కప్పు గెలవడం ముఖ్యం.. ఫస్ట్ మ్యాచ్ కాదు.. రోహిత్ శర్మ పంచ్

By telugu news teamFirst Published Apr 10, 2021, 9:41 AM IST
Highlights

ఛాంపియన్ షిప్  గెలవడం ముఖ్యమని.. తొలి మ్యాచ్ గెలవడం కాదంటూ రోహిత్ శర్మ పేర్కొనడం గమనార్హం. 

14వ సీజన్ ఐపీఎల్ సందడి మొదలైంది. శుక్రవారం తొలిరోజు ముంబయి, బెంగళూరు జట్లు తలపడ్డాయి. చివరి బంతి వరకు ఆడిన బెంగళూరు జట్టు రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి మ్యాచ్ ఓడిపోవడం పై ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు.

ఛాంపియన్ షిప్  గెలవడం ముఖ్యమని.. తొలి మ్యాచ్ గెలవడం కాదంటూ రోహిత్ శర్మ పేర్కొనడం గమనార్హం. ‘‘"ఛాంపియన్‌షిప్ గెలవడం చాలా ముఖ్యం, మొదటి ఆట గెలవడం కాదని నేను భావిస్తున్నాను. అయితే నిన్న మ్యాచ్ లో తాము గోప్పగా పోరాడము. అంత తేలికగా మ్యాచ్ వదిలేయలేదు. స్కోర్ విషయంలో సంతోషంగా లేకపోయినప్పటికీ.. గట్టిగానే పోరాడమని భావిస్తున్నాను’’ అంటూ రోహిత్ మ్యాచ్ ఓటమి తర్వాత పేర్కొన్నారు. 

తాము కొన్ని తప్పులు చేశామని.. అయితే.. ఇప్పుడు మ్యాచ్ ఓడిపోయాం కాబట్టి.. దాని నుంచి బయటపడాలని.. దాని గురించే ఆలోచిస్తూ కూర్చోలేమని రోహిత్ పేర్కొన్నాడు. అయితే.. ముంబయి ఇండియన్స్ ట్రోఫీ గెలిచిన సమయంలోనూ.. తొలి మ్యాచ్ ఓడిపోతూ రావడం గమనార్హం. దీంతో.. ఆనవాయితీ ప్రకారమే ముంబయి తొలి మ్యాచ్ ఓడిపోయిందని అభిమానులు పేర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా... ఐపీఎల్ 2021 తొలి మ్యాచ్‌లోనే హర్షల్ పటేల్ 5 వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ చెలరేగడంతో ముంబై భారీ స్కోర్ చేయలేకపోయింది.

click me!