మా టీం చెప్పిందే నేను చేశాను.. వెంకటేష్ అయ్యర్..!

By telugu news teamFirst Published Oct 14, 2021, 12:18 PM IST
Highlights

కేకేఆర్ గెలుపు వెంకటేష్ అయ్యర్ కారణమంటూ పొగడ్తతలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ విజయంపై వెంకటేష్ అయ్యర్ మాట్లాడారు. తమ జట్టు చెప్పిందే తాను చేశానని వెంకటేష్ అయ్యర్ పేర్కొన్నాడు.


కోల్ కతా నైట్ రైడర్స్( Kolkata knight riders) ఊహించని రీతిలో ఫైనల్స్ కి చేరింది. బుధవారం జరిగిన మ్యాచ్ లో అందరూ ఢిల్లీ దే గెలుపు అని అనుకున్నారు. కానీ అనూహ్య రీతిలో.. విజయం కేకేఆర్ కి దక్కింది. అందుకు ఆ జట్టు ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ కూడా కారణం.  136 పరుగుల చేథనలో వెంకటేష్ అయ్యర్.. 55య పరుగులు చేయడం గమనార్హం. నాలుగు ఫోర్లు, మూడు సిక్స్ లు కొట్టి జట్టు విజయానికి సహకరించాడు.

దీంతో..  అందరూ వెంకటేష్ అయ్యర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేకేఆర్ గెలుపు వెంకటేష్ అయ్యర్ కారణమంటూ పొగడ్తతలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ విజయంపై వెంకటేష్ అయ్యర్ మాట్లాడారు. తమ జట్టు చెప్పిందే తాను చేశానని వెంకటేష్ అయ్యర్ పేర్కొన్నాడు.

‘ మా జట్టు కోరుకున్నది నేను చేశాను. నిన్నటి మ్యాచ్ గెలిచినందుకు తమకు చాలా సంతోషంగా ఉంది. పిచ్ కూడా ఆటకు చాలా అనువుగా ఉందని ’ ఆయన తెలిపాడు. కాగా.. ఈ మ్యాచ్ లో వెంకటేష్ అయ్యర్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవడం గమనార్హం. 

Also Read: గౌతమ్ గంభీర్ మామూలోడు కాదు... మిలియనీర్ కూతురితో సీక్రెట్ లవ్ స్టోరీ నడిపించిన కేకేఆర్ మాజీ కెప్టెన్..

 ఇదిలా ఉండగా..  ఐపీఎల్ 2021 చివరి అంకానికి చేరుకుంది. నేడు (బుధవారం)జరుగనున్న క్వాలిఫైయర్‌-2, ఆక్టోబర్ 15న జరిగే ఫైనల్‌తో ఈ సీజన్ ముగుస్తున్నది. అయితే ప్రస్తుత సీజన్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌లోను అద్భుతంగా రాణిస్తున్న కోల్‌కతా ఓపెనర్‌ వెంకటేష్‌ అయ్యర్‌కు బంఫర్‌ ఆఫర్‌ తగిలింది. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు నెట్ బౌలర్‌గా అయ్యర్‌ సేవలు అందించనున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ ముగిసిన తర్వాత ఇండియాకు తిరిగి వెళ్లకుండా యూఏఈలో ఉండాలని బీసీసీఐ ఆదేశించింది.

ఇప్పటికే ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌,  ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్‌ ఆవేశ్‌ ఖాన్‌ కూడా నెట్‌ బౌలర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా  వెంకటేష్‌ అయ్యర్‌ రావడంతో ఆ సంఖ్య మూడు కు చేరింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ యువ ఆల్‌రౌండర్‌ ఐపీఎల్‌ 2021 సీజన్‌లో కేకేఆర్‌ తరపున 8 మ్యాచ్‌ల్లో  265 పరుగులు , మూడు వికెట్లు సాధించాడు. కాగా ఆక్టోబర్ 24న భారత్‌ తన తొలి మ్యాచ్‌లో దాయాది దేశం పాక్‌తో తలపడనుంది.

click me!