IPL 2022 DC vs MI: ఆఖర్లో అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ బాదుడు... ముంబైపై ఢిల్లీ ఘన విజయం...

Published : Mar 27, 2022, 07:20 PM ISTUpdated : Mar 27, 2022, 07:21 PM IST
IPL 2022 DC vs MI: ఆఖర్లో అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ బాదుడు... ముంబైపై ఢిల్లీ ఘన విజయం...

సారాంశం

10 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్... లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ అద్భుత ఇన్నింగ్స్‌లతో... 

చాలా సీజన్ల తర్వాత ఐపీఎల్‌ను విజయంతో ఆరంభించాలని చూసిన ముంబై ఇండియన్స్‌కి ఢిల్లీ లోయర్ ఆర్డర్ ఊహించని షాక్ ఇచ్చింది. 104 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి విజయంపై ఆశలు కోల్పోయిన ఢిల్లీ.. అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ ఇన్నింగ్స్‌ల కారణంగా 10 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో విజయం అందుకుంది... టిమ్ సిఫర్ట్ 14 బంతుల్లో 4 ఫోర్లతో 21 పరుగులు చేయడంతో దూకుడుగా ఇన్నింగ్స్‌ను మొదలెట్టింది ఢిల్లీ. అయితే సిఫర్ట్‌ను అవుట్ చేసిన మురుగన్ అశ్విన్, ఆ తర్వాత రెండు బంతులకే మన్‌దీప్ సింగ్‌ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు...

కెప్టెన్ రిషబ్ పంత్ 2 బంతుల్లో 1 పరుగు చేసి తైమల్ మిల్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసిన పృథ్వీషా... బాసిల్ తంపి బౌలింగ్‌లో అవుట్ కాగా రోవ్‌మన్ పావెల్ కూడా అతని బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు...

శార్దూల్ ఠాకూర్ 11 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేసి బాసిల్ తంపి బౌలింగ్‌లోనే అవుట్ కావడంతో 104 పరుగులకే  6 వికెట్లు కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. విజయంపై ఆశలు వదులకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ కలిసి బౌండరీలతో విరుచుకుపడి మ్యాచ్‌ను మలుపు తిప్పారు.. 

బుమ్రా వేసిన 16వ ఓవర్‌లో 15 పరుగులు రాగా, బాసిల్ తంపి వేసిన 17వ ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి. 22 బంతుల్లో విజయానికి 18 బంతుల్లో 28 పరుగులు కావాల్సిన దశలో డానియల్ సామ్స్ వేసిన 18వ ఓవర్‌లో ఏకంగా 24 పరుగులు రాబట్టారు అక్షర్ పటేల్, లలిత్ యాదవ్...  
 

లలిత్ యాదవ్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేయగా, అక్షర్ పటేల్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కి 75 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. 


అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 177 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ కలిసి శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 67 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు రోహిత్ శర్మ...

32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేసిన రోహిత్ శర్మ, కుల్దీప్ బౌలింగ్‌లో రోవ్‌మన్ పావెల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన అన్‌మోల్‌ప్రీత్ సింగ్ 9 బంతుల్లో 8 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో లలిత్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

టూ డౌన్‌లో వచ్చిన తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ 15 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసి ఓ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి... ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ముంబై ఇండియన్స్ విధ్వంసకర బ్యాటర్ కిరన్ పోలార్డ్ 6 బంతుల్లో 3 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్‌లోనే అవుట్ అయ్యాడు...

4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చిన కుల్దీప్ యాదవ్, 3 వికెట్లు పడగొట్టాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో వైపు దూకుడు కొనసాగించిన ముంబై ఇండియన్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్, ఐపీఎల్‌లో వరుసగా మూడో హాఫ్ సెంచరీ బాదాడు. గత సీజన్‌లో ఆడిన ఆఖరి రెండు మ్యాచుల్లో 50+ స్కోర్లు చేశాడు ఇషాన్ కిషన్...

ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ వికెట్ కీపర్ బ్యాటర్ హాఫ్ సెంచరీ చేయడం విశేషం. మొదటి మ్యాచ్‌లో సీఎస్‌కే మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎమ్మెస్ ధోనీ హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే...

టిమ్ డేవిడ్ 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 12 పరుగులు చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ కాగా... శార్దూల్ ఠాకూర్ వేసిన ఆఖరి ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 పరుగులు రాబట్టాడు ఇషాన్ కిషన్. 48 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 81 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు ఇషాన్ కిషన్. డానియల్ సామ్స్ 2 బంతుల్లో ఓ సిక్సర్‌తో 7 పరుగులు చేశాడు...

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?