IPL: ఢిల్లీకి ఈసారైనా ట్రోఫీ అందేనా? ఉరకలెత్తుతున్న యువరక్తం.. పాంటింగ్ పర్యవేక్షణలో పోరు.. మ్యాచుల తేదీలివే

Published : Mar 24, 2022, 04:50 PM IST
IPL: ఢిల్లీకి ఈసారైనా ట్రోఫీ అందేనా? ఉరకలెత్తుతున్న యువరక్తం..  పాంటింగ్ పర్యవేక్షణలో పోరు.. మ్యాచుల తేదీలివే

సారాంశం

Delhi Capitals Full Schedule 2022: ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ మెగా సీజన్ లో కప్పు కొట్టే సామర్థ్యం ఉన్న జట్లలో ఢిల్లీ  క్యాపిటల్స్ కూడా ఒకటి.  ఐపీఎల్ లో ఇంతవరకు ట్రోఫీ కొట్టని అపప్రదను తొలగించుకోవడానికి గత మూడు సీజన్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఆ జట్టు ఈసారి  ఆ దిశగా అడుగులేస్తోంది. 

ఐపీఎల్ లో ఇంతవరకు ట్రోఫీ నెగ్గని జట్టుగా అపప్రద మూటగట్టుకున్న ఢిల్లీ  క్యాపిటల్స్  ఈసారి పక్కా ప్రణాళికతో  బరిలోకి దిగుతున్నది.  రిషభ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు.. రికీ పాంటింగ్ పర్యవేక్షణలో యువ రక్తంతో  ఉరకలెత్తుతున్నది. 2020 సీజన్ లో ట్రోఫీ కలను నెరవేర్చుకోవడానికి ఆఖరి మెట్టు వరకు వచ్చిన ఢిల్లీ.. అక్కడ ముంబై ఇండియన్స్ చేతిలో బోల్తా కొట్టింది. ఇక గత సీజన్ లో కూడా  విజయవంతంగా ప్లే ఆఫ్స్ చేరినా ఫైనల్ కు మాత్రం చేరలేదు. అయితే ఈ సీజన్ లో మాత్రం కచ్చితంగా తమ ముద్ర వేయాలని అనుకుంటున్నది. 

రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా ఆ జట్టు రిషభ్ పంత్, పృథ్వీ షా, అక్షర్ పటేల్, అన్రిచ్ నోర్త్జ్ లను రిటైన్ చేసుకోగా వేలం ప్రక్రియలో డేవిడ్ వార్నర్, శార్దూల్ ఠాకూర్, మిచ్  మార్ష్, యశ్ ధుల్ వంటి ప్రతిభావంతులను దక్కించుకుంది. 

ఐపీఎల్ లో  ఆరు సార్లు ప్లే ఆఫ్స్ కు చేరిన ఢిల్లీ.. ఎనిమిది సీజన్లు లీగ్ స్టేజ్ కే పరిమితమైంది. 2020 లో రన్నరప్ గా నిలిచింది. ఇక ఐపీఎల్-2022 లో  ఈనెల 27న ముంబై ఇండియన్స్ తో తలపడబోతున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు సంబంధించిన మొత్తం షెడ్యూల్ ను ఇక్కడ చూద్దాం. 

ఫుల్ షెడ్యూల్ : 

మార్చి 27 : డీసీ వర్సెస్ ముంబై (ఎంఐ) - మధ్యాహ్నం 3.30 గంటలకు - బ్రబోర్న్ 
ఏప్రిల్ 02 : డీసీ వర్సెస్ గుజరాత్ (జీటీ) - సాయంత్రం 7.30 గంటలకు - పూణె
ఏప్రిల్ 07 : డీసీ వర్సెస్ లక్నో (ఎల్ఎస్జీ) - సాయంత్రం 7.30 గంటలకు - డీవై పాటిల్ 
ఏప్రిల్ 10: డీసీ వర్సెస్ కేకేఆర్ - సాయంత్రం 7.30 గంటలకు - బ్రబోర్న్ 
ఏప్రిల్ 16 : డీసీ వర్సెస్ ఆర్సీబీ - సాయంత్రం 7.30 గంటలకు - వాంఖెడే 
ఏప్రిల్ 20 : డీసీ వర్సెస్ పీబీకేఎస్ - సాయంత్రం 7.30 గంటలకు - పూణె 
ఏప్రిల్ 22 : ఆర్ఆర్ వర్సెస్ డీసీ - సాయంత్రం 7.30 గంటలకు - పూణె 
ఏప్రిల్ 28 : డీసీ వర్సెస్ కేకేఆర్ - సాయంత్రం 7.30 గంటలకు - వాంఖెడే   
మే 01 : డీసీ వర్సెస్ ఎల్ఎస్జీ - మధ్యాహ్నం 3.30 గంటలకు - వాంఖెడే
మే 05 : డీసీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ - సాయంత్రం 7.30 గంటలకు - బ్రబోర్న్ 
మే 08 : డీసీ వర్సెస్ సీఎస్కే - సాయంత్రం 7.30 గంటలకు - డీవై పాటిల్
మే 11 : డీసీ వర్సెస్ రాజస్థాన్ - సాయంత్రం 7.30 గంటలకు - డీవై పాటిల్ 
మే 16 : డీసీ వర్సెస్ పీబీకేఎస్ -  సాయంత్రం 7.30 గంటలకు - డీవై పాటిల్ 
మే 21 : డీసీ వర్సెస్ ఎంఐ - సాయంత్రం 7.30 గంటలకు - వాంఖెడే 

 

రిటెన్షన్ ప్లేయర్లు : రిషభ్ పంత్, ప‌ృథ్వీ షా, అన్రిచ్ నోర్త్జ్, అక్షర్ పటేల్ 

వేలంలో దక్కించుకున్న ఆటగాళ్లు :  డేవిడ్ వార్నర్, మిచ్ మార్ష్, శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, కుల్దీప్ యాదవ్, అశ్విన్ హెబ్బర్, కమలేశ్ నాగర్కోటి,  కెఎస్ భరత్, సర్ఫరాజ్ ఖాన్, మన్దీప్ సింగ్, సయీద్ ఖలీల్, చేతన్ సకారియా, లలిత్ యాదవ్, రైపాల్ పటేల్, యశ్ ధుల్, రోమన్ పావెల్, ప్రవీణ్ దూబే, లుంగి ఎంగిడి, టిమ్ సీఫర్ట్, విక్కీ ఓస్త్వల్ 

ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ సిబ్బంది.. 

- రికీ పాంటింగ్ : హెడ్ కోచ్
- షేన్ వాట్సన్ : అసిస్టెంట్ కోచ్
- అజిత్ అగార్కర్ : అసిస్టెంట్ కోచ్
- ప్రవీణ్ ఆమ్రే : అసిస్టెంట్ కోచ్
- జేమ్స్ హోప్స్ : ఫాస్ట్ బౌలింగ్ కోచ్
- దనంజయ కౌశిక్ : అసిస్టెంట్  ఫిజియో 
- పాట్రిక్ ఫర్హత్ : ఫిజియో 
- శ్రీరామ్ సోమయాజుల : టీమ్ అనలిస్టు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?