IPL2022: జాక్ పాట్ కొట్టేసిన సింగపూర్ ఆటగాడు..!

Published : Feb 14, 2022, 10:23 AM ISTUpdated : Feb 14, 2022, 10:43 AM IST
IPL2022: జాక్ పాట్ కొట్టేసిన సింగపూర్ ఆటగాడు..!

సారాంశం

రూ. 40 ల‌క్ష‌ల క‌నీస ధ‌రతో వేలంలోకి వ‌చ్చిన టిమ్ డేవిడ్ కోసం బెంగ‌ళూరు, ముంబై ఇండియ‌న్స్,ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి. చివ‌ర‌కు ముంబై సొంతం చేసుకుంది. 

IPL 2022 వేలం పాట జోరుగా సాగింది. ఆటగాళ్లను  రూ.కోట్లు పోసి మరీ ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. కాగా.. ఈ వేలంలో  సింగపూర్ ఆటగాడు టిమ్ డేవిడ్ కు వేలంలో జాక్ పాట్ తగిలింది. ఐపీఎల్‌-2022 మెగా వేలంలో డేవిడ్‌ను ముంబై ఇండియన్స్ రూ. 8 కోట్ల‌కు కొనుగోలు చేసింది. 

రూ. 40 ల‌క్ష‌ల క‌నీస ధ‌రతో వేలంలోకి వ‌చ్చిన టిమ్ డేవిడ్ కోసం బెంగ‌ళూరు, ముంబై ఇండియ‌న్స్,ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి. చివ‌ర‌కు ముంబై సొంతం చేసుకుంది. కాగా  గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు టిమ్ డేవిడ్ ప్రాతినిథ్యం వ‌హించాడు.

అయితే ఆ సీజ‌న్‌లో ఒకే ఒక మ్యాచ్‌లో ఆడే అవకాశం లభించింది. అందులో కేవంల 1 ప‌రుగు మాత్ర‌మే తీవ్రంగా నిరాశ‌ప‌రిచాడు. ఆ త‌రువాత అత‌డికి బెంగ‌ళూరు మ‌రి అవ‌కాశం ఇవ్వ‌లేదు. దీంతో మెగా వేలంలో త‌న  పేరును డేవిడ్ రిజిస్ట‌ర్ చేసుకున్నాడు.  హిట్టింగ్ స్కిల్స్ ఉన్న డేవిడ్‌ను ముంబై పోటీ ప‌డి మ‌రి ద‌క్కించుకుంది. బిగ్ బాష్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, టీ20 బ్లాస్ట్, ది హండ్రెడ్ వంటి టోర్నమెంట్‌లలో టిమ్ డేవిడ్ అద్భుతంగా రాణించాడు. డేవిడ్ ప్ర‌స్తుతం పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌లో అడుతున్నాడు.

PREV
click me!

Recommended Stories

5 Wickets in 1 Over : W, W, W, W, W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ కొత్త చరిత్ర
Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !