IPL 2021: చెన్నై గెలిచినా.. రైనా ని మిస్ అయిన అభిమానులు..!

Published : Oct 11, 2021, 10:28 AM IST
IPL 2021:  చెన్నై గెలిచినా.. రైనా ని మిస్ అయిన అభిమానులు..!

సారాంశం

ముఖ్యంగా మ్యాచ్ చివర్లో ధోనీ ఇచ్చిన ఫినిషింగ్ టచ్.. అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. అయితే.. ఓ విషయం మాత్రం చెన్నై అభిమానులను తీవ్రంగా కలచివేసింది.  

ఐపీఎల్-14 సీజన్‌ భాగంగా జరిగిన తొలి క్వాలిఫయర్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయం సాధించింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన ధోనీ సేన ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఢిల్లీ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

చెన్నై విజయం సాధించడం పట్ల ధోనీ అభిమానులంతా ఆనందంతో ఎగిరి గంతులు వేస్తున్నారు. ముఖ్యంగా మ్యాచ్ చివర్లో ధోనీ ఇచ్చిన ఫినిషింగ్ టచ్.. అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. అయితే.. ఓ విషయం మాత్రం చెన్నై అభిమానులను తీవ్రంగా కలచివేసింది.

 

చెన్నై సూపర్ కింగ్స్‌లో సురేష్ రైనా లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. టాస్ జరిగిన కొన్ని సెకన్లలోనే ‘No Raina’ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా వి మిస్ రైనా అంటూ అభిమానులు నెట్టింట కామెంట్స్ వర్షం కురిపించడం గమనార్హం.

ఐపీఎల్ ప్లేఆప్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా సురేష్ రైనా టాప్‌లో ఉన్నాడు. ప్లేఆఫ్స్‌లో రైనా 714 పరుగులు చేయగా, ఎమ్మెస్ ధోనీ 504 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. అలాంటి రైనాని ముఖ్యమైన మ్యాచ్ కి దూరం పెట్టడం అభిమానులకు రుచించడం లేదు. చెన్నై ఫాంఛైజీపై విమర్శలు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: గిల్ అవుట్.. శాంసన్ ఇన్.. వచ్చీ రాగానే రికార్డుల మోత, కానీ అంతలోనే..
ఐపీఎల్ ముద్దు.. హనీమూన్ వద్దు.. నమ్మకద్రోహం చేసిన ఆసీస్ ప్లేయర్.. పెద్ద రచ్చ జరిగేలా ఉందిగా