IPL 2022: అలాంటి క్రికెటర్ ని ఎందుకు సెలక్ట్ చేసుకోలేదు.. మైఖేల్ వాన్ ప్రశ్నలు..!

Published : Feb 14, 2022, 12:22 PM IST
IPL 2022: అలాంటి క్రికెటర్ ని  ఎందుకు సెలక్ట్ చేసుకోలేదు.. మైఖేల్ వాన్ ప్రశ్నలు..!

సారాంశం

రషీద్ గత ఏడాది పంజాబ్ కింగ్స్ (PBKS) తరపున IPL అరంగేట్రం చేసాడు. కానీ.. ఈ ఏడాది మాత్రం అతనిని జట్టు ఉంచుకోలేదు. మళ్లీ వేలానికి వదిలేసింది.

IPLమెగా వేలం కొనసాగుతోంది. శనివారం ఈ వేలం ప్రారంభమైంది. అయితే.. మొదటి రోజు వేలంలో.. చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. కొన్ని ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను భారీ మొత్తానికి కొనుగోలు చేయగా.. మరి కొంత మంది స్టార్ క్రికెటర్లను అసలు ఫ్రాంఛైజీలు పట్టించుకోకపోవడం గమనార్హం.

ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ఖాన్ మొదటి రోజు వేలంలో అమ్ముడుకాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయంపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ ప్రశ్నల వర్షం కురిపించాడు.  ఐపీఎల్ లో రషీద్ ని ఎందుకు సెలక్ట్ చేసుకోలేదని ఆయన ప్రశ్నించారు. రషీద్ చాలా టాలెంటెడ్ క్రికెటర్ అని.. టీ20 ల్లో అతి పెద్ద గేమ్ ఛేంజర్ అయిన రషీద్ ని ఎందుకు సెలక్ట్ చేయలేదో తనకు అర్థం కావడం లేదన్నారు. మంచి ఆటగాళ్లకు ఎక్కువ ధర ఎందుకు పలకడం లేదో తనకు తెలియడం లేదన్నారు.

రషీద్ గత ఏడాది పంజాబ్ కింగ్స్ (PBKS) తరపున IPL అరంగేట్రం చేసాడు. కానీ.. ఈ ఏడాది మాత్రం అతనిని జట్టు ఉంచుకోలేదు. మళ్లీ వేలానికి వదిలేసింది.

33 ఏళ్ల రషీద్  IPL 2021లో  పంజాబ్ కింగ్స్ ని ఏమాత్రం సంతృప్తి పరచలేదు. ఆయన ఆట ఆ జట్టు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అందుకే.. అతనిని పంజాబ్ జట్టు మళ్లీ వేలంలోకి వదిలిపెట్టింది. సీజన్ మొత్తంలొ ఒకే ఒక్కసారి బాగా ఆడటం గమనార్హం. 

ఇక గతేడాది సీజన్ లో పంజాబ్ జట్టు కనీసం ప్లే ఆఫ్ అర్హత కూడా సాధించలేదు. లీగ్ స్టాండింగ్స్‌లో 14 గేమ్‌లలో 12 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. ఫ్రాంచైజీ ఆరు మ్యాచ్‌లు గెలిచింది. ఎనిమిది మ్యాచ్‌లలో ఓడిపోయింది.

ఇదిలా ఉండగా.. ఈ ఏడాది మెగా ఐపీఎల్ వేలంలో  ఇషాన్ కిషన్ ఎక్కువ ధర పలకడం గమనార్హం. కాగా ఫిబ్రవరి 12న బెంగళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌ మెగా వేలం-2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌ ఇషాన్‌ కిషన్‌ను సొంతం చేసుకుంది. రిటెన్షన్‌లో అతడిని వదిలేసిన ముంబై వేలంలో 15.25 కోట్ల భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేయడం విశేషం. కాగా ఇషాన్‌ కనీస ధర 2 కోట్లు కాగా ముంబై, హైదరాబాద్‌ పోటీ పడ్డాయి.

ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసిన ఇషాన్‌ కిషన్‌... ‘‘అందరికి నమస్కారం. ముంబై ఇండియన్స్‌తో మళ్లీ చేరడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. జట్టులోని ప్రతి ఒక్కరు నన్ను తమ కుటుంబ సభ్యుడిలా భావిస్తారు. నిజంగా నా జట్టుతో తిరిగి కలవడం ఎంతో ఎంతో ఆనందంగా ఉంది’’ అంటూ ఉత్సాహంగా మాట్లాడాడు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

5 Wickets in 1 Over : W, W, W, W, W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ కొత్త చరిత్ర
Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !