IPL 2022: టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్... రాయల్స్‌కి అద్భుత అవకాశం...

By Chinthakindhi RamuFirst Published May 20, 2022, 7:07 PM IST
Highlights

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్... వచ్చే సీజన్‌లోనూ తానే కెప్టెన్‌గా ఉంటానంటూ ప్రకటించిన ఎమ్మెస్ ధోనీ... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, తన ఆఖరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలబడుతోంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ నేటి మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది.. ఓ మోస్తరు తేడాతో పోరాడి ఓడినా నెట్ రన్ రేట్ కారణంగా ప్లేఆఫ్స్ ఛాన్సులు సజీవంగానే ఉంటాయి.. నేటి మ్యాచ్‌లో ఓడితే చెన్నై సూపర్ కింగ్స్, సీజన్‌లో 10వ స్థానంలో ముగించే ప్రమాదం ఉంటుంది...

టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్‌ 2022 సీజన్ తర్వాత ఫ్రాంఛైజీ క్రికెట్ నుంచి కూడా రిటైర్మెంట్ పలకబోతున్నాడని ప్రచారం జరిగినా, వచ్చే సీజన్‌లో ఆడడానికి కృషి చేస్తానంటూ కామెంట్లు చేశాడు ధోనీ... 

ఏది ఏమైనా తన ఆఖరి ఐపీఎల్ మ్యాచ్‌ చెన్నైలోనే ఆడుతానంటూ స్పష్టం చేశాడు మాహీ. దీంతో ధోనీ ఫ్యాన్స్ ఫుల్లు ఖుషీ అవుతున్నారు. అలాగే గాయం కారణంగా జట్టుకి దూరమైన రవీంద్ర జడేజా, వచ్చే సీజన్‌లో సీఎస్‌కే తరుపున ఆడతాడని కూడా ఖరారు చేశాడు ధోనీ...

2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు ఎమ్మెస్ ధోనీ. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడని మాహీ, ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు... 2020 సీజన్ సమయంలోనే ఎమ్మెస్ ధోనీతో కలిసి ఫోటోలు దిగడానికి యంగ్ క్రికెటర్లు పోటీపడ్డారు... పాండ్యా బ్రదర్స్ కూడా మాహీ ఎల్లో జెర్సీపై ఆటోగ్రాఫ్స్ తీసుకోవడంతో అనుమానాలు రేగాయి...

అయితే 2020 సీజన్‌ని ఏడో స్థానంలో ముగించిన చెన్నై సూపర్ కింగ్స్, ఆఖరి లీగ్ మ్యాచ్‌ సమయంలో రిటైర్మెంట్ ఆలోచన లేదని ‘Definately Not’ అంటూ కామెంట్లు చేశాడు ఎమ్మెస్ ధోనీ... 2021 సీజన్‌లో టైటిల్ గెలిచి కమ్‌బ్యాక్ ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్, 2022 సీజన్‌లో మరోసారి ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. సీజన్‌ని 9వ స్థానంలో ముగించే ప్రమాదంలో ఉన్న సీఎస్‌కే, నేడు రాజస్థాన్ రాయల్స్‌తో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడుతోంది...

పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్, నేటి మ్యాచ్‌ గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధిస్తుంది. ఓడినా నెట్ రన్ రేట్ కారణంగా ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా నిలుపుకోగలుగుతంది...  

రాజస్థాన్ రాయల్స్ జట్టు: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, దేవ్‌దత్ పడిక్కల్, సిమ్రాన్ హెట్మయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్డ్, ప్రసిద్ధ్ కృష్ణ, యజ్వేంద్ర చాహాల్, ఓబెడ్ మెక్‌కాయ్

చెన్నై సూపర్ కింగ్స్:  రుతురాజ్ గైక్వాడ్, డివాన్ కాన్వే, మొయిన్ ఆలీ, అంబటి రాయుడు, ఎన్ జగదీశన్, ఎమ్మెస్ ధోనీ, మిచెల్ సాంట్నర్, ప్రశాంత్ సోలంకి, సిమర్‌జీత్ సింగ్, మత్తీశ పతిరన, ముకేశ్ చౌదరి

click me!