IPL2021: మారేది జెర్సీనే.. ఆ షాట్ కాదు..! ఒంటిచేత్తో సిక్స్ కొట్టడంలో పంత్ ను మించినోడు లేడు

Published : Oct 11, 2021, 12:00 PM ISTUpdated : Oct 11, 2021, 12:04 PM IST
IPL2021: మారేది జెర్సీనే.. ఆ షాట్ కాదు..! ఒంటిచేత్తో సిక్స్ కొట్టడంలో పంత్ ను మించినోడు లేడు

సారాంశం

Rishabh Pant: దూకుడుగా ఆడటంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ శైలే వేరు. టెస్టు క్రికెట్ అయినా టీ20 లు అయినా సింగిల్ హ్యాండ్ తో సిక్సర్లు కొట్టడంలో పంత్ ఆరితేరాడు. నిన్న చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా పంత్.. తన ట్రేడ్ మార్క్  ఒంటి చేతి సిక్సర్ ను ప్రేక్షకుల్లోకి పంపాడు. 

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్, భావి భారత కెప్టెన్ గా భావిస్తున్న భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్  ది సిక్సర్లు కొట్టడంలో ప్రత్యేక శైలి. ముందు నెమ్మదిగా ఆడుతూ తర్వాత దూకుడు పెంచే పంత్.. చెలరేగి ఆడితే మాత్రం విధ్వంసమే. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఈ ఉత్తరాఖండ్ కుర్రాడు ముందు ఆచితూచి ఆడి తర్వాత బ్యాట్ ఝుళిపించాడు. 35 బంతులాడిన పంత్.. 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసి ఢిల్లీ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 

 

హెట్మెయర్ తో కలిసి  ఆఖర్లో ధనాధన్ ఇన్నింగ్స్  ఆడి చెన్నై ఎదుట భారీ స్కోరు ఉండేలా ఆడాడు. అయితే 16వ ఓవర్లో శార్దుల్ ఠాకూర్ వేసిన ఫుల్ టాస్ బంతిని ఒంటిచేత్తో సిక్సర్ గా మలిచాడు పంత్. శార్దుల్ వేసిన టాస్ బాల్ ను.. తన బలాన్నంతా ఉపయోగించి సింగిల్ హ్యాండ్ తో   ఆ బంతిని మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ గా మలిచాడు.

 

అంతేగాక ఆ తర్వాత ఓవర్లో కూడా డ్వేన్ బ్రావో వేసిన ఫుల్ డెలివరీని  అతడి తల మీదుగా సిక్సర్ కొట్టాడు. ఇది కూడా సింగిల్ హ్యాండ్ తో ఆడిన షాటే.ఈ రెండు షాట్లతో పాటు పంత్ ఇప్పటిదాకా కొట్టిన సింగిల్ హ్యాండ్ సిక్సర్ లను అభిమానులు ట్విట్టర్ లో పోస్టు చేస్తున్నారు. 


అది టెస్టు క్రికెట్ అయినా..  వన్డే అయినా.. టీ20 అయినా.. ఐపీఎల్ అయినా.. ఒంటి చేతి సిక్సర్లు కొట్టడంలో పంత్ స్టైలే వేరు అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 

 

కాగా,  ఉత్కంఠగా సాగిన నిన్నటి మ్యాచ్ లో చెన్నై అద్భుత పోరాట పటిమతో విజయం సాధించింది. ఆ జట్టు కెప్టెన్ మరోసారి తనలోని పాత ఫినిషర్ ను గుర్తు చేస్తూ  ఆఖర్లో విజృంభించడంతో సీఎస్కే ఫైనల్స్ కు దూసుకెళ్లింది.

 

PREV
click me!

Recommended Stories

ఐపీఎల్ ముద్దు.. హనీమూన్ వద్దు.. నమ్మకద్రోహం చేసిన ఆసీస్ ప్లేయర్.. పెద్ద రచ్చ జరిగేలా ఉందిగా
విదేశీ లీగ్‌ల్లో ఆడనున్న రో-కో.. ఐపీఎల్ చైర్మన్ ఏమన్నారంటే.?