఏలో ఉన్న రాజస్థాన్.. ఈ నెల 29న సన్ రైజర్స్ హైదరాబాద్ తో  కలిసి తొలి పోరుకు సిద్ధమవుతున్నది. రాజస్థాన్ రాయల్స్ ఫుల్ షెడ్యూల్ కింది విధంగా ఉంది.

ఫుల్ షెడ్యూల్ : 

మార్చి 29 : ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ - సాయంత్రం 7.30 గంటలకు - ఎంసీఏ స్టేడియం, పూణె 
ఏప్రిల్ 02 : ఆర్ఆర్ వర్సెస్ ముంబై (ఎంఐ) - మధ్యాహ్న 3.30 గంటలకు - డీవై పాటిల్  
ఏప్రిల్ 05 : ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ - సాయంత్రం 7.30 గంటలకు - వాంఖెడే
ఏప్రిల్ 10: ఆర్ఆర్ వర్సెస్ లక్నో (ఎల్ఎస్జీ) - సాయంత్రం 7.30 గంటలకు - వాంఖెడే 
ఏప్రిల్ 14 : ఆర్ఆర్ వర్సెస్ గుజరాత్ (జీటీ) - సాయంత్రం 7.30 గంటలకు - డీవై పాటిల్ 
ఏప్రిల్ 18 : ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ - సాయంత్రం 7.30 గంటలకు - బ్రబోర్న్ 
ఏప్రిల్ 22 : ఆర్ఆర్ వర్సెస్  ఢిల్లీ (డీసీ) - సాయంత్రం 7.30 గంటలకు - పూణె 
ఏప్రిల్ 26 : ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ - సాయంత్రం 7.30 గంటలకు - పూణె   
ఏప్రిల్ 30 : ఆర్ఆర్ వర్సెస్ ఎంఐ - సాయంత్రం 7.30 గంటలకు - డీవై పాటిల్
మే 02 : ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ - సాయంత్రం 7.30 గంటలకు - వాంఖెడే 
మే 07 : ఆర్ఆర్ వర్సెస్ పీబీకేఎస్ - మధ్యాహ్నం 3.30 గంటలకు - వాంఖెడే
మే 11 : ఆర్ఆర్ వర్సెస్ డీసీ - సాయంత్రం 7.30 గంటలకు - డీవై పాటిల్ 
మే 15 : ఆర్ఆర్ వర్సెస్ లక్నో (ఎల్ఎస్జీ) -  సాయంత్రం 7.30 గంటలకు - బ్రబోర్న్ 
మే 20 : ఆర్ఆర్ వర్సెస్ సీఎస్కే - సాయంత్రం 7.30 గంటలకు - బ్రబోర్న్ 

 

రాజస్థాన్ రిటెన్షన్ ప్లేయర్లు : సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్

వేలంలో దక్కించుకున్న ఆటగాళ్లు : ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్, షిమ్రాన్ హిట్మెయిర్, దేవదత్ పడిక్కల్, ప్రసిద్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, రియాన్ పరాగ్, కేసీ కరియప్ప, నవదీప్ సైనీ, ఒబెడ్ మెక్ కాయ్, అరునయ్ సింగ్, కుల్దీప్ సేన్, కరుణ్ నాయర్, దృవ్ జురెల్, తేజస్ బరోకా, కుల్దీప్ యాదవ్, శుభం గర్హ్వల్, డారెల్ మిచెల్, రస్సీ వన్ డెర్ డసెన్, నాథన్ కార్టర్ నీల్,   జేమ్స్ నీషమ్ 

కోచింగ్ సిబ్బంది : 

- కుమార సంగక్కర : హెడ్ కోచ్ 
- ట్రెవర్ పెన్నీ : అసిస్టెంట్ కోచ్
- అమోల్ మజుందార్ : బ్యాటింగ్ కోచ్ 
- స్టెఫాన్ జోన్స్ : హై పర్ఫార్మెన్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ 
- సాయిరాజ్ బహుతులే : స్పిన్ బౌలింగ్ కోచ్
- లసిత్ మలింగ : ఫాస్ట్ బౌలింగ్ కోచ్ 
- దిశాంత్ యజ్ఞిక్ : ఫీల్డింగ్ కోచ్ 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !