IPL2021: ఢిల్లీపై విజయం.. కేకేఆర్ ఫినిషింగ్ అదిరిపోయిందంటూ హోరెత్తిస్తున్న ట్విట్టర్..!

By telugu news teamFirst Published Oct 14, 2021, 10:55 AM IST
Highlights

అభినవ్ ముకుంద్, కుల్ దీప్ యాదవ్ లు కూడా ట్విట్టర్ వేదికగా కోల్ కతా జట్టుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అందరూ ఢిల్లీ గెలిచి.. ఫైనల్స్ కి వెళుతందనే అనుకున్నారు.

IPL 2021 సీజన్ చివరి అంఖానికి చేరుకుంది. ఫైనల్ కి రెండు జట్లు చేరుకున్నాయి. ఇక చివరగా..  చెన్నై ( chennai super kings), కేకేఆర్( Kolkata Knight Riders) లు మాత్రమే తలపడనున్నాయి.  ఈ సీజన్ మొత్తం నిలకడగా రాణించిన పంత్ సేన.. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓటమిపాలై లీగ్ నుంచి నిష్క్రమించింది. చేసింది తక్కువ స్కోరే అయినా విజయం  కోసం  చివరి బంతికి వరకు పోరాడింది. ఢిల్లీ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 7 వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో ఛేదించింది. చివరి బంతితో ఫినిషింగ్ ఇచ్చి..  ఫైనల్స్ కి చేరుకుంది.

Also Read: IPL2021: ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల గుండె పగిలిన క్షణం.. కన్నీరుమున్నీరైన రిషభ్ పంత్, పృథ్వీ షా

దీంతో.. కోల్ కతా నైట్ రైడర్స్ విజయం పై ట్విట్టర్ లో ప్రశంసలు కురిపిస్తున్నారు. అభినవ్ ముకుంద్, కుల్ దీప్ యాదవ్ లు కూడా ట్విట్టర్ వేదికగా కోల్ కతా జట్టుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అందరూ ఢిల్లీ గెలిచి.. ఫైనల్స్ కి వెళుతందనే అనుకున్నారు. చివరి బంతితొ కేకేఆర్ చేసిన మ్యాజిక్ కి ట్విట్టర్ ఫిదా అయిపోయింది. 

ఢిల్లీ ఇచ్చిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్‌ ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, వెంకటేశ్‌ అయ్యర్‌ 12 ఓవర్ల వరకు వికెట్ కోల్పోకుండా జట్టును విజయం వైపుకు నడిపించారు. అయితే 13వ నుంచి ఢిల్లీ బౌలర్లు ఒక్కసారిగా రెచ్చిపోయారు. వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా (13) వెంటవెంటనే ఔట్ అయ్యారు. 17వ ఓవర్లో శుభ్‌మన్‌ గిల్ .. ఆ వెంటనే దినేశ్‌ కార్తిక్‌ (0), కెప్టెన్‌ ఇయాన్ మోర్గాన్‌ (0) ఔటవ్వడంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. చివరి ఓవర్లో సమీకరణం ఆరు బంతుల్లో ఏడు పరుగులుగా మారింది.

ఆఖరి ఓవర్ వేసిన అశ్విన్ వరుస బంతుల్లో.. షకిబ్‌ అల్ హసన్‌ (0), సునీల్ నరైన్ (0) పెవిలియన్‌కు పంపాడు. దీంతో సమీకరణం రెండు బంతుల్లో ఆరు పరుగులుకు మారడంతో పాటు మ్యాచ్ చూస్తున్న వారిలో టెన్షన్ పెరిగిపోయింది. అయితే, 19.5 బంతిని రాహుల్ త్రిపాఠి (12) భారీ సిక్సర్‌గా మలచడంతో కోల్‌కతా ఘన విజయం . ఈ విజయంతో నైట్ రైడర్స్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. శుక్రవారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తుదిపోరులో తలపడనుంది.  

అంతకుముందు కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ (36), శ్రేయస్ అయ్యర్‌ (30 నాటౌట్) రాణించారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి రెండు, శివమ్ మావి, లాకీ ఫెర్గూసన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌‌కు ఆరంభానికి నుంచి నిలకడగానే ఆడింది. ఓపెనర్‌ పృథ్వీ షా (18) వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టొయినిస్‌ (18).. మరో ఓపెనర్ శిఖర్‌ ధావన్‌తో కలిసి నిలకడగా ఆడుతూ పరిస్ధితిని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను శివమ్ మావి విడదీశాడు. తొలుత స్టోయినిస్ 12 ఓవర్‌లో, ఆ వెంటనే ధావన్‌ వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (6) సైతం నిరాశపరిచాడు. చివరిలో వచ్చిన హెట్‌మైర్‌ (17) దూకుడుగా ఆడటంతో ఢిల్లీ ఆమాత్రం స్కోరునైనా చేసింది.

click me!