కోహ్లీకి మరో షాక్: రాజస్థాన్ రాయల్స్ పై బెంగళూరు ఓటమి

By Siva KodatiFirst Published Apr 3, 2019, 7:34 AM IST
Highlights

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ మారడం లేదు. మెరుపుల్లేని బ్యాటింగ్.. పసలేని బౌలింగ్... చెత్త ఫీల్డింగ్‌తో బెంగళూరు ఈ సీజన్‌లో వరుసగా నాలుగో ఓటమి మూటకట్టుకుంది

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ మారడం లేదు. మెరుపుల్లేని బ్యాటింగ్.. పసలేని బౌలింగ్... చెత్త ఫీల్డింగ్‌తో బెంగళూరు ఈ సీజన్‌లో వరుసగా నాలుగో ఓటమి మూటకట్టుకుంది.

జైపూర్‌లో  మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.

స్టార్ ఆటగాళ్లు కోహ్లీ, డివిలియర్స్ విఫలమవ్వడంతో బెంగళూరు చతికిలపడింది. పార్థివ్ పటేల్ నిలబడకపోయుంటే జట్టు ఆ మాత్రం స్కోరు కూడా సాధించలేకపోయేది. శ్రేయస్ గోపాల్ 3 కీలక వికెట్లు తీసి రాయల్ ఛాలెంజర్స్‌ను చావుదెబ్బ తీశాడు.

లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ లక్ష్యం దిశగా సాగింది. ఓపెనర్ రహానె, జోస్ బట్లర్ జట్టుకు శుభారంభాన్నిచ్చారు. రహానే ఔటైనా బట్లర్.. స్మిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు.

ఫోర్లు, సిక్సర్లతో ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. లక్ష్యానికి కొద్ది దూరంలో బట్లర్ పెవిలియన్ చేరాడు. చివరి రెండు ఓవర్లలో 12 పరుగులు చేయాల్సిన స్థితిలో సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. నాలుగు పరుగులే ఇచ్చి స్మిత్‌ను అతను ఔట్ చేశాడు. అయితే త్రిపాఠి, స్టోక్స్ పని ముగించారు. 

click me!