Varun Chakravarthy: మిస్టరీ స్పిన్నర్ కు గాయం.. టీ20 ప్రపంచకప్ కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ షాక్

Published : Oct 06, 2021, 06:13 PM IST
Varun Chakravarthy: మిస్టరీ స్పిన్నర్ కు గాయం.. టీ20 ప్రపంచకప్ కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ షాక్

సారాంశం

IPL 2021: ఇప్పటికే ఆల్ రౌండర్ హార్ధిక్  పాండ్యా ఫిట్నెస్ గురించి రోజుకో మాట వినిపిస్తున్న తరుణంలో అతడి ఎంపికపైనే  ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా వరుణ్ కూడా గాయాల బారిన పడటం బీసీసీఐకి తలనొప్పిగా మారింది.  

మరికొద్దిరోజుల్లో యూఏఈ వేదికగా మొదలుకాబోయే T20 WorldCup కోసం భారత జట్టు సన్నద్ధమవుతుండగా మరోవైపు గాయాల బెడద జట్టును తీవ్రంగా వేధిస్తున్నది. ఇప్పటికే ఆల్ రౌండర్ Hardik pandya ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతుంటే తాజాగా మరో ఆటగాడు గాయాల బారీన పడ్డాడు. IPLలో Kolkata knight Riders తరఫున ఆడుతున్న వరుణ్ చక్రవర్తికి గాయమైనట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 

మిస్టరీ స్పిన్నర్ గా గుర్తింపు పొందిన Varun Chakravarthy మెగా టోర్నీ ఆడటం అనుమానంగానే ఉందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. వరుణ్.. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నట్టు  సమాచారం. పెయిన్ కిల్లర్ లు లేకుండా అతడు బరిలోకి దిగడం దాదాపు అసాధ్యంగా మారింది. దీంతో టీ20 ప్రపంచకప్ కు అతడు ఆడుతాడా..? లేదా..? అనేది సందేహంగానే మారింది. 

ఇప్పటికే ఆల్ రౌండర్ హార్ధిక్  పాండ్యా ఫిట్నెస్ గురించి రోజుకో మాట వినిపిస్తున్న తరుణంలో అతడి ఎంపికపైనే  ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాండ్యా బౌలింగ్ చేయడం కష్టమని ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ కూడా చెప్పాడు. గత నాలుగు మ్యాచ్ లలోనూ పాండ్యా బాల్ ముట్టలేదు. ఇక తాజాగా వరుణ్ కూడా గాయాల బారిన పడటం బీసీసీఐకి తలనొప్పిగా మారింది.  

టీ20 వరల్డ్ కప్ కోసం తుది జట్టులో మార్పులు చేసుకునేందుకు అక్టోబర్ 10 వరకు అవకాశం ఉంది. అయితే వరుణ్ ఆరోగ్య పరిస్థితి పై సమగ్ర నివేదిక ఇవ్వవలసిందిగా BCCI.. కోల్కతా యాజమాన్యాన్ని కోరింది.   అది అందిన తర్వాత  వరుణ్ పై  నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బోర్డు వర్గాలు తెలిపాయి. ఐపీఎల్ 14 సీజన్ లో 13 మ్యాచ్ లు ఆడిన వరుణ్.. 15 వికెట్లు తీశాడు. ఒకవేళ వరుణ్ గనుక  పొట్టి ప్రపంచకప్ కు దూరమైతే అతడి స్థానంలో ఎవర్ని తీసుకుంటారనేది కూడా ఆసక్తికరంగా మారింది. 

భారత టీ 20 ప్రపంచకప్ జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాంత్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ , చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ. రిజర్వ్ ప్లేయర్స్: శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్.

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే