నేను బాల్ వేస్తే వికెట్లు విరగాల్సిందంతే..! బుల్లెట్ వేగంతో దూసుకొస్తున్న ఉమ్రన్ మాలిక్..

Published : Oct 07, 2021, 12:22 PM ISTUpdated : Oct 07, 2021, 12:32 PM IST
నేను బాల్ వేస్తే వికెట్లు విరగాల్సిందంతే..!  బుల్లెట్ వేగంతో  దూసుకొస్తున్న ఉమ్రన్ మాలిక్..

సారాంశం

Umran Malik: ఒక మ్యాచ్ లో అత్యంత వేగంగా బంతులు వేస్తే అది అద్భుతం. అదే ప్రతి మ్యాచ్ లో అంతకు మించిన వేగంతో బౌలింగ్ వేస్తే..! క్రీడా పండితుల విశ్లేషణ ఏమో గానీ హైదరాబాద్ ఫ్యాన్స్ మాత్రం రచ్చో.. రచ్చస్య.. రచ్చోభ్య: అని కితాబులిచ్చేస్తున్నారు. ఆ ప్రశంసలు అందుకుంటున్నది నయా సంచలనం ఉమ్రన్ మాలిక్. 

ప్రస్తుత IPL 14 సీజన్ లీగ్ దశ ముగింపునకు చేరుకున్నది. ఇప్పటికే Play offs అవకాశాలను కోల్పోయి.. విజయాలకు  మొహం వాచిపోయిన sun risers Hyderabd జట్టుకు ఈ సీజన్లో ఒక ఆణిముత్యం లాంటి బౌలర్ దొరికాడు. ఆడింది రెండే మ్యాచ్ లు అయినా  నాలుగు టోర్నీలలో ఇరగదీసినంత పేరు గడించాడు. నిన్నటి ఆర్సీబీ మ్యాచ్ తో పాటు నాలుగు రోజుల క్రితం కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో Umran malik.. తన మెరుపు వేగంతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ను వణికించాడు. 

కోల్కతా తో మ్యాచ్ లో గంటకు 151 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరిన ఉమ్రన్.. ఆర్సీబీతో మ్యాచ్ లో మరింత చెలరేగాడు. virat సేన బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తొమ్మిదో ఓవర్ వేయాలని  kane williamson బంతిని ఉమ్రన్ కు అందించాడు.

ఆ ఓవర్ లో వరుస బంతుల స్పీడ్.. 147, 151, 152, 153. ఈ క్రమంలో ఐపీఎల్ 2021 లో రికార్డులను తిరగరాశాడు. గంటకు 153 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరిన ఉమ్రన్..  హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించడమే గాక ఆర్సీబీ వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ వికెట్ కూడా తీశాడు. 
 

ఇది కూడా చదవండి: తండ్రి కూరగాయల వ్యాపారి.. కొడుకు ఈ ఐపీఎల్ సీజన్ లోనే అత్యంత వేగంగా బంతులు వేసిన బౌలర్..

గత ఆదివారం 151 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి ఈ ఐపీఎల్ సీజన్ లో అత్యంత వేగంగా బాల్ వేసిన బౌలర్ గా రికార్డు సృష్టించిన ఈ జమ్ము బౌలర్... తాజాగా IPL 2021 లో వేగంగా బంతులేసిన బౌలర్ గా ఘనత సాధించాడు.  ఈ జాబితాలో టాప్ 5 లో ఉన్నవారి వివరాలు చూద్దాం. 

1. ఉమ్రన్ మాలిక్ (SRH)   గంటకు 153 కిలోమీటర్ల వేగం 
2. లాకీ ఫెర్గుసన్ (KKR)    152.75 
3. లాకీ ఫెర్గుసన్ (KKR)    152.74
4. అన్రిచ్ నార్త్జ్ (DC)       151.37
5. ఉమ్రన్ మాలిక్ (SRH) 151.03

PREV
click me!

Recommended Stories

Sophie Devine : 4, 4, 6, 6, 6, 6 అమ్మబాబోయ్ ఏం కొట్టుడు.. ఒక్క ఓవర్‌లో 32 రన్స్
IND vs NZ : కోహ్లీ, గిల్ విధ్వంసం.. కేఎల్ రాహుల్ మాస్ ఫినిషింగ్