సన్ రైజర్స్ విజయం.. జాసన్ రాయ్ పై కేన్ మామ ప్రశంసలు

Published : Sep 28, 2021, 11:09 AM ISTUpdated : Sep 28, 2021, 12:08 PM IST
సన్ రైజర్స్ విజయం.. జాసన్ రాయ్ పై కేన్ మామ ప్రశంసలు

సారాంశం

 జేసన్ రాయ్ శక్తి నిండిన ఇంజెక్షన్ లాంటివాడని కేన్ విలియమ్సన్ పేర్కొన్నాడు. జేసన్.. అద్భుత ఆటగాడు అని.. జట్టుకి గొప్ప సహకారం అందించాడని విలియమ్సన్ పేర్కొన్నాడు.

ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఎట్టకేలకు రెండో విజయం సాధించింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఆఖరి వరకు నిలిచి సూపర్ ఫిప్టీతో ఆకట్టుకొని మ్యాచ్‌ను గెలిపించాడు. అంతకముందు జేసన్‌ రాయ్‌ 60 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరి అద్భుతమైన ఇన్నింగ్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్ కి విజయాన్ని అందించాయి. కాగా.. ఈ విజయం పట్ల సన్ రైజర్స్ అభిమానులతోపాటు.. కెప్టెన్ కేన్ విలయమ్సన్ కూడా.. చాలా సంతోషం వ్యక్తం చేశారు.

తమ జట్టు విజయానికి సహకరించిన జేసన్ రాయ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. జేసన్ రాయ్ శక్తి నిండిన ఇంజెక్షన్ లాంటివాడని కేన్ విలియమ్సన్ పేర్కొన్నాడు. జేసన్.. అద్భుత ఆటగాడు అని.. జట్టుకి గొప్ప సహకారం అందించాడని విలియమ్సన్ పేర్కొన్నాడు.

ఈ మ్యాచ్ గెలవడం తమకు చాలా ఆనందాన్ని కలిగించిందని.. తమ జట్టు ఆటలో మెరుగుపడిందని కేన్ పేర్కొన్నారు. యువ ఆటగాళ్లు.. తమ అవకాశాన్ని వినియోగించుకొని.. క్రికెట్ ని ఆస్వాదించాలని అనుకుంటున్నారు. అయితే.. టాప్ లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ని ఓడించడం మాత్రం చాలా కష్టమని తాము అనుకుంటున్నట్లు కేన్ పేర్కొన్నారు.

కాగా.. సోమవారం జరిగిన మ్యాచ్ లో... కేన్ విలియమ్సన్, జాసన్ రాయ్.. అద్బుతంగా ప్రదర్శించారు. రాజస్థాన్ రాయల్స్ పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 
 

PREV
click me!

Recommended Stories

Most Educated Cricketer : ధోనీ, కోహ్లీ, రోహిత్ కాదు.. టీమిండియాలో అత్యంత విద్యావంతుడైన క్రికెటర్ ఎవరో తెలుసా?
Preity Zinta Brett Lee: ప్రీతి జింటాతో సీక్రెట్ లవ్? 16 ఏళ్ల తర్వాత షాకింగ్ నిజం చెప్పిన బ్రెట్ లీ