IPL 2021 RR vs MI: చావో రేవో తేల్చుకోవాల్సిన పోరులో టాస్ నెగ్గిన ముంబై.. గెలిచిన జట్టుకే ప్లే ఆఫ్ అవకాశాలు

Published : Oct 05, 2021, 07:15 PM ISTUpdated : Oct 05, 2021, 07:22 PM IST
IPL 2021 RR vs MI: చావో రేవో తేల్చుకోవాల్సిన  పోరులో టాస్ నెగ్గిన ముంబై.. గెలిచిన జట్టుకే ప్లే ఆఫ్ అవకాశాలు

సారాంశం

IPL 2021 RR vs MI: ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో Mumbai indians జట్టు టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్, ముంబై ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టే నాలుగో స్థానానికి పోటీ పడుతుంది. మరి ఆ విజేత ఎవరో కొద్దిసేపట్లో తెలిసిపోతుంది. 

ఐపీఎల్ సెకండ్ ఫేజ్ లో మరో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. Play Offs బెర్త్ కోసం పోటీ పడుతున్న ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య కీలక పోరుకు సమయం ఆసన్నమైంది. షార్జా వేదికగా చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో Rohit Sharma నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు టాస్ నెగ్గి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.

చెరో పది పాయింట్లతో పాయింట్ల పట్టికలో Rajastan Royals ఆరో స్థానంలో ఉండగా.. ముంబై ఇండియన్స్ ఆ తర్వాత స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్ కోసం ఇప్పటికే మూడు జట్లు బెర్త్ కన్ఫర్మ్ చేసుకోగా.. నాలుగో స్థానం కోసం కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఆసక్తికర పోటీ నడుస్తున్నది. ముంబై, రాజస్థాన్ కంటే KKR కాస్త మెరుగ్గానే కనిపిస్తున్నా ఈ రెండు జట్లకు కూడా తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయి. అయితే ముంబై, రాజస్థాన్ జట్లలో ముందడగు వేసేదెవరో మాత్రం నేటి మ్యాచ్ తో తేలిపోనున్నది. 

కాగా నేటి మ్యాచ్  కోసం ఇరు జట్లు రెండు కీలక మార్పులు చేశాయి. వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ ప్లేస్ లో ఇషాన్ కిషన్, వరుసగా విఫలమవుతున్న కృనాల్ పాండ్యా స్థానంలో జిమ్మీ నీషమ్ ను ముంబై తుది జట్టులోకి తీసుకుంది. మరోవైపు రాజస్థాన్ జట్టులో కూడా రెండు మార్పులు చేసినట్టు కెప్టన్ Sanju Samson తెలిపాడు. మయాంక్ మార్కండే బదులు శ్రేయస్ గోపాల్ ను , ఆకాశ్ సింగ్ ప్లేస్ లో కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగుతున్నారు. జీవన్మరణ పోరాటంలో ఇరు జట్లు తాడో పేడో తేల్చుకోనుండటంతో మ్యాచ్ లో మెరుపులు ఖాయమని అభిమానులు  భావిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే