ఆర్సీబీ జెర్సీలో.. చెన్నై అభిమాని.. తన బాధ చెప్పుకుంటూ..!

Published : Sep 28, 2021, 09:42 AM ISTUpdated : Sep 28, 2021, 09:56 AM IST
ఆర్సీబీ జెర్సీలో..  చెన్నై అభిమాని.. తన బాధ చెప్పుకుంటూ..!

సారాంశం

సీఎస్కే వీరాభిమాని అయిన ఓ ప్రేక్షకుడు ఆర్సీబీ జెర్సీ వేసుకొని పట్టుకున్న ప్లకార్డు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘ మా ఆవిడ నన్ను సీఎస్కే జర్సీ వేసుకునేందుకు ఒప్పుకోవడం లేదు’ అంటూ మ్యాచ్ సందర్భంగా తన బాధను ప్లకార్డు రూపంలో ప్రదర్శించాడు.

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే. మ్యాచ్ ఎవరితోనైనా.. ఎక్కడైనా సరే.. అభిమానుల కోలాహాలం భారీ స్థాయిలో ఉంటుంది. సీఎస్కే పోటీ పడిన ప్రతి మ్యాచ్ అభిమానులకు ఎంతో ఆనందాన్ని అందించింది. నిన్న కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ ఎంతో రసవత్తరంగా సాగిందో చూశాం.

అంతకముందు ఆర్సీబీ, సీఎస్కే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా పోటాపోటీగా సాగింది. అందులోనూ సీఎస్కే విజయఢంకా మోగించింది. అయితే.. ఆర్సీబీతో మ్యాచ్ లో ఓ సరదా సంఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

సీఎస్కే వీరాభిమాని అయిన ఓ ప్రేక్షకుడు ఆర్సీబీ జెర్సీ వేసుకొని పట్టుకున్న ప్లకార్డు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘ మా ఆవిడ నన్ను సీఎస్కే జర్సీ వేసుకునేందుకు ఒప్పుకోవడం లేదు’ అంటూ మ్యాచ్ సందర్భంగా తన బాధను ప్లకార్డు రూపంలో ప్రదర్శించాడు.

ఈ చిత్రం ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఫోటోను చెన్నై సూపర్ కింగ్స్  యాజమాన్యం అధికారిక ట్విట్టర్ లో పోస్టు చేసింది. సీఎస్కే పుట్టిన పోస్టుకు 18వేల  లైకులు రాగా.. రెండు వేల మంది రీట్వీట్ చేశారు. ప్రతి సీజన్ లో జెర్సీ మార్చాల్సిన అవసరం లేని జట్టు ఏదైనా ఉంటే అది సీఎస్కే మాత్రమేనని మీ భార్యకు చెప్పు’ అంటూ సరదాగా ఓ నెటిజన్ కామెంట్ చేయడం గమనార్హం. ఇంకొందరేమో.. సీ ఎస్కే గుండెల్లో ఉంటుంది. జెర్సీలో కాదు అంటూ కామెంట్ చేయడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

Top 5 Cricketers : కోహ్లీ, ధోనిని దాటేసిన హార్దిక్.. అత్యంత ఖరీదైన వాచ్ ఎవరిదో తెలుసా?
IND vs NZ : ఆ గ్రౌండ్‌లో రోహిత్, కోహ్లీలకు శని పట్టిందా? 17 ఏళ్లుగా తీరని కోరిక !