IPL 2021 MI vs DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. కీలక పోరులో ముంబై రాణించేనా..?

Published : Oct 02, 2021, 03:17 PM ISTUpdated : Oct 02, 2021, 03:19 PM IST
IPL 2021 MI vs DC:  టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. కీలక  పోరులో  ముంబై రాణించేనా..?

సారాంశం

IPL 2021 MI vs DC Live Updates: కీలక పోరులో ముంబై ఇండియన్స్ (Mumbai indians) జట్టు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగనుంది.  షార్జా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi capitals) జరుగుతున్న ఈ కీలకపోరులో విజయం సాధిస్తేనే రోహిత్ శర్మ (rohit sharma) సారథ్యంలోని ముంబై టీమ్ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంటుంది. 

ఐపీఎల్ 5 సార్లు విజేత, చివరిసారి డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్  కీలక పోరుకు రంగం సిద్ధమైంది. షార్జా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతున్న ఆ జట్టు.. ఈ మ్యాచ్ తో పాటు మిగిలిన రెండు మ్యాచ్ లు కూడా గెలిస్తేనే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. ఇక గత మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్.. నేటి ఆటలో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నది. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది.

కాగా, నేటి కీలక మ్యాచ్ కోసం ఇరు జట్టు ఒక మార్పు చేశాయి. బౌలర్ రాహుల్ చాహర్ స్థానంలో ముంబై జయంత్ యాదవ్ కు తుది జట్టులో అవకాశం కల్పించింది. మరోవైపు లలిత్ యాదవ్ స్థానంలో  పృథ్వి షా ఢిల్లీ జట్టులోకి వచ్చాడు. కాగా, గత నాలుగు మ్యాచ్ లలో విఫలమవుతున్న ముంబై మిడిలార్డర్ బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్ నేటి పోరులోనైనా  విజృంభించాలని ముంబై కోరుకుంటున్నది.  గత మ్యాచ్ లో పాండ్యా ఫామ్ లోకి వచ్చినా అతడు ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. 

ఢిల్లీ తరఫున ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ధావన్  దూసుకుపోతుండటం.. శ్రేయస్, పంత్ మంచి ఫామ్ లో ఉండటంతో పాటు నేటి మ్యాచ్ కు పృథ్వి షా కూడా బరిలోకి దిగుతుండటంతో ఆ జట్టుబ్యాటింగ్ బలం పెరిగింది. ఇప్పటివరకు 11 మ్యాచ్ లు ఆడి ఎనిమిదింటిలో నెగ్గి 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో  ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో ఉండగా.. అంతే మ్యాచ్ లు ఆడి 10 పాయింట్లతో ముంబై ఇండియన్స్ ఆరో స్థానంలో ఉంది. 

జట్లు:
ముంబై ఇండియన్స్:  రోహిత్ శర్మ (కెప్టెన్), డికాక్ (వికెట్ కీపర్), సూర్య కుమార్ యదవ్, సౌరభ్ తివారి, హర్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, కీరన్ పొలార్డ్, నాథన్ కార్టర్ నీల్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, జయంత్ యాదవ్ 

ఢిల్లీ క్యాపిటల్స్ : రిషభ్ పంత్, స్టీవ్ స్మిత్, శిఖర్ ధావన్, పృథ్వి షా, శ్రేయస్ అయ్యర్, హెట్మెర్, అశ్విన్, కగిసొ రబడ, అవేశ్ ఖాన్, నార్త్జ్, అక్షర్ పటేల్

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !