IPL2021: కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఉత్కంఠ విజయం... ప్లేఆఫ్స్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్...

By Chinthakindhi RamuFirst Published Oct 1, 2021, 11:37 PM IST
Highlights

67 పరుగులు చేసి, ఆరెంజ్ క్యాప్ రేసులో ముందుకు దూసుకొచ్చిన కెఎల్ రాహుల్... 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న పంజాబ్ కింగ్స్...

ఐపీఎల్ 2021 సీజన్‌లో ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయాన్ని అందుకుంది... 166 పరుగుల టార్గెట్‌ను వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఈ విజయంతో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య ప్లేఆఫ్ బెర్త్ కోసం పోటీ ఇంకా కొనసాగనుంది... రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించినట్టైంది...

భారీ లక్ష్యఛేదనలో ఓపెనర్లు శుభారంభం అందించారు. సున్నా వద్ద మోర్గాన్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్‌తో కలిసి తొలి వికెట్‌కి 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఇయాన్ మోర్గాన్ పట్టిన అద్భుత క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు...
ఆ తర్వాత నికోలస్ పూరన్ 7 బంతుల్లో ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు.

16 బంతుల్లో ఓ సిక్స్‌తో 18 పరుగులు చేసిన మార్క్‌రమ్, సునీల్ నరైన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.. ఆ తర్వాత దీపక్ హుడా 4 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచినా యంగ్ హిట్టర్ షారుక్ ఖాన్ వస్తూనే కేకేఆర్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.

ఆ తర్వాత శివమ్ మావి బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠి క్యాచ్ అందుకున్నా, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు... ఐదు బంతుల్లో 4 పరుగులు కావాల్సిన దశలో భారీ షాట్‌కి ప్రయత్నించిన కెఎల్ రాహుల్... 55 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 67 పరుగులు చేసి అవుట్ అయ్యాడు... ఆ తర్వాతి బంతికి సిక్సర్ బాదిన షారుక్ ఖాన్ మ్యాచ్‌ని ఫినిష్ చేశాడు... 9 బంతుల్లో ఓ ఫోర్, రెండు సిక్సర్లతో 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు షారుక్ ఖాన్...
 

click me!