నేడు ఐపీఎల్ షెడ్యూల్: అభిమానుల్లో ఉత్కంఠ

Siva Kodati |  
Published : Sep 06, 2020, 02:35 PM IST
నేడు ఐపీఎల్ షెడ్యూల్: అభిమానుల్లో ఉత్కంఠ

సారాంశం

సెప్టెంబర్ 19న జరగనున్న ఐపీఎల్ 13వ సీజన్‌కు సంబంధించి ఇవాళ బీసీసీఐ షెడ్యూల్‌ను ప్రకటించింది

సెప్టెంబర్ 19న జరగనున్న ఐపీఎల్ 13వ సీజన్‌కు సంబంధించి ఇవాళ బీసీసీఐ షెడ్యూల్‌ను ప్రకటించింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది యూఏఈలో ఐపీఎల్ నిర్వహిస్తున్నట్లు చెప్పినప్పటికీ, ఇందుకు సంబంధించిన షెడ్యూల్ మాత్రం విడుదల చేయకపోవడంపై క్రికెట్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

దీనికి తోడు చెన్నై సూపర్ కింగ్స్‌లో కోవిడ్ కేసుల కలకలం తదితర కారణాల వల్ల ఐపీఎల్‌కు ఏమైనా అవాంతరాలు వచ్చాయా... అనుకున్న విధంగా లీగ్ జరుగుతుందా అన్న సందేహాలు వినిపించాయి.

వీటన్నింటికి తెర దించుతూ బీసీసీఐ షెడ్యూల్ విడుదలకు సిద్ధమైంది. ఆదివారం ఐపీఎల్ 2020 షెడ్యూల్‌ను ప్రకటిస్తామని ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ ప్రకటించారు. చెన్నై సూపర్ కింగ్స్ కాస్త ఆలస్యంగానైనా ప్రాక్టీస్ మొదలుపెట్టడంతో అనుకున్న ప్రకారమే ఆ జట్టు ముంబైతో తలపడే అవకాశం వుంది. 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !