IPL 2022: రూ.7.75 కోట్లతో సన్ రైజర్స్ దక్కించుకున్న క్రికెటర్ ఎవరు..?

Published : Feb 14, 2022, 11:13 AM IST
IPL 2022: రూ.7.75 కోట్లతో సన్ రైజర్స్ దక్కించుకున్న క్రికెటర్  ఎవరు..?

సారాంశం

వేలంలో రూ.75 ల‌క్ష‌ల బెస్ ప్రైస్‌తో వ‌చ్చిన షెపర్డ్ కోసం ల‌క్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్,  రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ పోటీ ప‌డ్డాయి.  

ఐపీఎల్ మెగా వేలం చాలా జోరుగా సాగుతోంది. ఈ వేలంలో.. ఫ్రాంఛైజీలు పోటీలు పడి మరీ క్రికెటర్లను కొనుగోలు చేస్తున్నాయి.  ముఖ్యంగా ఈ వేంలో వెస్టిండీస్ క్రికెటర్లు ఎక్కువ ధర పలుకున్నారు.  కాగా.. ఈ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. భారీ ధరకు ఓ క్రికెటర్ ని దక్కించుకుంది.

 ఓడియన్ స్మిత్‌ను పంజాబ్ కొనుగోలు చేయ‌గా, మ‌రో ఆల్ రౌండ‌ర్  రొమారియో షెపర్డ్‌ను రూ. 7.75 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ద‌క్కించుకుంది. వేలంలో రూ.75 ల‌క్ష‌ల బెస్ ప్రైస్‌తో వ‌చ్చిన షెపర్డ్ కోసం ల‌క్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్,  రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ పోటీ ప‌డ్డాయి.

చివ‌ర‌కు హైదరాబాద్ కైవ‌సం చేసుకుంది. షెప‌ర్డ్ 2019 లో వెస్టిండీస్ త‌రుపున అరంగేట్రం చేశాడు. ఇప్ప‌టివ‌ర‌కు 10 మ్యాచ్‌లు,14 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. కాగా గ‌త కొద్ది కాలంగా టీ20 ల్లో బ్యాట్‌తో, బాల్‌తో షెపర్డ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. టీ20ల్లో 44 మ్యాచ్‌లు ఆడిన షెపర్డ్ 53 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అదే విధంగా ఇంగ్లండ్‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌లోనూ షెపర్డ్ రాణించాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

5 Wickets in 1 Over : W, W, W, W, W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ కొత్త చరిత్ర
Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !