చివరలో భయపెట్టిన కృణాల్: ముంబైపై రాజస్థాన్ విజయం

Published : Apr 13, 2019, 04:06 PM ISTUpdated : Apr 13, 2019, 07:48 PM IST
చివరలో భయపెట్టిన కృణాల్: ముంబైపై రాజస్థాన్ విజయం

సారాంశం

ఐపిఎల్ 2019లో భాగంగా వాంఖడే స్టేడియంలో  ముంబై ఇండియన్స్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. చివరలో ముంబై బౌలర్ కృణాల్ పాండ్యా భయపెట్టినప్పటికీ శ్రేయాస్ గోపాల్ లాంఛనం పూర్తి చేసి రాజస్థాన్ కు విజయాన్ని చేకూర్చి పెట్టాడు.

ృఐపిఎల్ లో భాగంగా శనివారం జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ పై రాజస్థాన్ రాయల్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బట్లర్ అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా చివరలో కృణాల్ పాండ్యా భయపెట్టినప్పటికీ రాజస్థాన్ రాయల్స్ మూడు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ముంబై తన ముందు ఉంచిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరలో రాజస్థాన్ వరుసగా వికెట్లు జారవిడుచుకుని సులభంగా దక్కాల్సిన విజయాన్ని కష్టంగా మార్చుకుని చెమటోడ్చింది. శ్రేయాస్ గోపాల్ 7 బంతుల్లో 13 పరుగులు చేసి విజయాన్ని అందించాడు. ముంబై బౌలర్లలో కృణాల్ పాండ్యా మూడు వికెట్లు తీయగా, బుమ్రాకు రెండు, చాహర్ కు ఒక్క వికెట్ లభించాయి.

ముంబైపై రాజస్థాన్ 174 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. కృణాల్ పాండ్యా వరుసగా వికెట్లు తీసి దడపుట్టించాడు.ముంబైపై రాజస్థాన్ రాయల్స్ 170 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. సంజూ శాంప్సన్ 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బుమ్రా బౌలింగులో అవుటయ్యాడు. ఆ తర్వాత మరో మూడు పరుగులు మాత్రమే జోడించి రాజస్థాన్ నాలుగో వికెట్ కోల్పోయింది.త్రిపాఠి ఒక్క పరుగు మాత్రమే చేసి కృణాల్ పాండ్యా బౌలింగులో అవుటయ్యాడు. దీంతో 173 పరుగుల వద్ద రాజస్థాన్ నాలుగో వికెట్ కోల్పోయింది.

ముంబై బౌలర్లకు చుక్కలు చూపించిన రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్ మన్ బట్లర్ ఎట్టకేలకు అవుటయ్యాడు. దీంతో ముంబై ఇండియన్స్ బౌలర్లు ఊపరి పీల్చుకున్నారు. దాంతో రాజస్థాన్ 147 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. బట్లర్ 43 బంతుల్లో 7 సిక్స్ లు, 8 ఫోర్ల సాయంతో 89 పరుగులు చేశాడు. అప్పటికి విజయానికి రాజస్థాన్ 40 బంతుల్లో 40 పరుగులు చేయాల్సి ఉండింది. 

ముంబై తమ ముందు ఉంచిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్60 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ అజింక్యా రహానే 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కృణాల్ పాంఢ్యా బౌలింగులో వెనుదిరిగాడు.

సొంత మైదానం వాంఖడేలో ముంబై బ్యాట్ మెన్స్ చెలరేగారు. ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్, డికాక్ చెలరేగి 10 ఓవర్లలోనే 96 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  ఇలా గట్టి పునాది పడటంతో ముంబై జట్టు 187 పరుగులు భారీ స్కోరు సాధించింది. రోహిత్ 47, డికాక్ 81 పరుగులతో రాణించగా చివర్లో హార్దిక్ పాండ్యా (11 బంతుల్లో 28 పరుగులు) మెరుపులు మెరిపించాడు.రాజస్ధాన్ బౌలర్లలో ఆర్చర్ 3, కుల్ కర్ణి, ఉనద్కత్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 

వాంఖడే మ్యాచ్ ఆరంభం నుండి అరదగొడుతూ భారీ ఇన్నింగ్స్ నెలకొల్పి శుభారంభాన్నిచ్చిన డికాక్ ఔటయ్యాడు. 52 బంతుల్లో 81 పరుగులు చేసిన డికాక్ ని ఆర్చర్ పెవిలియన్ కు పంపించాడు. దీంతో 163 పరుగుల వద్ద ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. గత  మ్యాచ్ లో ఒంటిచేత్తో ముంబైని గెలిపించిన పొలార్డ్ రాజస్థాన్ పై రాణించలేకపోయాడు. అతడు కేవలం 6 పరుగుల వద్ద ఆర్చర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో ముంబై జట్టు 136 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 

ముంబై ఇండియన్స్ జట్టు రెండో వికెట్ ను కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ ఔట్ తర్వాత బ్యాటింగ్ కు దిగిన సూర్య కుమార్ యాదవ్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. అతడు 10 బంతుల్లో 16 పరుగులు చేసి కుల్ కర్ణి బౌలింగ్ ఔటయ్యాడు. ధనా ధన్ షాట్లతో  ముంబై బ్యాట్ మెన్స్ రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో కేవలం 10 ఓవర్లలోనే ముంబై 96 పరుగులు సాధించింది. అయితే కెప్టెన్,ఓపెనర్ రోహిత్ శర్మ (47 పరుగుల) హాఫ్ సెంచరీకి చేరువైన సమయంలో ఓ భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. 

ఐపిఎల్ 2019లో భాగంగా వాంఖడే స్టేడియంలో శనివారం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా పీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆతిథ్య ముంబై జట్టు మొదట బ్యాటింగ్ చేసింది.

లీగ్ దశలో వరుస విజయాలతో అదరగొడుతున్న ముంబై జట్టు పాయింట్స్ టెబుల్ లో మూడో స్థానంలో వుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆరు మ్యాచులాడగా నాలుగింటిని గెలుచుకుని రెండిట్లో ఓటమిపాలయ్యింది. ఇది రాజస్థాన్ కు ఐదో విజయం. ఇక రాజస్థాన్ జట్టు ఈ సీజన్ ను పేలవంగా ఆరంభించింది.  ఇప్పటివరకు ఈ జట్టు ఆరు మ్యాచులాడగా కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలిచి ఐదింట్లో ఓటమిపాలయ్యింది. ఇలా సక్సెస్ ఫుల్ జర్నీ సాగిస్తున్న ముంబై, ఓటములతో సతమతమవుతున్న రాజస్థాన్ ల మధ్య ఇవాళ రసవత్తర పోరు జరిగింది..  

ముంబై జట్టు:

రోహిత్ శర్మ(కెప్టెన్), డికాక్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కిరాన్ పోలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, జోసెఫ్, రాహుల్ చాహర్, బెహ్రెంఢార్ప్, బుమ్రా

రాజస్థాన్ జట్టు: 

అజింక్యా రహానే(కెప్టెన్), జోస్ బట్లర్, సంజు శాంసన్(వికెట్ కీపర్), స్టీవ్ స్మిత్, రాహుల్ త్రిపాఠి, లివింగ్ స్టోన్, క్రిష్ణప్ప గౌతమ్, ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, జాదవ్ ఉనద్కత్, ధావల్ కుల్‌కర్ణి  

PREV
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?