మరోసారి బేబీ సిట్టర్ గా మారిన రిషబ్... ధావన్‌ భార్య నుంచి ప్రశంసలు (వీడియో)

Published : Apr 13, 2019, 03:51 PM IST
మరోసారి బేబీ సిట్టర్ గా మారిన రిషబ్... ధావన్‌ భార్య నుంచి ప్రశంసలు (వీడియో)

సారాంశం

ఆస్ట్రేలియా పర్యటనలో మంచి బేబీసిట్టర్ గా పేరు తెచ్చుకున్న రిషబ్ పంత్ ఆ నైపుణ్యాన్ని ఐపిఎల్ లో ప్రదర్శిస్తున్నాడు. ఆసిస్ కెప్టెన్ టిమ్ ఫైన్ భార్య నుండి మంచి బేబీ సిట్టర్ గా పంత్ ప్రశంసలందుకున్న విషయం తెలిసిందే. అయితే అదే ఆస్ట్రేలియాకు చెందిన శిఖర్ ధావన్ భార్య ఆయేషా ముఖర్జీ చేత కూడా మరోసారి ఉత్తమ బేబీ సిట్టర్ గా  ప్రశంసలు పొంది పిల్లలను ఆడించడంలో తానో సిద్దహస్తుడినని పంత్ నిరూపించుకున్నారు. 

తాజాగా శుక్రవారం  ఈడెన్ గార్డెన్స్ లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌-ఢిల్లీ  క్యాపిటల్స్‌ మధ్య ఐపీఎల్‌ మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కు ముందు పంత్ మరోసారి బేబీ సిట్టర్ అవతారమెత్తాడు. పంత్ తన సహచర ఆటగాడు శిఖర్ ధావన్ కొడుకు జొరావర్ తో మైదానంలోనే సరదాగా ఆడుకుంటూ కనిపించాడు. ఓ టవల్ తో జూనియర్ ధావన్ ను బందిస్తూ ఆటపట్టించాడు. ఇలా ధావన్ భార్య ముఖర్జీ ముందే జొరావర్ ని పంత్ ఆడించాడు. దీంతో ఆమె కూడా  పంత్ ని మంచి బేబీ సిట్టర్ అంటూ ప్రశంసించింది. 

ఇలా ధావన్ కొడుకుని రిషబ్ పంత్ ఆడిస్తున్న వీడియోను డిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ అధికారికి ట్విట్టర్లో పోస్ట్ చేసింది. రిషబ్ బేబీ సిట్టింగ్ నైపుణ్యం మరో లెవెల్ కి చేరుకుందనడానికి ప్రూఫ్ ఇదే అంటూ ఈ వీడియోకు ఓ కామెంట్ జతచేస్తూ డిసి యాజమాన్యం ట్వీట్ చేసింది.  దీంతో ఈ వీడియో నెటిజన్లకు సైతం అమితంగా నచ్చడంతో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతూ వైరల్ గా మారింది.

PREV
click me!

Recommended Stories

IND vs SA: గిల్ అవుట్.. శాంసన్ ఇన్.. వచ్చీ రాగానే రికార్డుల మోత, కానీ అంతలోనే..
ఐపీఎల్ ముద్దు.. హనీమూన్ వద్దు.. నమ్మకద్రోహం చేసిన ఆసీస్ ప్లేయర్.. పెద్ద రచ్చ జరిగేలా ఉందిగా