IPL: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని.. ఈసారైనా కప్ వాళ్లదేనా? డుప్లెసిస్ బెంగళూరు కథ మార్చేనా..?

Published : Mar 24, 2022, 02:59 PM ISTUpdated : Mar 24, 2022, 03:08 PM IST
IPL: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని.. ఈసారైనా కప్ వాళ్లదేనా?  డుప్లెసిస్ బెంగళూరు కథ మార్చేనా..?

సారాంశం

Royal Challengers Bangalore Schedule: ఐపీఎల్ గెలవడానికి అన్ని అర్హతలు ఉండి కూడా ఇంతవరకు ఆ ముచ్చట తీర్చుకోని జట్లలో బెంగళూరు ఒకటి. ఆ జట్టు తరఫున దిగ్గజాలు ఆడినా బెంగళూరు తలరాత మాత్రం మారలేదు. మరి డుప్లెసిస్ ఆ రాత మారుస్తాడా..?

ప్రపంచపు అగ్రశ్రేణి ఆటగాళ్లు.. ఎవరికి వాళ్లు తోపులే. ఒంటి చేత్తో మ్యాచును గెలిపించగల సత్తా ఉన్న ప్లేయర్లు జట్టు నిండా బోలెడంత మంది ఉన్నారు.  ఆపదలో ఆదుకుని మ్యాచులను ముగించగల సత్తా ఉన్న ఆటగాళ్లుకు కొదవలేదు.      అయితే అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని  అన్నట్టు.. కావల్సిన వనరులున్నా ఐపీఎల్ లో బెంగళూరు మాత్రం ఇంతవరకు కప్ కొట్టలేదు. దిగ్గజ క్రికెటర్లు సారథులుగా పని చేసిన ఈ జట్టుకు ఇప్పుడు దక్షిణాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ కొత్త కెప్టెన్ అయ్యాడు. వరుసగా 9 సీజన్ల పాటు సారథిగా పనిచేసిన విరాట్ కోహ్లి గత సీజన్లో  కెప్టెన్సీ నుంచి వైదొలిగిన నేపథ్యంలో డుప్లెసిస్ ఆ బాధ్యతలు స్వీకరించాడు. మరి డుప్లెసిస్ ఆర్సీబీ కథను మారుస్తాడా..? 

ఐపీఎల్  14 సీజన్లలో 6 సార్లు ప్లేఆఫ్ చేరింది ఆర్సీబీ. ప్రారంభ సీజన్ లో లీగ్ స్టేజ్ కే పరిమితమైనా.. 2009 లో రన్నరప్ గా నిలిచింది. 2010లో ప్లేఆఫ్స్ కు చేరింది. మళ్లీ తర్వాత ఏడాదిలో రన్నరప్ గా నిలిచింది.  2016లో రన్నరప్ గా నిలిచిన ఆ జట్టు.. తర్వాత 3 సీజన్ల పాటు లీగ్ స్టేజ్ కే పరిమితమైంది. ఇక 2020, 2021 లో ప్లే ఆఫ్స్ కు చేరినా ఫైనల్ కు మాత్రం చేరలేదు. 

ప్రతి సీజన్ లో భారీ ఆశలతో  లీగ్ ను ప్రారంభించడం.. మెరుపులు మెరిపించి బెంగళూరుతో పాటు ఐపీఎల్ అభిమానులను అలరించడం.. తీరా కీలక మ్యాచుల్లో చేతులెత్తేయడం.. కన్నడ అభిమానులకు ప్రతి ఏడాది ఇదే తంతు.. ప్రతీసారి ‘ఈసాలా కప్ నమదే’ అనే నినాదాలతో  హోరెత్తించి  తర్వాత నిరాశతో వెనుదిరిగే  కథను కొత్త సారథి డుప్లెసిస్ ఎంతవరకు మార్చుతాడో వేచి చూడాలి. 

ఫుల్ షెడ్యూల్ : 

మార్చి 27 : ఆర్సీబీ  వర్సెస్  పీబీకేఎస్ - సాయంత్రం 7.30 గంటలకు - డీవై పాటిల్ స్టేడియం 
మార్చి 30 : ఆర్సీబీ  వర్సెస్ కేకేఆర్ -  సాయంత్రం 7.30 గంటలకు - డీవై పాటిల్  
ఏప్రిల్ 05 : ఆర్సీబీ  వర్సెస్ రాజస్థాన్ (ఆర్ఆర్)  - సాయంత్రం 7.30 గంటలకు - వాంఖెడే 
ఏప్రిల్ 09 : ఆర్సీబీ  వర్సెస్ ముంబై (ఎంఐ) - సాయంత్రం 7.30 గంటలకు - పూణె 
ఏప్రిల్ 12 : ఆర్సీబీ  వర్సెస్ సీఎస్కే - సాయంత్రం 7.30 గంటలకు - డీవై పాటిల్ 
ఏప్రిల్ 16 : ఆర్సీబీ  వర్సెస్  ఢిల్లీ (డీసీ) - సాయంత్రం 7.30 గంటలకు - వాంఖెడే  
ఏప్రిల్ 19 : ఆర్సీబీ  వర్సెస్ లక్నో (ఎల్ఎస్జీ) - సాయంత్రం 7.30 గంటలకు - డీవై పాటిల్  
ఏప్రిల్ 23 : ఆర్సీబీ  వర్సెస్ ఎస్ఆర్హెచ్ - సాయంత్రం 7.30 గంటలకు - బ్రబోర్న్ 
ఏప్రిల్ 26 : ఆర్సీబీ  వర్సెస్ ఆర్ఆర్ - సాయంత్రం 7.30 గంటలకు - పూణె 
ఏప్రిల్ 30 :  ఆర్సీబీ  వర్సెస్ జీటీ (గుజరాత్) - మధ్యాహ్నం  3.30 గంటలకు - బ్రబోర్న్  
మే 04 : ఆర్సీబీ  వర్సెస్ సీఎస్కే - సాయంత్రం 7.30 గంటలకు - పూణె 
మే 08 : ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హహెచ్ -  మధ్నాహ్నం 3.30 గంటలకు - వాంఖెడే 
మే 13 : ఆర్సీబీ వర్సెస్ పీబీకేఎస్ - సాయంత్రం 7.30 గంటలకు - బ్రబోర్న్ 
మే 19 : ఆర్సీబీ  వర్సెస్ జీటీ - సాయంత్రం 7.30 గంటలకు - వాంఖెడే 

 

ఆర్సీబీ రిటెన్షన్ ప్లేయర్లు : విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్వెల్, మహ్మద్ సిరాజ్ 

వేలంలో దక్కించుకున్న ఆటగాళ్లు : ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), హర్షల్ పటేల్, వనిందు హసరంగ, దినేశ్ కార్తీక్, జోష్ హెజిల్వుడ్, షాజాజ్ అహ్మద్, అనుజ్ రావత్, ఆకాశ్ దీప్, మహిపాల్ లోమోర్, ఫిన్  అలెన్, షెర్ఫెన్ రూథర్ఫర్డ్, జేసన్ బెహ్రండార్ఫ్, సుయశ్ ప్రభుద్దేశాయ్, చామ మిలింద్, అనీశ్వర్ గౌతమ్, కర్ణ్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, లువ్నిత్ సిసోడియా, డేవిడ్ విల్లే 

ఆర్సీబీ కోచింగ్ సిబ్బంది : 

- సంజయ్ బంగర్ : హెడ్ కోచ్ 
- మైక్ హెస్సెన్ : డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ 
- శ్రీధరన్ శ్రీరామ్ : బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్ కోచ్
- ఆడమ్ గ్రీఫిత్ : బౌలింగ్ కోచ్
- ఎం. రంగరాజన్ : హెడ్ ఆఫ్ స్కౌటింగ్ అండ్ ఫీల్డింగ్ కోచ్
- ఎవాన్ స్పీచ్లీ : టీమ్ ఫిజియో 
- నవీన్ గౌతమ్ : స్పోర్ట్స్ మేనేజర్ థెరపిస్ట్
- ప్రథమేశ్ మిశ్రా : చైర్మెన్, ఆర్సీబీ 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?