IPL 2021 KKR vs RR: కీలక మ్యాచ్ లో టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్.. గెలవకుంటే కోల్కతాకు కష్టమే..

Published : Oct 07, 2021, 07:18 PM ISTUpdated : Oct 07, 2021, 07:19 PM IST
IPL 2021 KKR vs RR: కీలక మ్యాచ్ లో టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్.. గెలవకుంటే కోల్కతాకు కష్టమే..

సారాంశం

IPL 2021 KKR vs RR: ప్లే ఆఫ్ బెర్త్ కోసం Mumbai indiansతో గట్టి పోటీ ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్.. నేడు రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగనుంది. ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన రాజస్థాన్.. చివరి మ్యాచ్ లో గెలిస్తే కోల్కతాకు షాక్ ఇచ్చినట్టే.

లీగ్ మ్యాచ్ ల ముగింపు దశకు చేరుకున్న ఐపీఎల్ లో మరో రెండు మ్యాచ్ లు తమ ఆఖరు పోరాటాన్ని చేయనున్నాయి. IPL Playoffs ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే Kolkata knight riders ఈ మ్యాచ్ లో తప్పక నెగ్గి తీరాలి. లేకుంటే అది మిగతా సమీకరణాల మీద ఆధారపడాల్సి వస్తుంది. కాగా టాస్ నెగ్గిన రాజస్థాన్  కెప్టెన్ సంజూ శాంసన్.. తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 

షార్జా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో గెలిచినా, ఓడినా రాజస్థాన్ రాయల్స్ కు పెద్దగా ఒనగూరేదేం లేదు. కానీ చివరి మ్యాచ్ ను విజయంతో ముగించాలని sanju samson నేతృత్వంలోని ఆ జట్టు భావిస్తున్నది. ఆ జట్టు గత మ్యాచ్ లో ముంబై చేతిలో  దారుణ పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. 

ప్లేఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఖచ్చితంగా ఒత్తిడి కోల్కతా పైనేఉంటుంది. ఇది రాజస్థాన్ రాయల్స్ కు కలిసొచ్చేదే.  టోర్నీ ఆధ్యంతం రాణించిన యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ ఈ మ్యాచ్ లోనూ మెరవాలని అనుకుంటున్నారు. ఇదిలాఉండగా నేటి మ్యాచ్ కోసం Rajastan royals తుది జట్టులో నాలుగు మార్పులు చేసింది. లివింగ్ స్టోన్, మోరిస్, అనూజ్ రావత్, ఉనద్కత్ ను జట్టులోకి తీసుకుంది. ఇక కోల్కతా నైట్ రైడర్స్ తరఫున టిమ్ సౌథీ స్థానంలో లాకీ ఫెర్గూసన్ చేరాడు.  

ఐపీఎల్ లో ఇరు జట్లు ఇప్పటివరకు 23 సార్లు తలపడగా.. KKR-12 సార్లు నెగ్గింది. RR-11 సార్లు విజయం సాధించింది. 

జట్లు:
కోల్కతా నైట్ రైడర్స్:
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), శుభమన్ గిల్,  వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితిశ్ రాణా, షకీబ్ అల్ హసన్, దినేశ్ కార్తీక్, సునీల్ నరైన్, శివమ్ మవి, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి

రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), లివింగ్ ప్టోన్, యశస్వి జైస్వాల్, శివం దూబే, గ్లెన్ ఫిలిప్స్, క్రిస్ మోరిస్, రాహుల్ తెవాటియా, జయదేవ్ ఉనద్కత్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, చేతన్ సకారియా, అనూజ్ రావత్

PREV
click me!

Recommended Stories

T20 World Cup: దటీజ్ ఇషాన్ కిషన్.. వరల్డ్ కప్ జట్టులో చోటు కోసం ఏం చేశాడో తెలుసా?
T20 World Cup: భారత జట్టులో శుభ్‌మన్ గిల్‌కు నో ఛాన్స్.. అసలు కారణం ఇదే !